Jump to content

మహాత్మా గాంధీమీద డాక్టర్ అవధానం రఘుకుమార్ గ్రంథం

వికీపీడియా నుండి

డాక్టర్ అవధానం రఘుకుమార్. డాక్టర్ అవధానం రఘుకుమార్ వృత్తిరీత్యా హైకోర్టు న్యాయవాది, వామపక్ష భావాలు కలవారు. గత ఆరేడేళ్ళుగా గాంధీజీ మీద వచ్చిన గొప్ప రచయితల గ్రంథాలు, గాంధీజీ సాహిత్యం అధ్యయనం చేసి, గాంధీజీ బోధనలు ఈనాటి ప్రపంచానికి ఎంతవరకు అవసరమో "Gandhi A Hope in Despair" రచనచేశారు. మనలో చాలమమంది చదవని అనేక ప్రామాణిక గ్రంథాలనుంచి ఉదాహరిస్తూ ఈనాటి సంక్షుభిత ప్రపంచానికి సత్యాహింసలు, మినిమలిజం, శ్రమైక జీవన సౌందర్యం వంటి విషయాలను సులభశైలిలో వివరించారు. మనలో మహాత్మాగాంధీజీ పట్ల ఉన్న అపోహలు, సందేహాలు అన్నీ సహేతుకంగా వివరించారు. ఏంతో కృషి, శ్రమ, పరిశోధన చేసి గాంధీజీ తత్వాన్ని ఈ గ్రంథంలో చేర్చారు. ప్రతితరం గాంధీజీ సిద్ధాంతాలను ఇట్లా పునర్మూల్యాంకనం(reassesment)చేయడానికి ప్రయత్నించడమే మహాత్మా బోధనల అవసరాన్ని తెలియజేస్తున్నది. వివిధ భావజాలాలవారు గాంధీజీ పట్ల ఆకర్షితులయ్యారు. తన భావజాలంతో విభేదించిన వారిపట్ల కూడా గాంధీజీ అమిత ప్రేమను ప్రదర్శించారు.

గాంధీజీ మీద వచ్చిన అనేక పుస్తకాలను, విభిన్న దృక్పథాలతో రాసిన గ్రంథాల సారాన్ని వడబోసి సాధారణ పాఠకులకు తేలికగా తెలిసేట్లు రచయిత ఈ పుస్తకంలో వివరించారు.

రఘుకుమార్ గారు సరైన సమయంలో ఈ గ్రంథాన్ని ప్రచురించారు. ఒక మౌనకుతంత్రంతో(silence conspiracy) మహాత్మాగాంధీ స్మృతులను, జవహర్ లాల్ వంటి వారి స్మృతులను, జాతి జ్ఞాపకాలనుంచి చెరిపివేయడానికి ఒక బలమైనవర్గం తయారవుతున్న కాలం ఇది.

గాంధీజీ హంతకుడు గాడ్సేను బిజెపివారు కూడా బహిరంగంగా హీరోనుచేసి మాట్లాడలేరుగాని, ఆ తెగవారికి గాంధీజీ పట్ల గౌరవభావం ఉందనడం సందేహమే. గాంధీ పట్ల వామపక్షాల, విప్లవపార్టీలవారి అభిప్రాయాలు ఒకలాగే ఉన్నాయి.

రఘుకుమార్ గొప్ప నిగ్రహంతో గాంధీజీ తత్వాన్ని వెలికితీశారు. ఈ గ్రంథం ముగింపు పుటలలో గాంధీజీ బోధనల అవసరాన్ని, గాంధీజీ బోధనల తత్వాన్ని ఆవిష్కరించారు.గాంధీజీ సిద్ధాంతవేత్త కారు. ఆయన జీవితం, ఆచరణే ఆయన సందేశం.

ఉపయోగంలేని కన్స్యూమరిజంకు విరుద్ధంగా, మినిమలిజం, రైతుల శ్రమను గుర్తించాలని చెప్పడం, ఎంత మేధోశ్రమ చేసేవారైనా శరీరశ్రమలో పాల్గొనాలని ఆచరణ ద్వారా గాంధీజీ ఇచ్చిన సందేశాన్ని చక్కగా ఈ పుస్తకంలో ఆందరికీ తెలిసేట్లు రాశారు.

డాక్టర్ రఘుకుమార్ పాండిత్యం, విశ్లేషణాశక్తి, తార్కికత, పక్షపాతం లేకుండా నిజాన్ని పాఠకులముందు పెట్టడం, ఈ గ్రంథానికి విశేష గౌరవం కలిగించాయి, ఇది గొప్ప పరిశోధనాగ్రంథం. ఆకరాలు: "Gandhi a Hope in Despair", Dr Avadhaanam Raghukumar, Writersgram publication, New Delhi,2021.