మాధ్యమము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాధ్యమము అంటే సమాచారమును అందింస్తూ రూపకర్తను ప్రజలను అను సంధానించేది. మానవాభివృద్ధికి మాధ్యమము చాలా ఉపకరిస్తుంది. సమాచారం ఒకరి నుండి ఒకరికి చేరినప్పుడే విజ్ఞానం విస్తరిస్తుంది. ఉదాహరణగా రచయిత తన కల్పనా శక్తితో రచించే కథలు, నవలలు, వ్యాసాలు లాంటివి ప్రజలకు చేరినప్పుడే రచయితకు తృప్తి రచనకు సార్థకత ఏర్పడుతుంది. ప్రజా పాలనకు మాధ్యమం అత్యవసరం. ఉదాహరణగా రాజ్యాంగ ఉత్తరువులను ప్రజలకు చేర్చడంలో ప్రచురణా మాధ్యమం తోడ్పడుతుంది. పండితులను పామరులకు చక్కగా చేరువ కాగలిగింది అందరికి సులువుగా అర్ధం అయ్యేది శబ్ధరూపం. ఆకాశవాణి వాణి కార్యక్రమాలు శబ్ధరూప మాధ్యమం. ఆకాశవాణి వాత్రలను అందించడం లాంటి అనేక కార్యక్రమాలను అందించి ఒకప్పుడు ప్రజలను విపరీతంగా అలరించింది. ఇక ప్రచురణా వ్యవస్థ అత్యద్భుత సేవలు అందిస్తూ ప్రజలను విపరీతంగా అలరించింది ఇప్పుడు అనేక సంచలనాలను సృష్టిస్తుంది ప్రజాదరణ చూరగొంటూ ముందడుగు వేస్తున్నదీ మాధ్యమం.

పురాతన కాల మాధ్యమం

[మార్చు]

ఆదిమానవుని కాలంలో కుడ్య శిల్పాలు, కుడ్య చిత్రాలు ఒక రకంగా మొదటి మాధ్యమమని అనుకోవచ్చు. లిపి కూడా లేని కాలంలో మానవుడు తన భావాలను వెబుచ్చడానికి చేసిన ప్రయత్నమే కుడ్యశిల్పాలు. అవి ఇప్పటికీ ఆనాటి నాగరికత, ఆనాటి జంతువులు, వారి సంస్కృతి మనకు అందిస్తూ గత చరిత్రను ఆధునికులకు అందించడంలో తమ తోడ్పాటు అందిస్తున్నాయి. అజంతా ఎల్లోరా గుహలు దీనికి ఉదాహరణలు. లిపి పుట్టిన తరువాత కాగితం లేని సమయంలో ముందుగా సమాచారాన్ని, భద్రపరచి ప్రజలకు అందించడానికి కొంత ఎక్కువ కాలం మన్నే తాటి ఆకులను రచయితలు మాధ్యమంగా ఎంచుకున్నారు. ఇప్పటికీ పురాతన రచనల తాళ పత్ర గ్రంథాలను భద్రపరచి అపురూప సంపదగా కాపాడబడుతున్నాయి. అలాగే లోహాలను రచనలు భద్రపరచడానికి ఎంచుకుని రచనలు సాగించారు. అవే తామ్రపత్ర గ్రంథాలు. ఇవి అత్యధిక కాలం మన్నికగా ఉంటాయి. రాజులు తమ శాసనాలను ప్రజలకు తెలియపరచడానికి శిలలను మాధ్యమంగా చేసుకుని వాటి మీద శాసనాలను చెక్కించి ప్రజలకు కనిపించేలా స్థాపించారు. దేవాలయాలు, కోటలు మొదలైన ప్రదేశాలలో వీటిని ఇప్పటికీ చూడ వచ్చు. అలాగే రాజాజ్ఞను ప్రజలకు చేరవేయడానికి మనిషి డప్పు, ఢంకా వంటివి వాయిస్తూ మాటాలతో బిగ్గరగా పలుకుతూ ఉంరంతా తిరుగుతూ ప్రచారం చేసే వారు. ఆ కాలంలో విద్యుత్‌ పరికరాలు కనిపెట్ట లేదు కనుక ప్రజలకు సమాచారం ఈ విధంగా అందేది. డప్పు వాయిస్తూ విషయాన్ని బిగ్గరగా మాటలలో పలుకుతూ ఊరంతా తిరిగే వారు. ఈ పని చేయడానికి ప్రత్యేక ఉద్యోగులు ఉండే వారు. ఈ పద్ధతిని చాటింపు అంటారు. ఇందులో డప్పు శబ్దం ముందుగా ఆకర్షించి తరువాత మాటలు ప్రజలను చేరుతాయి. ఢంకా ప్రత్యేకమై ఉన్నత ప్రదేశంలో ఉంచి పెద్దగా వాయిస్తూ అతి బిగ్గరగా చెప్తారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద గంటలను రాజ భవనం ముందు ఉంచే వారు. ప్రజలు రాజుకు విన్న వించాలని అనుకున్నప్పుడు గంట వాగించి ఆతరువాత రాజోద్యోగుల ద్వారా రాజును దర్శించి తమ విన్నపాలను రాజుకు చెప్పుకునేవారు. కాగితం లేని రోజులలో రాజ్యాల మధ్య సందేశాలను వస్త్రం మీద వ్రాయబడిన లేఖల ద్వారా ప్రత్యేక ఉద్యోల చేత అందించబడేది. వీరిని వార్తాహరులు అనే వారు. ఇదీ ఒక మాధ్యమమే.

