మహ్మద్ మయిజ్జు
స్వరూపం
మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మహ్మద్ మయిజ్జు ఎన్నికయ్యారు[1]. ఆదేశ అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష నేత మహ్మద్ మయిజ్జు విజయం సాధించారు[2]. 2023 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన 54.04 శాతం ఓట్లు సాధించినట్లు ఎన్నికల కమిషన్ 2023 అక్టోబర్ ఒకటో తేదీన ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ 45.96 శాతం ఓట్లు సాధించినట్లు తెలిపారు. 2023 నవంబర్ 17వ తేదీన మహ్మద్ మయిజ్జు మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు[3]. మహ్మద్ మయిజ్జు కు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ చైనా అనుకూల పార్టీగా పేరుగాంచింది. అధికారంలోకి వస్తే మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలను వెనక్కి పంపించివేస్తామని, భారతదేశంపై ఆధారపడటం తగ్గిస్తానని మహ్మద్ మయిజ్జు హామీ ఇచ్చారు.
మూలాలు :
- ↑ "Maldives New President: మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు". Sakshi Education. Retrieved 2023-11-28.
- ↑ "Maldives Elections: మాల్దీవులు నూతన అధ్యక్షుడిగా మొహ్మద్ మయిజ్జు". EENADU. Retrieved 2023-11-28.
- ↑ "Maldives President: భారత్ సైన్యం మా దేశం వీడాల్సిందే.. చైనాతో దోస్తికి మాల్దీవుల అధ్యక్షుడు తహతహ". Samayam Telugu. Retrieved 2023-11-28.