మానసోల్లాస
Jump to navigation
Jump to search
అభిలాషితార్థ చింతామణి అని కూడా పిలవబడే మానసోల్లాస 1130 లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము.[1] సోమేశ్వరుడు 1127 నుండి 1139 వరకు కళ్యాణీ ప్రాంతాన్ని పాలించాడు. ఆ కాలంలో శాంతియుత వాతావరణం నెలకొని ఉండటము వలన మానసోల్లాసను పొందుపరచుటకు వీలైనది. ఆయన ఎంతో శ్రమతో కళలు, శిల్పశైలి, నృత్యము, సంగీతము, ఆభరణములు, వంటకాలు, పానీయాలు, ప్రేమ, శృంగారము మొదలైన వివిధ విషయాల గురించి సమాచారము సేకరించి ఒక క్రమబద్ధమైన విధంగా సమర్పించాడు.
ఈ గ్రంథము ఐదు వింశతులుగా విభజించబడినది. ఒకొక్క వింశతిలో 20 అధ్యాయములు ఉన్నాయి. మొత్తము గ్రంథాములో వంద అధ్యాయాలు ఉన్నాయి. మానసోల్లాస అనుష్టుప్ ఛందస్సులో రచించబడినది. మధ్యలో అక్కడక్కడ వచనం వాడబడినది. భాష సరళమైనదే కానీ అలంకారభూషితం.
వింశతి | అధ్యాయాలు | శ్లోకాల సంఖ్య |
---|---|---|
1. రాజ్యప్రాప్తికరణ వింశతి | 20 | 308 |
2. రాజ్యస్య స్థైర్యకరణ వింశతి | 20 | 1300 |
3. ఉపభోగస్య వింశతి | 20 | 1820 |
4. వినోద వింశతి | 20 | 3219 |
5. క్రీడా వింశతి | 20 | 1375 |
అధ్యాయములు
[మార్చు]మానసోల్లాసలోని మచ్చుకు కొన్ని అధ్యాయములు.
- యోసిదుపభోగ - శృంగారము
- నృత్యవినోద - నాట్య శాస్త్రము
- బలాధ్యాయ - ఏనుగుల పోషణ, సంరక్షణ
- గజవ్యాహాళి - ఏనుగులతో క్రీడలు
బయటి లింకులు
[మార్చు]- మానసోల్లాసలో వర్ణించిన చేపల గురించిన సమాచారం - ఏషియన్ అగ్రి-హిస్టరీ ఫౌండేషన్
- మానసోల్లాస - రెండు వింశతులు (పూర్తి పాఠ్యం)
మూలాలు
[మార్చు]- ↑ "MANASOLLSA - The Rules Guide" (PDF). Archived from the original (PDF) on 2012-03-19. Retrieved 2013-07-10.