వస్తురూప మాధ్యమం

[మార్చు]

ప్రాచీనకాల రాతి పనిముట్లు రాతియుగపు మానవుని తొలి నైపుణ్యంగా అప్పటి వారి సాంకేతిక జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాయి. తవ్వకాలలో లభించే వస్తువులు, నగరాలు పురాతన మానవ సంస్కృతిని అధునికులకు చేరవేస్తున్నాయి. శిలాజాలు భూమి మీద నశించిన జీవరాశుల రహస్యాలను ఇప్పటి మానవులకు అందిస్తున్నాయి. దేవాలయ శిల్పాలు ఆ కాలపు నాట్య భంగిమలను, పురాణ కథలను అందిస్తున్నాయి. ఖజూరహో శిల్పాలు, బేలూరు, హళి బీడు శిల్పాలు నాట్య భంగిమలకు ప్రసిద్ధి. ఆ కాలపు శిక్షించిన విధానాన్ని సుచీంద్రం కేవెలలో శిలారూపంలో చూడవచ్చు. శిల్పకళా వైరుద్యాలు వాటిని నిర్మించిన కాలాన్ని అప్పటి సంస్కృతిని ఈ కాలానికి అందిస్తున్నాయి. కుడ్యచిత్రాలు, చిత్రలేఖనాలు కూడా అప్పటి చరిత్రను వేషధారణను మరింత విశదీకరిస్తాయి.

