మహామాయ మజిలీలు (నవల)
మహామాయ మజిలీలు | |
కృతికర్త: | పోలవరపు శ్రీహరిరావు |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నవల |
ప్రచురణ: | |
విడుదల: |
మహామాయ అనేది పోలవరపు శ్రీహరిరావు గారి జానపద నవల. ఇది పన్నెండు పుస్తకాలుగానూ పద్దెనిమిది భాగాలుగానూ రాయబడిన నవల.
కథా ప్రారంభం
[మార్చు]ఇది ఆంధ్రదేశాన్ని పాలించే వేంకటపతి రాజు గారి యొక్క కుమారుడైన రమాపతి రాజు యొక్క కథ, తన ఆన్న దేశపర్యటనకు వెళ్ళి వచ్చిన తరువాత తను కూడా వెళ్ళాలని నిర్ణయించుకొని అనంతమైన ధనాన్ని తీసుకొని వెంట అంజి అనే నమ్మిన బంటును తీసుకొని పర్యటనకు వెళుతాడు. వేశ్యల సుఖంలో మందు మత్తులో మునిగి తేలుతూ తిరుగుతూ ఉన్న అతడు అమరావతి నగరంలో రమాదేవి అనే నగర ప్రభువు కుమార్తెను ప్రేమిస్తాడు. ఆమె కొరకు అనేక ప్రయత్నాలు చేసి తన అలవాట్లను మార్చుకొని ఆమె ప్రేమను పొందుతాడు. ఆమె తన గురుపత్ని ఉండే చోట భైరవీ ఉపాసన చేస్తున్నానని చెప్పిన చోటుకు ఒక రాత్రి వెళ్ళి ఉపాసనలో ఉన్న ఆమెతో సరసాలు ఆడబోయిన అతడిని చూసి గురుపత్ని కురూపిగా మారమని, ఆమెపై వేసిన చెయ్యి పాముగా మారాలని శాపం ఇస్తుంది. తరువాత శిష్యురాలిద్వారా జరిగినది తెలుసుకొని ఒక సంవత్సర కాలం అన్ని పుణ్యక్షేత్రాలలో స్నానమాచరించిన శాపవిమోచనం జరుగుతుందని చెపుతుంది. రమాదేవిని మహామాయగా పేరు మార్చి ఆమెకి ఒక మహిమ కల హారం, దేనిగురించైనా తెలియచేసే ఒక నేత్రం ఇస్తుంది. వాటిని తీసుకొని తన ప్రియుని, అతడి చెలికాడు అంజిలతో మజిలీలు చేస్తుంది. అంజి తనకు కనిపించిన విశేశ్హాలను గూర్చి అడుగుతుంటే తనవద్ద కల మహిమ కల నేత్రం సహాయంతో ఆ కథలను చెప్తుంది అవే మాహామాయ కథలు.
మజిలీల కథలు
[మార్చు]- ఆదిశేషారెడ్డి కథ
- రంగనాయకి కథ
- చిత్రశేనుని కథ