మహాత్మా గాంధీ సేతువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాత్మా గాంధీ సేతువు
GandhiSetuPatnaRevamped.png
మహాత్మా గాంధీ సేతువు (ఏరియల్ వ్యూ)
అధికార నామంమహాత్మాగాంధీ సేతు
ఇతర పేర్లుగంగా సేతు
మోసే వాహనాలుజాతీయ రహదారి 22, జాతీయ రహదారి 31[1]
దేనిపై నిర్మింపబడినదిగంగానది
ప్రదేశంపాట్నా - హజీపూర్
నిర్వహించువారునేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
రూపకర్తగామన్ ఇండియా
వంతెన రకంగిడ్డార్ బ్రిడ్జ్
సామాగ్రికాంక్రీటు, స్టీలు
మొత్తం పొడవు5.75 కి.మీ. (3.57 మై.)
వెడల్పు25 మీ. (82 అ.)
నిర్మించినవారుగామన్ ఇండియా లిమిటెడ్
నిర్మాణ ప్రారంభం1972
నిర్మాణం పూర్తి1982
ప్రారంభంమే 1982
టోల్లేదు (తొలగించబడింది)[2]
భౌగోళికాంశాలు25°37′19.0″N 85°12′25.7″E / 25.621944°N 85.207139°E / 25.621944; 85.207139Coordinates: 25°37′19.0″N 85°12′25.7″E / 25.621944°N 85.207139°E / 25.621944; 85.207139

మహాత్మా గాంధీ సేతువు (గాంధీ సెతువు లేదా గంగా సేతువు) గంగానదిపై నిర్మించిన వంతెన. ఇది దక్షిణాన బీహార్ లోని పాట్నా , ఉత్తరాన హజీపూర్ లను కలుపుతుంది. [3] దీని పొడవు 5,750 మీటర్లు (18,860 అడుగులు).[4] ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద వంతెన.[5][6] దీనిని మే 1982న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించింది. ఈ వంతెనకు హజిపూర్ వైపు గల ఉత్తర చివరన ప్రారంభోత్సవం చేసారు. దీనిని వేలాది మంది ప్రజలు సందర్శించారు.

ప్రణాళిక, ప్రాముఖ్యత[మార్చు]

పాట్నాలో గల గాంధీ సేతువంతెన

ఈ వంతెన నిర్మాణానికి 1969 లో కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీనిని 1972 నుండి 1982 వరకు 10 సంవత్సరాల పాటు గామన్ ఇండియా లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ఈ వంతెన నిర్మాణ వ్యయం అప్పటికి రూ.87.22 కోట్లు. ఈ వంతెనను ఉత్తర బీహార్, మిగిలిన బీహార్ ప్రాంతాలను అనుసంధానించడానికి నిర్మించారు. ఇది జాతీయ రహదారి 19లో భాగంగా ఉంది. ఈ వంతెన నిర్మాణానికి పూర్వం "రాజేంద్ర సేతువు" ను 1959లో ప్రారంభించబడినది. ఇది ఉత్తర బీహారుకు ఒకే ఒక మార్గం. అప్పటి నుండి "విక్రమశీల సేతువు" ను గంగానదిపై నిర్మించారు. రైలు-రోడ్డు వంతెనలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి. ఇది దిగ్దా, సోనేపూర్, ముంజెర్ లను కలుపుతుంది.[7] [8]

భారతీయ తపాలా వ్యవస్థ ఒక పోస్టల్ స్టాంపును ఈ బ్రిడ్జి చిత్రంతో విడుదల చేసింది. ఈ తపాలా బిళ్లను 2007 ఆగస్టు 17 న 0500 పైసలు విలువతో విడుదల చేసారు.[9]

మూలాలు[మార్చు]

  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2016. Retrieved 27 May 2017. CS1 maint: discouraged parameter (link)
  2. Madhuri Kumar (26 సెప్టెంబరు 2012). "Traffic eases on Gandhi Setu as Centre drops toll collection". Patna: The Times of India. Archived from the original on 30 ఏప్రిల్ 2016. Retrieved 27 మే 2017. CS1 maint: discouraged parameter (link)
  3. "Destinations :: Patna". Archived from the original on 2014-09-18. CS1 maint: discouraged parameter (link)
  4. [1]
  5. "Gandhi Setu: An engineering marvel". Archived from the original on 2012-08-17. Retrieved 2018-05-25.
  6. longest river bridge to be rebuilt Archived 29 అక్టోబరు 2015 at the Wayback Machine business-standard.com
  7. "Digha Sonepur Rail Road Bridge to be operational by 2017". Archived from the original on 6 జూలై 2013. Retrieved 25 మే 2018. CS1 maint: discouraged parameter (link)
  8. Ganga Rail-Road Bridge
  9. Welcome to the Indiapost Web Site Archived 13 ఫిబ్రవరి 2011 at WebCite