మారుతున్న సమాజం - నా జ్ఞాపకాలు
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (అక్టోబరు 2016) |

మామిడిపూడి వేంకటరంగయ్య ప్రముఖ రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత కూడాను. బాల్యంలో తెలుగు, సంస్కృతం అభ్యసించిన తర్వాత ఆంగ్ల విద్య కోసం మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో చేరారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1907 లో బి.ఎ.పరీక్షలో మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చయప్ప కళాశాలలో పనిచేస్తూ అదే విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. చదువుతున్న కాలంలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రోత్సాహం మీద కాకినాడ లోని పిఠాపురం రాజావారి కళాశాలలో చరిత్రాధ్యాపకులుగా 1910లో చేరి 1914 వరకు నిర్వహించారు. తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో అధ్యాపకులుగా 1927 వరకు పనిచేశారు. ఆ కాలంలో యువరాజైన అలకనారాయణ గజపతికి విద్యాదానం చేశారు తర్వాత సంస్థానంలో దివానుగా నియమితులయ్యారు. వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958 లో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు. ఆయనకు భారత ప్రభుత్వం 1968 లో పద్మ భూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. 93 ఏళ్ళు జీవించిన వేంకటరంగయ్య తన విస్తారమైన, వైవిధయభరితమైన, లోతైన జీవితానుభవాలను ఈ గ్రంథరూపంలో రచించారు.
విషయసూచిక
[మార్చు]- మా గ్రామం
- మా శాఖ
- మా కుటుంబం
- నేను - నా విద్య
- నా ఉద్యోగం - ప్రథమ దశ
- నా ఉద్యోగం - రెండవ దశ
- నా ఉద్యోగం - మూడవ దశ
- నిరుద్యోగదశ - మొదటి భాగం
- నా ఉద్యోగ జీవితంలో ఆఖరు దశ (1)
- నా ఉద్యోగ జీవితంలో ఆఖరు దశ (2)
- వార్ధక్యం - ప్రథమ దశ
- వార్ధక్యం - రెండవ దశ