కళారూప మాధ్యమం

[మార్చు]
తెలుగు నాటకం

గానము, నాట్యము, నాటకము, బుర్రకథ, వీధినాటకాలు, కథాకాలక్షేపము, హరికథ, ఉపన్యాసము, యక్షగానము, ప్రవచనము వంటి రూపాలలో రాజుల కథలను, సంఘటనలను, పురాణాలను ఆకర్షణీయమైన కళారూపంలో ప్రజలకు చేరువ చేసే వారు. ఇవి ప్రజల మనసు రంజింప చేస్తూ ఇతిహాసాలను, ఆ నాటి రాజుల చరిత్రలను, ముఖ్య సంఘటనలు ప్రజల వద్దకు చేరేవి. వాల్మికి రామాయణమును రచించి రాముని పుత్రులకు గాన రూపంలో శిక్షణ ఇచ్చి అయోధ్య అంతా వినిపించ చేసాడు. రచించినది ప్రజల వద్దకు చేర్చడంత అవసరమో ఆది కవి నిరూపించాడు. వ్యాసుడు భారత రచన చేసి వాటిని శిష్యులకు నేర్పి ఆ కావ్యాన్ని ప్రజల మధ్యకు తీసుకు వెళ్ళాడు. ఈ కథను వినిపించే వారిని సూతులు అంటారు. అలాగే వేద విభజన చేసి వాటిని శిష్యులకు నేర్పించి వేద వ్యాప్తికి తోడ్పడ్డాడు. వ్యాసుడి కుమారుడైన శుక మహర్షి భాగవత కథను స్వయంగా పరీక్షిత్తు మహారాజుకు ప్రవచన రూపంలో వినిపించాడు.కాశిదాసు నాటకాలను రచించి కళా కారుల చేత నటింప చేసి రచనలను ప్రజలకు నాటక రూపంలో చేర వేసాడు. నాటకాలు కథలను ఇతిహాసాలను దృశ్యరూపంలో ప్రజలకు అందించాయి. కబీరుదాసు, త్యాగరాజు, అన్నమయ్య వంటి గాయకులు తమ భక్తిరసమయ రచనలను కృతులను స్వయంగా గాన రూపంలో తిరుగుతూ పాడుతూ అందించారు. దేవదాసీ సంప్రదాయంతో నాట్యరూపంతో పురాణేతిహాసాలు ప్రజలకు చేరువ చేయబడ్డాయి. ఆసక్తి కరమైన మరొక మాధ్యమం బుర్రకథ. ఇది ముగ్గురు కళాకారులచేత చెప్పబడుతుంది. ప్రధాన కథకుడు కథను వినిపిస్తుంటాడు. పక్కన ఉండే ఇద్దరు కథకులు హాస్యోక్తులు పలుకుతూ తందాన అని చెబుతూ కొంత రంజింప చేస్తారు. దీనిలో కళాకారులు తమ వాద్యాలను తామే వాయుస్తుంటారు. వీరు ముఖ్యమైన సంఘటనలను, చారిత్రక విషయాలను చెప్పడానికి ప్రాముఖ్యత ఇస్తారు. హరికథకులు ఒంటరిగా కథచెప్తారు. వీరు కథను వచన రూపంలోను అక్కడక్కడా పద్య రూపంలోను గాన రూపంలోను చెప్తూ కొంత అభినయం చూపిస్తూ చెప్తారు. వీరికి పక్క వాయుద్యం కావాలి. వీరంతా ఆ కాలంలో ఆలయాలను తమ వేదికగా చేసుకుని ప్రచారం చేసిన వారే.

అచ్చురూపమాధ్యమం

[మార్చు]

కాగితం, కలం కనుగొనడం మాధ్యమంలో విపవాత్మకమైన మార్పులబ్ను తీసుకు వచ్చింది. రాజ్యాంగపరమైన విషయాలను, రాజ్యాంగ వ్యవహారాలను, ప్రపంచం నలుమూలలా జరిగే సంఘటనలు, నూతన పరిశోధనలు వంటి అనేక విషయాలను ప్రజల మధ్యకు దినపత్రికల రూపంలో అందడం మొదలైంది. అలాగే వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు వ్యాపారసరళిలో కథలు, కావ్యాలు, ధారావాహికలు, చిట్కాలు, స్త్రీలను ఆకర్షించే అల్లికలు, వంటలు, ముగ్గులూ, పిల్లను ఆకర్షించే బొమ్మల కథలు, అందరినీ ఆకర్షించే వ్యంగ్య చిత్రాలతో ప్రజలను రంజింపచేసాయి. కొందరు ఔత్సాహికులు చేతివ్రాత పత్రికలు కూడా నడిపారు. అచ్చుతో పని లేకుండా చేతితో వ్రాసి ఒకరికి ఒకరు అందిస్తూ చదువుతూ పోవడం. కరపత్రాలు అనే చిన్న కాగితాలలో ముద్రించి ప్రజలకు ఉచితంగా పంచి పెట్టి ప్రజలకు సమాచారాన్ని అందించడం అచ్చు యంత్రాల ఉపయోగంతో సాధ్యమైంది. కొన్ని మతపరమైన పుస్తకాలను ముద్రించి ప్రజలకు ఉచితంగా పంచి మతప్రచారం చేస్తూ ఉండడం జన విదితమే. హిందువులు దేవతా స్తోత్రాలను చిన్న చుఇన్న పుస్తకాలుగా ముద్రించి దైవప్రీతి కొరకు భక్తులకు పంచి ఇస్తారు. క్రైస్తవులు తమ ప్రవక్తలు కథలను సువార్తలు అన్న పేరుతో ముద్రించి అందరికీ ఉచితంగా ఇస్తుంటారు.అచ్చురూప మాధ్యమం రచయిత ప్రజల మధ్య దూరాన్నిచెరిపి ప్రజల జీవన సరళి మానసిక స్థితిలో సంచలనాత్మ మార్పులు తీసుకు వచ్చింది.

