మహ్మద్ మోఖ్బర్
మహ్మద్ మోఖ్బర్ | |||
| |||
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 మే 2024 | |||
ముందు | ఇబ్రహీం రైసీ | ||
---|---|---|---|
ఇరాన్ 7వ మొదటి ఉపాధ్యక్షుడు
| |||
పదవీ కాలం 8 ఆగష్టు 2021 – 19 మే 2024 | |||
అధ్యక్షుడు | ఇబ్రహీం రైసీ | ||
ముందు | ఇషాక్ జహంగిరి | ||
ఎక్స్‌పెడియెన్సీ డిస్సర్న్‌మెంట్ కౌన్సిల్ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 20 సెప్టెంబర్ 2022 | |||
ఇమామ్ ఖొమేనీ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ హెడ్
| |||
పదవీ కాలం 15 జులై 2007 – 7 డిసెంబర్ 2021 | |||
ముందు | మహ్మద్ జావద్ ఇరావాణి | ||
తరువాత | అరేఫ్ నోరౌజీ (తాత్కాలిక) పర్విజ్ ఫత్తా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | డెజ్‌ఫుల్, ఇరాన్ | 1955 జూన్ 26||
రాజకీయ పార్టీ | స్వతంత్ర |
మొహమ్మద్ మోఖ్బర్ (జననం 26 జూన్ 1955) ఇరాన్ రాజకీయ నాయకుడు. ఆయన 19 మే 2024న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఉత్తర్వులు జారీ చేశాడు.[1][2]
మొహమ్మద్ మోఖ్బర్ గతంలో ఇరాన్ మొదటి ఉపాధ్యక్షుడు. అతను ఎక్స్‌పెడియెన్సీ డిస్సర్న్‌మెంట్ కౌన్సిల్‌లో సభ్యుడు. ఆయన గతంలో ఇమామ్ ఖొమేనీస్ ఆర్డర్ (EIKO) ఎగ్జిక్యూషన్ హెడ్‌గా, సినా బ్యాంక్ బోర్డు ఛైర్మన్‌గా, ఖుజెస్తాన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నాడు. మొహమ్మద్ మోఖ్బర్ ఉప అధ్యక్షుడిగా అతని నియామకానికి ముందు, ఇరాన్ సెటాడ్ లేదా ఇమామ్ ఖొమేనీ ఆర్డర్ అమలు కోసం ఆర్గనైజేషన్ అధిపతిగా 14 సంవత్సరాలు పని చేశాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]మొహమ్మద్ మోఖ్బర్ 1955లో ఖుజెస్తాన్‌లోని నైరుతి ప్రావిన్స్‌లోని డెజ్‌ఫుల్‌లో జన్మించాడు. ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీని పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మొహమ్మద్ మోఖ్బర్ ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మెడికల్ కార్ప్స్‌లో అధికారిగా ఉన్నాడు. ఆయన తన కెరీర్‌లో ముందుగా బ్యాంకింగ్ & కమ్యూనికేషన్‌లలో చురుకుగా ఉండేవాడు, ఖుజెస్తాన్ టెలికమ్యూనికేషన్స్ అథారిటీకి అధిపతిగా పని చేసి ఆ తరువాత 1990లలో ప్రావిన్స్‌కి డిప్యూటీ గవర్నర్‌గా పదోన్నతి పొందాడు. మోఖ్బర్ సెటాడ్‌కు వెళ్లడానికి ముందు మరొక బోన్యాడ్‌లో డిప్యూటీగా ఉన్నారు, ఇది శక్తివంతమైన మోస్టాజాఫాన్ ఫౌండేషన్, దీనిని సుప్రీమ్ లీడర్ ఖొమేనీ స్వచ్ఛంద సంస్థగా స్థాపించాడు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టాక 8 ఆగస్టు 2021న మొఖ్‌బర్‌ను దేశ మొదటి వైస్ ప్రెసిడెంట్‌గా నియమించాడు. ఆయన అక్టోబరు 2022లో ఉక్రెయిన్‌పై దాడికి మద్దతుగా రష్యాకు షాహెద్ డ్రోన్‌లు, ఉపరితలం నుండి ఉపరితల క్షిపణులను పంపే ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు సీనియర్ IRGC అధికారులు & సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారితో కలిసి అతన్ని మాస్కోకు పంపారు. మిజైల్స్, డ్రోన్స్‌ని రష్యాకి సప్లై చేసేందుకు ఓ డీల్ కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన 19 మే 2024న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక చేస్తూ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఉత్తర్వులు జారీ చేశాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (20 May 2024). "Who is Iran's first Vice President, Mohammad Mokhber, appointed acting President after crash?" (in Indian English). Archived from the original on 20 May 2024. Retrieved 20 May 2024.
- ↑ ABP Desham (20 May 2024). "ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ మొక్బర్ నియామకం, ఆదేశాలు జారీ చేసిన సుప్రీం లీడర్". Archived from the original on 20 May 2024. Retrieved 20 May 2024.
- ↑ EENADU (20 May 2024). "ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్". Archived from the original on 20 May 2024. Retrieved 20 May 2024.