Jump to content

మానసి సాల్వి

వికీపీడియా నుండి
మానసి సాల్వి
జననం (1980-01-19) 1980 జనవరి 19 (వయసు 44)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1996 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిహేమంత్ ప్రభు (2005-2016, విడాకులు)
పిల్లలు1

మానసి సాల్వి, మహారాష్ట్రకు చెందిన టివి - సినిమా నటి.[1] అనేక టివి కార్యక్రమాలలో వివిధ పాత్రలతో గుర్తింపు పొందింది. కోహీ అప్నా సా (2001–2003), ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా (2012–2014), పాపా బై ఛాన్స్ మొదలైన సీరియళ్ళలో నటించింది.[2]

జననం

[మార్చు]

మానసి సాల్వి 1980, జనవరి 19న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.[3]

నటనారంగం

[మార్చు]

స్టార్ ప్లస్ వచ్చిన ప్యార్ కా దర్ద్ హై మీఠా మీతా ప్యారా ప్యారా అనే సీరియల్ లో ఆదిత్య తల్లి అవంతిక పాత్రలో నటించింది. ఏక్తా కపూర్ తీసిన కోహి అప్నా సా, ఆశీర్వాద్‌తో టివిరంగంలోకి ప్రవేశించింది. 2005లో సారర్తి లో నటించింది. 2015లో లతా నర్వేకర్ నిర్మాణంలో గజేంద్ర అహిరే దర్శకత్వం వహించిన మరాఠీ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మానసి సాల్వికి 2005లో సీరియల్ దర్శకుడు హేమంత్ ప్రభుతో వివాహం జరిగింది.[4] 2008లో వారికి ఒక కుమార్తె (ఒషిమా ప్రభు) జన్మించింది. 2016లో మానసి, హేమంత్‌లు విడాకులు తీసుకున్నారు.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమాలు పాత్ర భాష
2006 ఆయ్ షప్పత్ గార్గి దేవకీ దేశాయ్ మరాఠీ
2011 సదరక్షణాయ ఏసీపీ విద్యా పండిత్ మరాఠీ
2011 ఖేల్ మండల శీతల్ మరాఠీ
2013 అస మీ అశి టీ రియా మరాఠీ

అవార్డులు

[మార్చు]
  • ఉత్తమ నటిగా కళాకర్ అవార్డు 2002 - కోహి అప్నా సా
  • ఉత్తమ సహాయ నటిగా జీ గోల్డ్ అవార్డ్ 2013 - ప్యార్ కా దర్ద్ హై మీఠా మీతా ప్యారా ప్యారా
  • జీ మరాఠీ ఉస్తవ్ నాట్యాంచ అవార్డ్స్ 2020-21 సంవత్సరపు ఉత్తమ ప్రదర్శన - కాయ్ ఘడ్ల త్యా రాత్రి?

మూలాలు

[మార్చు]
  1. "Zee Marathi brings a brand new show EKACH HYA JANMI JANU". Glamgold Dot Com (in ఇంగ్లీష్). 2011-07-28. Archived from the original on 2020-01-25. Retrieved 2022-06-04.
  2. "Manasi Salvi Biography | Biography in Marathi". www.biographyinmarathi.com. 2021-01-30. Archived from the original on 2021-05-09. Retrieved 2022-06-04.
  3. "Manasi Salvi". BookMyShow (in Indian English). Archived from the original on 2021-06-20. Retrieved 2022-06-04.
  4. Padukone, Chaitanya (26 May 2006). "Hubby calls the shots for Manasi". Daily News and Analysi. Retrieved 2022-06-04.

బయటి లింకులు

[మార్చు]