నాటకరంగం

[మార్చు]

మహాకవి కాశిదాసు నాటకాలను రచించాడు కనుక నాటకరంగానికి పునాదులు అతి ప్రాచీనమనవే. రచయితలు దృశ్యాలను వర్ణించి, పాత్రల సంసంభాణలను చేర్చి, పాత్రల ప్రవేశం హావభావాలను వివరిస్తూ సాగించిన నాటక రచనలను దర్శలుకు నటులకు ముందుగా తర్ఫీదు ఇచ్చి తరువాత రంగస్థలం మీద ప్రజల ముందు ప్రదర్శనకు తీసుకు వస్తారు. ఇంతకు ముందు కథలుగా విన్న వాటిని పాత్రల హావభావాలతో సజీవంగా చూసే అవకాశం ప్రజలను ఆకర్షించింది. ముందుగా పురాణకథలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా ప్రజలకు పురాణ పాత్రలను దృశ్యరూపంగా చూసే అవకాశం కల్పించింది. అనేక మంది కళాకారులు నాటకాలకు తమ జీవితాలను అంకితం చేసారు. ఆతరువాత చిన్నగా చారిత్రక నాటకాలు, సాంఘిక నాటకాలు ప్రజకు అందించారు. చలన చిత్రాలు వచ్చాక అనేక నాటక కళాకారులు చిత్ర రంగ ప్రవేశం చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. నాటకానికి ప్రాణం పాటలు పద్యాలు కనుక కళాకారులు సంగీతంలో కూడా ప్రావీణ్యం కలిగి ఉండే వారు. పాటలు, పద్యాలు ప్రజలకు త్వరగా చేరువ ఔతాయి కనుక నాటకాలలో పాటలు పద్యాల పాత్ర అధికమే. కొన్ని పద్యాలను ప్రేక్షకులు ఒన్స్ మోర్ అని అడిగి పాడించుకున్న సందర్భాలు కో కొల్లలు. కొన్ని నాటకాలు నూరు ప్రదర్శనలు దాటి ప్రదర్శించబడ్డాయి. చలన చిత్రాలు వచ్చే వరకు నాటకరంగ ఆధిక్యత కొనసాగింది.

శబ్ధరూప మాధ్యమం

[మార్చు]

రేడియో కనిపెట్టిన తరువాత శబ్ధరూప మాద్యమం మరింత ఊపందుకుంది. ఒకప్పుడు కొమ్ము బూరలను, శంఖనాదాన్ని, గంటా నాదాన్ని శబ్ధరూప మాధ్యమంగా వాడుకున్నారు. విదేశీ నావికులు తాము వ్యాపారార్ధం పట్టుకు వచ్చిన వస్తువులను విక్రయించడానికి శబ్ధరూపమైన సింగి నాదాన్ని వాయించి ప్రకటించే వారు. ప్రజలు ఆశబ్దం విని వెళ్ళి సామాను కొనే వారు. అందుకే సింగినాదం విని జీలకర కొనేవారు కనుక సింగినాదం జిలకర అనే సామెత వచ్చింది. రాజులు లాలంలో యుద్ధం ఆరంభించడానికి ముందు శంఖనాదంతో తమ సంసిద్ధతను చాటే వారు. కొందరు సన్యాసులు, భిక్షుకులు కూడా ఒకప్పుడు శంఖనాదం చేసేవారు. చర్చిలో గంటానాదంతో కొన్ని విషయాలను చెప్పేవారు. రాజులు గంటా నాదంతో ప్రజలకు దర్శనం ఇచ్చేవారు. వేదాలు శబ్ధరూపంగానే వినపడ్డాయి. అవి ఎవరిచేత రచింపబడ లేదు కనుక అవి అపౌరుషేయాలు, శ్రుతులైనాయి. వేదాలను పఠించడం ద్వారానే గురువుల నుండి శిష్యులు నేర్చుకుంటారు. ఆకాశవాణి వచ్చిన తరువాత శబ్ధరూప మాద్యమంలో మరింత మార్పులు వచ్చాయి. ఊదయం భక్తి గీతాలతో ప్రారంభం చేసి సూక్తులు చెప్పి వ్యవసాయదారులకు సూచనలు అందించి దేశంలో జరిగిన విశేషాలను వార్తలలో అందించడం వరకు ఆకాశవాణి కార్యక్రమాలద్వారా ప్రజలకు అందించేది. పంచాయితీలలోను రేడియోలను పెట్టి చదువు కోని పామరులకు విశేషాలు తెలుసుకోవడం సులువైంది. సంగీతం, కథలు, నాటకాలు, స్త్రీల కార్యక్రమాలు, బాలల పాటలు ఆకాశ వాణి అందించేది. చలన చిత్రాలను శబ్ధరూపంలో విని ఆనందించే వారు. రేడియో ఉండడం అప్పట్లో అంతస్తుకు చిహ్నం. రేడియోల ముందు గుంపులుగా కూర్చుని ఆనందించిన సందర్భాలు కోకొల్లలు. ప్రజలకు అత్యవసరంగా అందించ వలసిన హెచ్చరికలు సైతం ఆకాశవాణి ద్వారానే ప్రలకు చేరేవి. ఉషశ్రీ తన గంభీర కంఠధ్వనితో అందించి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, మహాభారత, రామాయణ

