మానుషశాస్త్రం - ఆదిమ నివాసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానుషశాస్త్రం - ఆదిమ నివాసులు మానుష శాస్త్రము గురించి తెలియజేసే ఒక ప్రత్యేకత కలిగిన తెలుగు పుస్తకం. దీనిని ఎ.ఎం. సోమసుందరం రచించారు. దీనికి ఎ.అయప్పం తొలిపలుకు రచించగా గిడుగు వెంకట సీతాపతి పంతులు పరిచయ వాక్యాలు వ్రాసారు.[1]

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆంత్రోపాలజీ విభాగానికి పూర్వాధ్యక్షునిగా వ్యవహరించిన ఆచార్యుడు ఎ.అయ్యప్పన్ తనకు లోతైన అభినివేశం కలిగిన ఆంత్రోపాలజీకి సంబంధించిన ఆదివాసుల గురించి వ్రాసిన గ్రంథం ఇది. మానుష శాస్త్రం, ప్రపంచంలోని జాతులు, భారతదేశంలోని ఆదివాసులు, దేశద్రిమ్మరి జాతులు, ఆంధ్రదేశంలోని ఆదిమ జాతులు వంటివి ఈ పుస్తకంలో వివరించారు.

పుస్తకంలో..

[మార్చు]
  1. ప్రథమ భాగం (అ) : శాస్త్ర పరిచయం
  2. ప్రథమ భాగం (ఆ) మానవుని ఉత్పత్తి, ప్రపంచ జాతులు
  3. ద్వితీయ భాగం - భారతదేశ ఆదిమ నివాసులు
  4. తృతీయ భాగం : తిరుగుబోతు, ద్రిమ్మరు జాతులు
  5. చతుర్థ భాగం: ఆంధ్రదేశ ఆదిమనివాసులు

గ్రంథ పరిచయం-గిడుగు సీతాపతి

[మార్చు]

మానుష శాస్త్రం గూర్చి తెలుగులో అమరవాది ముకుంద సోమసుందరం గ్రంథం రాసి ఆంధ్ర సంస్కృతికి గొప్ప సేవ చేసారని గిడుగు సీతాపతి పుస్తకం ముందుమాటలో తెలియజేసారు. ఈ పుస్తకంలో ఆదిమనివాసుల ఆర్థిక మాధ్యం, దురాచారముల వలన గలిగిన దుస్థితి, మొదలైన విషయాలను చర్చింది వీరి నుద్దరించగల మార్గములను తెలియజేసారని రాసారు.

మూలాలు

[మార్చు]
  1. ఎ.అయ్యప్పన్ (1944). మానుషశాస్త్రం - ఆదిమ నివాసులు.

బాహ్య లంకెలు

[మార్చు]