మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహాశయ్ ధరమ్పాల్ గులాటి
రాష్ట్రపతి నుండి పద్మభూషణ పురస్కారం అందుకుటున్న గులాటి
జననం(1923-03-27)1923 మార్చి 27
మరణం2020 డిసెంబరు 3(2020-12-03) (వయసు 97)[1]
వృత్తియజమాని, CEO MDH
పిల్లలు2
పురస్కారాలుపద్మభూషణ్ (2019)

మహాశయ్ ధరమ్‌పాల్ గులాటి ( 1923 మార్చి 27 - 2020 డిసెంబరు 3) భారతీయ వ్యాపారవేత్త. ఇతనిని దాదాజీ అని కూడా వ్యవహరిస్తారు. ఇతను భారతీయ మసాలా కంపెనీ అయిన మహాషియాన్‌ దీ హట్టి (ఎండీహెచ్‌) ప్రైవేట్ లిమిటెడ్ యజమాని.[2][3]

జీవిత చరిత్ర[మార్చు]

ధరమ్ పాల్ గులాటి ప్రస్తుత పాకిస్తాన్ లోని సియాల్ కోట్ లో 1923 మార్చి 27న జన్మించారు. ఆయన తండ్రి MDH స్థాపకుడు మహాషాయ్ చున్నీ లాల్ గులాటీ. ఆయన కుటుంబం భారత విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చారు. ఆ కుటుంబం కొంత సమయం అమృత్ సర్ లోని శరణార్థి శిబిరంలో గడిపి, తరువాత పని వెతుక్కుంటూ ఢిల్లీకి తరలివెళ్లారు. 1937 లో, అతను తన తండ్రి సహాయంతో అద్దాలు చూసే చిన్న వ్యాపారాన్ని స్థాపించాడు, తరువాత సబ్బుల వ్యాపారం, కొన్నాళ్ళు వడ్రంగి ఉద్యోగం చేసాడు ఆ తరువాత, వస్త్ర వ్యాపారం, హార్డ్వేర్ వ్యాపారం & బియ్యం వ్యాపారం. ఇలా ఏదో ఒకవిధంగా ఇలాంటి చిన్న వ్యాపారాలు చేసినా అవి ఎక్కువ కాలం నిలబడలేదు, అతను మళ్ళీ తన కుటుంబ వారసత్వంగా ఉన్న మసాలా వ్యాపారంలో తండ్రితో చేతులు కలిపాడు.[4]

ఢిల్లీలో గులాటీ కరోల్ బాగ్ లో మసాలా దుకాణం ప్రారంభించాడు. 1953లో చాందిని చౌక్ లో రెండో షాపును అద్దెకు తీసుకున్నాడు. 1959లో గులాటి, మహాషియన్ డి హట్టి యొక్క తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి న్యూఢిల్లీలోని కీర్తి నగర్ లో భూమిని కొనుగోలు చేసాడు.[2] అక్కడి నుంచి ధరంపాల్ ఎండీహెచ్ మసాలాల బ్రాండును తయారు చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లాది రూపాయలు టర్నోవర్ సాధించాడు. ప్రస్తుతం భారతదేశంలో ఇది ప్రముఖ మసాలా కంపెనీ.[5].

2017 నాటికి, గులాటి భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నిత్యావసర వస్తువుల కంపెనీకి CEO గా ఉన్నాడు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.21 కోట్లకు పైగా జీతం తీసుకున్నాడు.[2] ఈయన చదువు 5వ త‌ర‌గ‌తి మ‌ధ్య‌లో మానేసినా[6] భారతదేశంలోనే ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈవోగా పేరుపొందారు,దాదాపు 100 దేశాలకు ఎండీహెచ్‌ కంపెనీ తయారుచేసిన ఉత్పత్తులని ఎగుమతి చేస్తున్నారు.భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ స్పైసెస్‌ బ్రాండ్‌గా ఎండీహెచ్‌ గుర్తింపు పొందింది[7].

2019 లో భారత ప్రభుత్వం ధరమ్ పాల్ గులాటి పద్మ భూషణ్ (వర్తకం, పరిశ్రమలు) తో సత్కరించింది ఇది భారతదేశం యొక్క మూడవ అత్యున్నత పౌర అవార్డు.[8]

గులాటి తన జీతంలో 90% మహాశయ్ చున్నీ లాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇచ్చాడు. ఈ ట్రస్టు మురికివాడల్లో నివసించే వారి కొరకు ఒక మొబైల్ ఆసుపత్రితో పాటు, ఢిల్లీలో 250 పడకల ఆసుపత్రిని, నాలుగు పాఠశాలలు కూడా నిర్వహిస్తోంది.[9]

మరణం[మార్చు]

2020 నవంబరు 26 గురువారం ఉదయం గుండెపోటుతో ఢిల్లీలో ఒక ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ 2020 డిసెంబరు 3 న ఉదయం 5:21 గంటలకు మరణించాడు.[10]

మూలాలు[మార్చు]

  1. "Mahashay Dharmpal passes away at 98". The Economic Times. 3 December 2020. Retrieved 3 December 2020.
  2. 2.0 2.1 2.2 Malviya, Sagar (17 January 2017). "FMCG sector's highest paid CEO was a 94-year-old school drop-out". The Economic Times. Retrieved 1 March 2019.
  3. "The Spice King and Founder of MDH: A Journey of Grit, Courage and Determination". 12 February 2018. Retrieved 23 August 2020.
  4. "MDH Mahashaya Ji | MDH Spices" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-03.
  5. "About us | MDH Spices" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-03.
  6. "చ‌దివింది 5వ త‌ర‌గ‌తి...ఇప్పుడు ఆయ‌న జీతం 21 కోట్లు.!". Ap2tg Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-01-19. Retrieved 2020-12-03.[permanent dead link]
  7. "ఆయన చనిపోలేదు.. అవన్నీ రూమర్లు!". Sakshi. 2018-10-07. Retrieved 2020-12-03.
  8. "MDH Masala Owner Mahashay Dharampal Gulati Conferred With Padma Bhushan". Latestly (in ఇంగ్లీష్). 26 January 2019. Retrieved 1 March 2019.
  9. "Inspiring! MDH owner 'Mahashay' Dharampal Gulati still earns more than Godrej, ITC, HUL bosses". Zee Business (in ఇంగ్లీష్). 7 October 2018. Retrieved 1 March 2019. He passed away on 3 December 2020 at the age of 98.
  10. "MDH Owner Death News Live: Condolences pour in for Mahashay Dharampal". The Economic Times (in ఇంగ్లీష్). Retrieved 2020-12-03.