మల్లాది నరసింహ శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్లాది నరసింహ శాస్త్రి[1] ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో మూడు దశాబ్దాలుగా అసిస్టెంట్ స్క్రిప్ట్ ఎడిటరుగా పనిచేసాడు.

జీవిత విశేషాలు[మార్చు]

అతను తెలుగు రచయిత మల్లాది రామకృష్ణ శాస్త్రి, వెంకటరమణమ్మ దంపతుల కుమారుడు. అతనికి ఒక తమ్ముడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అతని తమ్ముడు మల్లాది సూరిశాస్త్రి కథలూ, కవిత్వమూ రాయడమే కాకుండా జ్యోతిష్యంలో కూడా అతనికి ప్రావీణ్యం ఉండేది. తండ్రి, తమ్ముడు అంత కాకపోయినా నరసింహ శాస్త్రి కూడా అప్పుడప్పుడు కథలు రాసేవాడు. రేడియోలో పనిచేసే రోజులలో చాలా కథలు రాశాడు. ఆర్. కె. నారాయణ్ రచించిన ‘గైడ్’ నవలను తెలుగులోకి అనువదించాడు.[2]

వ్యవసాయ విభాగములో అతను చక్కటి పేరు తెచ్చుకున్నాడు. విజయవాడలో అనౌన్సర్ గా చేరి స్క్రిప్ట్ రైటర్ గా వ్యవసాయ విభాగములో చేరాడు. 1984 లో పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిర పడ్డాడు.[3] అతని కుమారుడు "సుమన్". దూర దర్శన్ లో అసిస్టెంటు డైరెక్టర్ గా పనిచేస్తూన్న శైలజా సుమన్ అతని కోడలు. ఆమె జంధ్యాల రాధాకృష్ణ గారి కుమార్తె. ఆమె రేడియోలో ఉద్యోగం లో ప్రవేశించి, స్వయంకృషితో తొందరగానే మంచి పేరు సంపాదించుకుంది.

తన తండ్రి రచయిత, కవి, సినీ గీత రచయితగా 1930 నుండి తర్వాతి మూడున్నర దశాబ్దాల కాలంలో వెలువరించే వ్యాసాల సమాహారం "చలవ మిరియాలు". ఈ పుస్తకాన్ని 103వ జయంతిని పురస్కరించుకుని 2008లో విశాలాంధ్ర అస్ంస్థ వెలువరించింది. ఈనికి నరసింహశాస్త్రి సంపాదకత్వం వహించాడు.

మూలాలు[మార్చు]

  1. "స్వర సుధాకరులు - ఆల్ ఇండియా రేడియో". www.maganti.org. Retrieved 2020-07-14.
  2. "తెలుగువాడీ వాడి వేడీ". Sakshi. 2014-09-11. Retrieved 2020-07-14.
  3. "ప్రసార ప్రముఖులు/హైదరాబాదు కేంద్రం - వికీసోర్స్". te.wikisource.org. Archived from the original on 2020-06-26. Retrieved 2020-07-14.