మానసి పరేఖ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానసి పరేఖ్
మానసి పరేఖ్ (2013)
జననం
విద్యబి.ఎ. (ఆంగ్ల సాహిత్యం)
వృత్తినటి, మోడల్, గాయని
క్రియాశీల సంవత్సరాలు2004 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పార్థివ్ గోహిల్‌
(m. 2008)
పిల్లలుఒక కుమార్తె
బంధువులుమహేష్ పరేఖ్ (తండ్రి), మనీషా పరేఖ్ (తల్లి)

మానసి పరేఖ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన టివి, సినిమా నటి, గాయని, నిర్మాత. స్టార్ ప్లస్లో వచ్చిన జిందగీ కా హర్ రంగ్‌ అనే సీరియల్ లో గులాల్ పాత్రతో ప్రసిద్ధి చెందింది.

జననం

[మార్చు]

మానసి పరేఖ్ మహారాష్ట్రలోని ముంబైలో పుట్టి పెరిగిన గుజరాతీ అమ్మాయి.[1] తండ్రి మహేష్ పరేఖ్, తల్లి మనీషా పరేఖ్.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సంగీత దర్శకుడు పార్థివ్ గోహిల్‌ లో మానసి వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది.[2]

సినిమారంగం

[మార్చు]

మానసి 2004లో కిత్నీ మస్త్ హై జిందగీ అనే సీరియల్‌తో నటనారంగంలోకి అడుగుపెట్టి, 2005లో స్టార్ వన్ లో వచ్చిన ఇండియా కాలింగ్‌ సీరియల్ తో పేరు పొందింది. జీ టీవీ సింగింగ్ రియాలిటీ షో స్టార్ యా రాక్‌స్టార్‌ టైటిల్ గెలుచుకుంది. స్టార్ ప్లస్ ప్రైమ్ టైమ్ షో గులాల్‌ లో కూడా నటించింది. 9ఎక్స్ లో రిమోట్ కంట్రోల్, స్టార్ వన్ లో లాఫ్టర్ కే ఫట్కే వంటి షోలలో కూడా కనిపించింది. 2012 ఏప్రిల్ లో విడుదలైన లీలాయి అనే తమిళ రొమాంటిక్ సినిమాలో శివ్ పండిట్‌తో కలిసి నటించింది.[3] గోవాలో జరిగిన ఐఎఫ్‌ఎఫ్‌ఐ ఫెస్టివల్‌లో యే కైసీ లైఫ్‌తో హిందీ సినిమారంగంలోకి అరంగేట్రం చేసింది.

2019లో వచ్చిన గుజరాతీ వెబ్ సిరీస్ డో నాట్ డిస్టర్బ్ ద్వారా నిర్మాతగా మారింది.[4] 2020లో గోల్కేరీ సినిమాతో గుజరాతీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పాత్ర ఇతర వివరాలు మూలాలు
2004-2005 కిత్నీ మస్త్ హై జిందగీ రష్మీ
2005 కైసా యే ప్యార్ హై తాన్య అతిథి పాత్ర
2005-2006 ఇండియా కాలింగ్ చాందిని
2005 కసౌతి జిందగీ కే కుకీ బజాజ్
2006 క్కవ్యాంజలి అక్షర
2007 ఆహత్ మిల్లీ ప్రత్యేక ప్రదర్శన, ఎపిసోడ్ 2
ఫోర్ తరంప్రీత్
2008 రిమోట్ కంట్రోల్ బబ్లీ
2009 సాత్ ఫేరే: సలోని కా సఫర్ కవిత
2010 సప్నా బాబుల్ కా.. . బిదాయి అతిథి (గులాల్‌) ప్రత్యేక ప్రదర్శన
సాథ్ నిభానా సాథియా
2010-2011 జిందగీ కా హర్ రంగ్ గులాల్ గులాల్
2010 ఝలక్ దిఖ్లా జా 4 అతిథి పాటలో
2011 యే రిష్తా క్యా కెహ్లతా హై అతిథి (గులాల్‌) ప్రత్యేక ప్రదర్శన
మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ
ససురల్ గెండా ఫూల్
ఈస్ ప్యార్ కో క్యా నామ్ దూన్?
కుచ్ తో లోగ్ కహెంగే మందిర అతిథి స్వరూపం
స్టార్ యా రాక్‌స్టార్ పోటీదారు విజేత
2012 ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై మహి అతిథి పాత్ర
2013 సరస్వతీచంద్ర కరుణా
2014 ఇష్క్ కిల్స్ కాంట్రాక్ట్ కిల్లర్
2015 యే హై మొహబ్బతేన్ అతిథి (మాయ) ప్రత్యేక ప్రదర్శన
2015-2016 సుమిత్ సంభాల్ లెగా మాయ సుమిత్ భార్య [5]
2016–2017 కసమ్ తేరే ప్యార్ కీ కృత్తిక అతిథి పాత్ర
2017 గంగ అతిథి ప్రత్యేక ప్రదర్శన
బిగ్ బాస్ 11
2019 కిచెన్ ఛాంపియన్ 5 జూహీ పర్మార్‌తో పాటు పోటీదారు [6]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష మూలాలు
2012 లీలాయి మలార్ తమిళం
2019 ఉరి: సర్జికల్ స్ట్రైక్ నేహా కశ్యప్ హిందీ [7]
2020 గోల్కేరి హర్షిత గుజరాతీ
2022 డియర్ ఫాదర్ అల్కా గుజరాతీ
2023 కచ్ ఎక్స్‌ప్రెస్ మోంఘి గుజరాతీ

