మారెమ్మవ్వ ఆలయం, ఉప్పరహాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మారెమ్మవ్వ ఆలయం కర్నూలు జిల్లా, కౌతాళం మండలంలోని ఉప్పరహళ్ గ్రామంలో ఉంది.[1]

ఆలయ విశేషాలు[మార్చు]

కర్నూలు జిల్లా 'ఉప్పర్ హాల్' లో ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ గ్రామానికి చెందిన ప్రజలు అమ్మవారి ఆలయంలో వచ్చిన హుండీ ఆదాయంతో, ప్రతియేటా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించేవారు. అలాగే హుండీ ఆదాయాన్ని అమ్మవారి దగ్గర అప్పుగా తీసుకుని ఆమెకి వడ్డీతో సహా చెల్లించాలని నిర్ణయించుకున్నారు. అలా అమ్మవారి ఆశీస్సులతో ఆమె దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బుతో చేసిన వ్యవసాయం వలన అందరికీ ఎన్నడూ లేనంతగా లాభాలు వచ్చాయి. దాంతో వడ్డీతో సహా తాము తీసుకున్న మొత్తాన్ని రైతులు హుండీలో వేశారు. అప్పటి నుంచి గ్రామంలోని వారంతా అమ్మవారి దగ్గర అప్పు తీసుకుని వ్యవసాయం చేయడం ఆనవాయతీగా మారిపోయింది. అలా వ్యవసాయం చేసిన రైతులకు నష్టమనేది తెలియకుండా పోయింది. రైతులు ఇచ్చే వడ్డీతో ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తోంది. అలాగే ఒకప్పుడు వేల రూపాయలను మాత్రమే అప్పుగా ఇచ్చే అమ్మవారు, అనతికాలంలోనే లక్షల రూపాయలను రుణాలుగా ఇచ్చే ఆర్థిక పరమైన సామర్థ్యాన్ని సంతరించుకుంది. ఈ ప్రాంతంలో కరవు అనేది కనిపించకుండా పోయింది.[1]

బయటి నుంచి వచ్చిన వ్యాపారులు గుడి హుండీలో వేసే కానుక సొమ్మునే మూలధనంగా ఏర్పరిచారు. రైతులు పండించ్చేపంట నుండి ఇచ్చే ధాన్యం కూడా మూల నిధిగా ఉంచ్చారు. ఇదే స్ఫూర్తితో గ్రామంలో మరో రెండు ఆలయాలు కూడా ఆప్పులు ఇస్తున్నాయి.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "లాభాలనిచ్చే లక్ష్మీదేవి". www.ap7am.com/. 3 December 2013. Retrieved 11 May 2016.[permanent dead link]
  2. అబ్దుల్, సమద్ (1 April 2012). "అప్పులిచ్చే అమ్మవారు". ఈనాదు ఆదివారం: 5.

ఇతర లింకులు[మార్చు]