Jump to content

మలబార్ (నావికాదళ విన్యాసాలు)

వికీపీడియా నుండి
బంగాళాఖాతంలో అమెరికా, భారత్, జపాన్ దేశాలకు చెందిన నౌకలు
భారతీయ నావికాదళం MIG-29K ఫుల్‌క్రమ్ విమానం యుఎస్‌ఎస్ నిమిట్జ్ మీదుగా ఎగురుతుంది
   


మలబార్ విన్యాసం (ఎక్సర్ సైజ్ మలబార్ ) అనేది ఒక చతుర్భుజ ఆకృతి లో జరిగే నౌకా విన్యాసం , ఇందులో అమెరికా సంయుక్త రాష్ట్రాలు , జపాన్, ఆస్ట్రేలియా, ఇంకా భారతదేశం శాశ్వత భాగస్వాములుగా ఉన్నాయి వాస్తవానికి 1992లో భారత్, అమెరికా ల మధ్య ద్వైపాక్షిక కసరత్తు గా ప్రారంభమైన తరువాత జపాన్ 2015లో శాశ్వత భాగస్వామి అయింది.[1] గతంలో సింగపూర్ శాశ్వత భాగస్వామ్యం లేకుండా వార్షిక మలబార్ సిరీస్ 1992 లో ప్రారంభమైంది వైమానిక కార్యకలాపాల నుండి మారిటైమ్ ఇంటర్‌డిక్షన్ ఆపరేషన్స్ విన్యాసాలు , యుద్ధ పోరాట కార్యకలాపాల కన్నా విభిన్న కార్యకలాపాలను కలిగి ఉంది.[2]

2020 లో భారతదేశం చేసిన కసరత్తులలో ఆస్ట్రేలియాను చేర్చాలనే నిర్ణయంతో, క్వాడ్ అని పిలువబడే ప్రాంతీయ సమూహంలోని సభ్యులందరూ సైనికపరంగా పాల్గొనడం ఇదే మొదటిసారి.మలబార్‌-2020 విన్యాసాల సభ్య దేశాలు, సముద్ర రంగ భద్రతను పెంచుకునే ఏర్పాట్లలో ఉన్నాయి. ఇందులో పాల్గొనే దేశాలన్నీ, ఇండో-పసిఫిక్‌కు స్వేచ్ఛాయుత, బహిరంగ, సమగ్ర మద్దతు ఇస్తాయి[3]

చరిత్ర

[మార్చు]

హిందూ మహాసముద్రంలో భారత నావికాదళం-యూఎస్ నావికాదళం మధ్య ద్వైపాక్షిక కసరత్తుగా 1992 లో మలబార్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి.1998కి ముందు మూడుసార్లు జరిగాయి, అప్పుడు అమెరికన్లు భారతదేశం అణ్వాయుధ పరీక్షచేసిన తరువాత ఈ విన్యాసాలను నిలిపివేశారు.[4] అయితే, అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ చేసిన ప్రచారంలో భారతదేశం చేరినప్పుడు సెప్టెంబర్ 11 దాడుల తరువాత యునైటెడ్ స్టేట్స్ భారతదేశముతో సైనిక సంబంధాలను పునరుద్ధరించింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ విన్యాసాల్లో 2015 నుంచి జపాన్‌ కూడా శాశ్వత భాగస్వామిగా చేరింది. గత సంవత్సరం జపాన్‌ తీరంలో ఈ విన్యాసాలు జరుపగా, 2018లో ఫిలిప్పైన్స్‌ సముద్ర తీరంలో జరిపారు. 2020 లోని విన్యాసాల్లో భారత్‌తోపాటు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన నేవీ ఫోర్స్ పాల్గొన్నాయి.ఇందులో ఆస్ట్రేలియా తొలిసారిగా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటోంది. 2020 నవంబర్ లో కొనసాగనున్న మొదటి దశ కసరత్తుల్లో కొవిడ్‌-19 పరిమితుల కారణంగా నాలుగు దేశాల సైనిక సిబ్బంది మధ్య ఎటువంటి సంబంధం లేదు .[5]ఈ నాలుగు దేశాల నావికా దళాలు కలసి విన్యాసాలు చేయడం పదమూడేళ్ళలో ఇదే మొదటి సారి.[6] 24వ విడతగా చేపడుతున్న ఈ విన్యాసాలు రెండో దశలో నవంబరు 2020 లో 17 నుంచి 20వ తేదీ వరకు అరేబియా సముద్రంలో కొనసాగాయి[7]

మూలాలు

[మార్చు]
  1. Diplomat, Franz-Stefan Gady, The. "India, US, and Japan to Hold 'Malabar' Naval War Games This Week". The Diplomat. Archived from the original on 13 June 2018. Retrieved 5 June 2018.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  2. "Military Exercises –– Feb to Nov 2008". Archived from the original on 19 December 2008. Retrieved 28 November 2008.
  3. "మలబార్‌-2020 నౌకాదళ విన్యాసాలు". pib.gov.in. Retrieved 2020-11-04.
  4. "India, US hold naval exercises" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2003-10-05. Retrieved 2020-11-04.
  5. "బంగాళాఖాతంలో 'మలబార్‌' యుద్ధ క్రీడలు.. పాల్గొన్న భారత్‌, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా". ntnews. 2020-11-03. Archived from the original on 2020-11-03. Retrieved 2020-11-04.
  6. Telugu7 (2020-04-11). "బంగాళాఖాతంలో అట్టహాసంగా "మలబార్ 2020" విన్యాసాలు". telugu7.com (in English). Retrieved 2020-11-04.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)[permanent dead link]
  7. "నేటి నుంచి మలబార్‌ విన్యాసాలు". m.eenadu.net. Retrieved 2020-11-04.