చలన చిత్ర రంగం

[మార్చు]

వినోదమే ప్రధానమైన మాధ్యమం చలన చిత్రరంగం. అప్పటి వరకూ ప్రజల మనసులను దోచుకున్న నాటకరంగాన్ని త్రోసి రాజని చలన చిత్ర రంగం ముందుకు సాగింది. ముందు మూకీ చిత్రాల విడుదల. మాటలు లేకపోయినా ప్రజలను చిత్రరంగం సమ్మోహన పరచింది. తరువాత చిత్రాలకు మాటలు పాటలు పద్యాలను చేర్చి ప్రదర్శించ గలిగారు. చిత్రరంగం ప్రజల జీవితంలో ఒక భాగం అయి పోయింది. ఒకప్పటిలా కాకున్నా ఇప్పటికీ చలన చిత్రాలకు ప్రజల జీవితంలో చలన చిత్రాల స్థానం ప్రత్యేకమే. చలన చిత్రాలు ప్రజలకు చరిత్రను సదృశ్యకంగా చూపించాయి. పల్నాటి యుద్ధము, మహామంత్రి తిమ్మరుసు, అనార్కలి, తెనాలి రామకృష్ణ, అల్లూరి సీతారామ రాజు వంటి అనేక చిత్రాలు ప్రజల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి. పౌరాణిక చిత్రాలు ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. రామాయణ, మహా భారతం, శివపురాణం వంటి పురాణేతిహాసాలలోని ఘట్టాలు అనేకం వివిధ చిత్రాలుగా విడుదలై ప్రజాదరణ పొంది అమోఘ విజాయాన్ని సాధించాయి. భక్తుల చరిత్రలు, సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, స్వాతంత్ర్య సమరయోధుల గురించిన చిత్రాలు ప్రజలకు ఆనాటి రోజులను కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రజలను అలరించాయి. చిత్రరంగం వినోదము అందించడామే కాక అనేక మందికి జీవనోపాధికి కారణమైంది. చలనచిత్ర నటులు ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. అభిమాన సంఘటితమై సంఘాలు ఏర్పరుచుకున్నారు. నాయకులకు పాలాభిషేకం చేసి గుడి కట్టి పూజించేంతగా నటులు ప్రజాభిమానం సంపాదించుకున్నారు. ఒకాపటి నాటక నటులు తరువాత చలచిత్ర నాయకులు, నిర్మాతలు అయ్యారు. హిందీ నటుడు రాజకపూర్ కుటుంబం అందుకు తార్కాణం. వారి తండ్రి పృధ్వీరాజ్ కపూర్ నాటకరంగం నుండి చిత్రరంగానికి వచ్చి చిత్రరంగంలో శాశ్వత స్థానం సపాదించాడు. వారి కుటుంబం ఇప్పటికీ చిత్రరంగంలో ప్రత్యేకత సంతరించుకుంది. అక్కినేని నాగేశ్వరరావు వంటి మహా నటులను చిత్రరంగానికి అందించినది నాటక రంగమే. చిత్ర రంగం నుండి రాజకీయాలలో ప్రవేశించిన ఎమ్.జి.రామచంద్రన్, పౌరాణిక పాత్రధారణతో ఆయా పాత్రలకు ప్రాణం పోసిన నందమూరి తారక రామారావు, వివిధ భాషలలో నటించి ప్రజాభిమానం చూరగొన్న జయలలిత వంటి నటీనటులు రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయంగా ఆయారాష్ట్ర ఉన్నత స్థానాలైన ముఖ్యమంత్రి పదవిని చేరుకున్నారు. చిత్ర రంగం కళాకారులంరి సమైక్య కృషితో పనిచేస్తుంది కనుక వెంపటి చిన సత్యణం వంటి నృత్య కళాకారులు, ఘంటసాల, ఎస్.పి బాలసుభహ్మణ్యం, పి సుశీల వంటి అనే గాయక గాయణీ మణులను ప్రతిభను ప్రజలకు పరిచయం చేసింది.

