మాదక ద్రవ్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని పదార్ధాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనము (Addiction). ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావకాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి.[1][2]

మాదక ద్రవ్యాలలో వివిధ రకాలున్నాయి. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్.ఎస్.డి. మొదలైనవి ముఖ్యమైనవి.

మాదక ద్రవ్యాలు నల్ల బజారులో అందుబాటులో ఉంటున్నాయి. వీనికి వివిధ ప్రాంతాలలో సంకేత నామాలతో చలామణీ అవుతుంటాయి. ఇలా అక్రమ వ్యాపారాలు దొంగ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల్ని గడిస్తుంటే, యువత వానిని వినియోగిస్తూ చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తుంది.

వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులౌతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తర్వాత వీనిని సంపాదించడానికి ఎంతటి అకృత్యాలు మరియు నేరాలు చేయడానికి వెనుకాడరు.

మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సస్ చట్టాన్ని చేసింది. ఈ మత్తు మందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగివున్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులు.

ఇలాంటి వ్యసనపరుల్ని మళ్ళీ మామూలు మనుషుల్ని చేడడం చాల కష్టమైన పని. వీరిని డ్రగ్ అడిక్షన్ కేంద్రాలు, మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేసి కాపాడవచ్చును.

మూలాలు[మార్చు]