మాథెరాన్
మహారాష్ట్ర లో ముంబాయికి 108 కిలోమీటర్ల దూరంలొ సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో ఉన్న కాలుష్య రహిత హిల్ స్టేషను మాథెరాన్. ఇక్కడి ప్రజలు ఏ విధమైన మోటారు వాహనాలకు పైకి అనుమతించరు. కాబట్టే ఈ ప్రదేశం కాలుష్య రహితంగా ఉండటమే కాకుండా రణగొణ ధ్వనులకు కూడా అతీతంగా ఉటుంది. పర్యాటకులు వెళ్ళడానికి ఒక్క టాయ్‌ట్రెయిన్ ను మాత్రమే అనుమతిస్తారు. గుర్రాలు, రిక్షాలు ఇక్కడ సాధారణమే. టాయ్‌ట్రెయిన్ ను గత వంద సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. 2007 లో ఇది వంద సం.లు పూర్తి చేసుకుంది. దీన్ని యునెస్కో వారసత్వజాబితాలో చేర్చడాన్కి సనాహాలు జర్గుతున్నాయి. ఇక్కడి పర్వతాలు, కొండలు, లోయలు, వంపులు, జలపాతాలు మొదలగునవి తనివితీరా చూడడానికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు అనేకం వస్తుంటారు. ఇక్కడి కాలుష్య రహిత వాతావరణానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కూడా గుర్తించి దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించింది.