మాయలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాయలో
దర్శకత్వంమేఘా మిత్ర పేర్వార్
నిర్మాతషాలిని నంబు
రాధాకృష్ణ నంబు
తారాగణంనరేశ్‌ అగస్త్య
జ్ఞానేశ్వరి కాండ్రేగుల
భావన
ఛాయాగ్రహణంకటివరపు వంశీ కృష్ణ
కూర్పుటించు ఫ్లిప్
అరుణ్ తచోత్
సంగీతండెన్నిస్ నార్టన్
నిర్మాణ
సంస్థ
ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్‌
విడుదల తేదీ
2023 డిసెంబరు 15 (2023-12-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

మాయలో 2023లో తెలుగులో విడుదలైన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ సినిమా.[1] ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్‌ బ్యానర్‌పై షాలిని నంబు, రాధాకృష్ణ నంబు నిర్మించిన ఈ సినిమాకు మేఘా మిత్ర పేర్వార్‌ దర్శకత్వం వహించాడు. నరేశ్‌ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, ఆర్జే హేమంత్ ప్ర‌ధాన‌ పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 08న విడుదల చేసి సినిమాను డిసెంబరు 15న విడుదల చేశారు.

కథ[మార్చు]

మాయ ( జ్ఞానేశ్వరి కాండ్రేగుల) ఇష్టపడ్డ వ్యక్తి పాల్ తో పెళ్లికి సిద్ధపడుతుంది. కతర పెళ్లికి రమ్మని చిన్ననాటి స్నేహితులు క్రిష్ (నరేష్ అగస్త్య), సింధు (భావన) లను తన పెళ్లికి ఆహ్వానిస్తుంది. పేరుకు చిన్నప్పటినుంచి ఫ్రెండ్సే అయినప్పటికీ వీళ్లకు ఒకరంటే ఒకరికి అంతర్గతంగా పడదు. అయినా సరే ఈ వీరిద్దరూ కలిసి మాయ పెళ్లికి ఓ కారును అద్దెకు తీసుకుని రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ఈ స్నేహితుల కథేంటి? స్నేహితులుగా ఉన్న మాయ, సింధూలు ఎందుకు దూరం అయ్యారు? పెళ్లి వరకు వారి ప్రయాణం ఎలా సాగింది అనేదే మిగతా సినిమా కథ.[2][3]

మూలాలు[మార్చు]

  1. Namaste Telangana (14 December 2023). "రొమాంటిక్‌ మాయలో." Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.
  2. Sakshi (15 December 2023). "#మాయలో మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?". Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.
  3. 10TV Telugu (16 December 2023). "#మాయలో రివ్యూ.. ప్రేమ, స్నేహంలో రొమాంటిక్ కామెడీతో." (in Telugu). Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మాయలో&oldid=4080109" నుండి వెలికితీశారు