మానాపురం రాజా చంద్రశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానాపురం రాజా చంద్రశేఖర్ తెలుగు రచయిత.[1] ఆయన వ్రాసిన కవిత "నాగేటిచాలు కన్నీటిపాట" 2009 అత్యుత్తమ కవితగా రంజని కుందుర్తి అవార్డు అందుకుంది.

జీవిత విశేషాలు[మార్చు]

అతను డిగ్రీలో స్పెషల్ తెలుగు చదివాడు. ఎం.ఏ.లో రాజనీతిశాస్త్రాన్ని అభ్యసించాడు. అతని తండ్రి పట్టాభిరామయ్య రంగస్థల పౌరాణిక నటుడు. తన కుటుంబానికి కవిత్వ నేపథ్యం లేనప్పటికీ అతనిలో ఉన్న ఆసక్తి, అధ్యయనం, పరిశీలన అతనిని కవిగా మలిచింది. అతని మొదటి కవిత "బామ్మ". వెంకన్న-భాస్కర్‌లు అతనికి లెక్కలు బోధించే మిత్ర అధ్యాపకులు. వారు తమ మాటల్లో తరచుగా సాహిత్యాన్ని గురించి చర్చ చేస్తుండేవారు. వారి ప్రేరణ అతనిపై పరోక్షంగా పడింది. అతని మిత్రుడు సురేష్ ఇల్లు తన ఇంటి ముందు ఉండేది. అందులో పెద్ద సాహిత్యం గ్రంథాలయం ఉండేది. అందులో పేరొందిన రచయితల రచనలు ఉండేవి. అతనికి తెలిసినంత మేరకు, అర్థమైనంత వరకూ చదివి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. సురేష్ లైబ్రరీ మీద ‘మిత్రుని లైబ్రరీ’ అనే ఒక కవితను కూడా రాసాడు. ఆ తర్వాత సాహిత్యవేత్త, లెక్చరర్‌ డా. రామసూరితో పరిచయం ఏర్పడింది. ‘యువస్పందన’ అనే సాహిత్య సంస్థను అతని అధ్యక్షతన నడుపుతుండేవాడు. నెలనెలా ఒకపుస్తక సమీక్ష, కవితాపఠనం జరిపేవారు. ఇలా ఇంట్లోనూ, జిల్లా గురజాడ లైబ్రరీలోనూ ఆది, సోమవార అనుబంధ-దిన పత్రికలు విరివిగా చదువుతుండేవారాయన. ఆ తర్వాత మద్యమధ్యలో మిత్రులతో సాహిత్య చర్చలు, సమావేశాలకు హాజరు కావడం, కవి సమ్మేళనాలలో పాల్గొనడం చేస్తుండేవారు. ఈ క్రమంలోనే ఆయన స్వయంగా తీర్చి దిద్దుకుంటూ పత్రికల్లో కవిత్వరచన చేస్తుండేవారు.[2]

పురస్కారాలు[మార్చు]

  • రంజని-కుందుర్తి కవితల పోటీలో అత్యుత్తమ కవితా అవార్డు (2009) ఉత్తమ అవార్డు (2000-2002),
  • అజోవిభో-జి.వి.ఆర్.కల్చరల్ ఫౌండేషన్ కవితల పోటీలో మొదటి బహుమతి (2008),
  • భిలాయివాణి- 2010 ఉత్తమ కవితా పురస్కారం,
  • 2010 ఎక్స్‌రే ఉత్తమ కవితా పురస్కారం,
  • శ్రీ తాండ్ర పాపారాయ ఫౌండేషన్ కవితల పోటీలో ద్వితీయ బహుమతి (2011-హైదరాబాద్),
  • సాహితీ వేదిక-అనకాపల్లి (ప్రధమ బహుమతి-2002),
  • సి.ఇ.టి.యు. శ్రామిక జనకవనంలో (ద్వితీయ బహుమతి – 2010),
  • వేమన సాహితీ కళా వేదిక కవితల పోటీలో బహుమతి (2011),
  • ప్రభుత్వ ఉగాది పురస్కారం (2006),
  • యువజనుల సర్వీసుల శాఖ అవార్డు (2006)

అనువాదాలు[మార్చు]

ఆయన కవిత ‘గాయపడ్డ బాల్యం’ ‘గాయల్‌బచ్‌పన్’ పేరుతో తెలుగు అకాడెమీ వాళ్ళు హిందీలోకి అనువాదం చేశారు.

మూలాలు[మార్చు]

  1. "జీవ ఫలం". www.magzter.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-01.
  2. కవి మిత్రులు మానాపురం రాజా చంద్రశేఖర్‌తో ముఖాముఖి:BY · APRIL 28, 2013 ముఖాముఖి నిర్వహణ: బులుసు సరోజినీదేవి