దూరదర్శన్

[మార్చు]

చలన చిత్రాల తరువాత ప్రజాజీవితంలో ప్రవేశించిన దూరదర్శన్ ప్రజాలను ప్రజల మనసును చలన చిత్రాల నుండి కొంత త్న వైపు తిప్పుకుంది. ప్రారంభంలో బ్లాక్ & వైట్ టి.వి లతో ప్రారంభం అయింది. వీటిని కూడా ముందు పంచాయితీ కార్యాలయాలలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆరంభదశలో పంచాయితీ కార్యాలయాలలో అనేక మంది ప్రజలు కూడి చలనచిత్రాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇరుగు పొరుగు కూడా వచ్చి దూరదర్శన్ కార్యక్రమాలు చూస్తుండే వారు. ఇంట్లో కూర్చుని కార్యక్రమాలను చూస్తూ పొద్దు పుచ్చడం ప్రజలను ఆకర్షించిది. తరువాత క్రమంగా ఇంటింటికి టి.విలు వచ్చాయి. చాలా కాలం వరకు దూరదఋసన్ కార్యక్రమాలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేవి. అప్పట్లో ఏంటెనాలను బిగించి దాని ద్వారా ప్రసారాలు సాగేవి. ప్రభుత్వరంగం ఆధీనంలో ఉన్నప్పుడు ప్రాంతీయ భాషా కార్యక్రమాలకు సమయం కొంత మాత్రమే కేటాయించ బడింది. మిగిలిన సమయం దేశీయ భాష అయిన హిందీకి ముఖ్యత్వం ఉండేది. తరువాతి కాలంలో ప్రైవేటు రగం దూరదర్శన్ రంగంలో ప్రవేశించడంలో ప్రాంతీయ భాషా కార్యక్రమాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వ్యాపార దృక్కోణం కారణంగా కార్యక్రమాల నాణ్యత పెరిగింది. బ్లాక్ & వైట్ స్థానంలో కలర్ టి.విలు వచ్చాయి. దూరదర్శన్ కారణంగా ప్రజలకు పుస్తక పఠనం మీద ఉన్న ఆసక్తి కొంత తగ్గింది. ఇంటి ముంగిటలో కూర్చుని పొద్దుపుచ్చగలిగిన కారణంగా చలన చిత్రాలకు వెళ్ళే ప్రజల సంఖ్య తగ్గు ముఖం పట్టింది. దూరదర్శన్ రంగం అనేకమందికి ఉపాధి వనరుగా మారింది. సంపాదనలో వెనుక బడిన చలనచిత్ర నటులకు సాంకేతిక నిపుణులకు నూతన ఆదాయ మార్గం కల్పించింది. దూరదర్శన్ వినోద కార్యక్రమాలే కాక విజ్ఞాన కార్యక్రమాలకు నెలవయ్యింది. డిస్కవరీ, హిస్టరీ, నేష్సనలు గియోగ్రఫీ లాంటి అనేక చానల్స్ ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య సంబంధిత కార్యక్రమాలకు ప్రత్యేక చానల్స్ ఉన్నాయి. క్రీడలను ప్రత్యక్ష ప్రసారాలు చూడడానికి స్పోర్ట్ చానల్స్ ఉన్నాయి. భక్తి కార్యక్రమాలకు ప్రత్యేక చానల్స్ ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ విధాలకు ప్రజలకు అందించే వసతి కొరకు స్వంత చానల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా దూరదర్శన్ రంగం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది.

విద్యుత్ పరికరాల మాధ్యమం

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మాధ్యమము&oldid=4081694" నుండి వెలికితీశారు