Jump to content

మాటే మంత్రము మనసే బంధము

వికీపీడియా నుండి
(మాటే మంత్రము నుండి దారిమార్పు చెందింది)
"మాటే మంత్రము మనసే బంధము"
రచయితవేటూరి సుందరరామమూర్తి
సంగీతంఇళయరాజా
సాహిత్యంవేటూరి సుందరరామమూర్తి
ప్రచురణ1982
రచింపబడిన ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
భాషతెలుగు
రూపంప్రేమ గీతం
గాయకుడు/గాయనిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.పి. శైలజ.

మాటే మంత్రము మనసే బంధము 1981లో విడుదలైన సీతాకోకచిలుక సినిమా లోనిది. ఈ సినిమా తమిళంలో భారతీరాజా దర్శకత్వంలో విడుదలైన అలైగల్ ఒవితల్లై మాతృక. రెండింటిలోను మురళి ప్రధానమైన కథానాయకుని పాత్రను పోషించాడు. ఈ పాట వేటూరి సుందరరామమూర్తి. రచించగా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.పి. శైలజ నేపథ్యగానం చేసారు. కార్తీక్, ముచ్చర్ల అరుణ పై ఈ పాటను చిత్రీకరించారు. దీంకి ఇళయరాజా స్వరాలను సమకూర్చారు.[1]

ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుశ్శేవేంద్రియే ప్రతిదిష్టతి.....

మాటే మంత్రము... మనసే బంధము...
ఈ మమతే.. ఈ సమతే.. మంగళ వాద్యము...
ఇది కల్యాణం... కమనీయం... జీవితం...

మాటే మంత్రము... మనసే బంధము...
ఈ మమతే.. ఈ సమతే.. మంగళ వాద్యము...
ఇది కల్యాణం... కమనీయం... జీవితం...
ఓ..ఓ..మాటే మంత్రము... మనసే బంధము...

నీవే నాలో స్పందించిన...ఈ ప్రియలయలో శ్రుతి కలిసే ప్రాణమిదే...
నేనే నీవుగా... పువ్వు తావిగా...
సంయోగాల సంగీతాలు విరిసే వేళలో...

నేనే నీవై ప్రేమించిన...ఈ అనురాగం పలికించే పల్లవిదే...
ఎదలో కోవెల ఎదుటే దేవత...
వలపై వచ్చి వారమే ఇచ్చి కలిసే వేళలో...

మాటే మంత్రము... మనసే బంధము...

మూలాలు

[మార్చు]
  1. ".: Musicologist Raja | Exclusive Telugu Lyrics Website | Telugu Film Songs Reviews :". rajamusicbank.com. Retrieved 2025-11-02.