షార్ట్ ఫిల్మ్స్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2019 లడ్డూ మో [8]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు ఛానల్ పాత్ర వేదిక
2017 బిన్ బులాయే మెహమాన్ షిట్టీ ఐడియాస్ ట్రెండింగ్ జాన్వి యూట్యూబ్
ది రైట్ టైం షిట్టీ ఐడియాస్ ట్రెండింగ్ శ్రేయ
ట్రూత్ ఆర్ డేర్ సోనూ
2018 సూపర్‌మామ్స్ విత్ మానసి[9] మానసి పరేఖ్ ఫేస్బుక్ పేజీ హోస్ట్ ఫేస్బుక్
డు నాట్ డిస్ట్రబ్[10] ఎంఎక్స్ ప్లేయర్ ఒరిజినల్స్ మీరా ఎంఎక్స్ ప్లేయర్

నాటకం

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర వేదిక
2012-2014 మరో పియు గయో రంగూన్ హెలి గ్లోబ్ టు గ్లోబ్ ఫెస్టివల్, లండన్

ఇతరాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర విభాగం
2017 తుమ్ భీ నా గాయకురాలు, నటి మ్యూజిక్ వీడియో

మూలాలు

[మార్చు]
  1. Jambhekar, Shruti (10 April 2014). "Manasi Parekh Gohil's love for Gujarati culture". The Times of India.
  2. "Manasi Parekh Gohil: With Nirvi's birth, many things became insignificant for me". The Times of India. Retrieved 2023-01-16.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Hindi actors learn Tamil for good performance in 'Leelai'". Archived from the original on 23 July 2011. Retrieved 2023-01-16.
  4. "Manasi Parekh Gohil turns producer; dons a dual role of actor and producer for 'Do Not Disturb'". The Times of India. Retrieved 2023-01-16.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "'Gulal' fame Manasi Parekh Gohil back on television!". Daily Bhaskar. Retrieved 2023-01-16.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "It's Mom Juhi Parmar Versus Mom Manasi Parekh in 'Kitchen Champions'". India West. Archived from the original on 2019-04-11. Retrieved 2023-01-16.
  7. "'Friends were jealous of me', says Manasi Parekh Gohil who plays Vicky Kaushal's sister in URI". Daily News Analysis. Retrieved 2023-01-16.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "Laddoo - Kumud Mishra - Royal Stag Barrel Select Large Short Films". LargeShortFilms on YouTube. 30 January 2019. Archived from the original on 15 December 2021.
  9. "Perizaad Zorabian Is the First Guest on Manasi Parekh's Chat Show". Archived from the original on 2019-08-26. Retrieved 2023-01-16.
  10. "Sumit Sambhal Lega actress Manasi Parekh produces first Gujarati web series". India Today. Retrieved 2023-01-16.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]