మార్గరెట్ కజిన్స్
మార్గరెట్ కజిన్స్ | |
|---|---|
మార్గరెట్ ఈ. కజిన్స్, 1932 | |
| జననం | మార్గరెట్ ఎలిజబెత్ గిల్స్పీ 1878 నవంబరు 17 ఐర్లాండ్ లోని రోస్ కామన్ కౌంటీలోని బోయిల్ |
| మరణం | 1954 మార్చి 11 (వయసు: 75) అదిర్, మద్రాసు, భారతదేశం |
| వృత్తి | థియోసోఫిస్ట్, విద్యవాది, రచయిత |
| పేరుపడ్డది | ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకురాలు, 11వ అధ్యక్షురాలు |
| భాగస్వామి | జేమ్స్ కజిన్ |
మార్గరెట్ ఎలిజబెత్ కజిన్స్ (1878 నవంబరు 7- 1954 మార్చి 11) భారతదేశంతో సంబంధం ఉన్న ప్రముఖ ఐరిష్ విద్యావేత్త, థియోసాఫిస్ట్. ఈమెను గ్రెట్టా కజిన్స్ అని కూడా పిలుస్తారు.[1] ఈమె 1927లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ను(AIWC) స్థాపించింది. ఈమె కవి, సాహిత్య విమర్శకుడు అయిన జేమ్స్ కజిన్స్ కు భార్య. ఈమె 1915లో భారతదేశానికి వచ్చింది.[2] 1919 ఫిబ్రవరిలో మదనపల్లె కళాశాలకు రవీంద్రనాథ్ ఠాగూర్ సందర్శించినప్పుడు, ఆయన అందించిన గమనికల ఆధారంగా భారత జాతీయ గీతం "జన గణ మన" కు ట్యూన్‌ను అందించిన ఘనత ఈమెది.[3] ఈమె 1947 ఆగస్టు 14న రాజ్యాంగ సభకు జాతీయ జెండాను సమర్పించిన ఫ్లాగ్ ప్రెజెంటేషన్ కమిటీలో సభ్యురాలు.[4][5]
తొలినాళ్ళ జీవితం, చదువు
[మార్చు]మార్గరెట్ గిల్లెస్పీ ఐర్లాండ్‌లోని ప్రొటెస్టంటు క్రైస్తవ మతాన్ని అనుసరించే కుటుంబానికి చెందినది. [6] కౌంటీ రోస్కామన్‌లోని బాయిల్ లో మార్గరెట్ జన్మించింది. [7] ఈమె డెర్రీలో చదువుకుంది. [8] ఆమె డబ్లిన్‌లోని రాయల్ యూనివర్శిటీ ఆఫ్ ఐర్లాండ్‌లో సంగీతం అభ్యసించి, 1902లో పట్టభద్రురాలైంది. తర్వాత ఆమె ఉపాధ్యాయురాలిగా మారింది. ఆమె విద్యార్థిగా ఉన్నపుడు కవి, సాహిత్య విమర్శకుడు అయినా జేమ్స్ కజిన్స్‌ను కలిసింది. వీరు 1903లో వివాహం చేసుకున్నారు. ఈ జంట సోషలిజం, శాకాహారం, మానసిక పరిశోధనలను కలిసి అన్వేషించారు.
మూలాలు
[మార్చు]- ↑ Peter Gordon; David Doughan (2005). Dictionary of British Women's Organisations. Taylor & Francis. p. 66. ISBN 978-0-7130-4045-6. Retrieved 10 October 2012.
- ↑ Leneman, Leah (June 1997). "The awakened instinct: vegetarianism and the women's suffrage movement in Britain". Women's History Review. 6 (2): 271–287. doi:10.1080/09612029700200144. ISSN 0961-2025. S2CID 144004487.
- ↑ "Home". 1950.
- ↑ Alan Denson, ed. (1967). James H. Cousins (1873–1956) and Margaret E. Cousins (1878–1954): A Bio-bibliographical Survey. Kendal: published by the author. Retrieved 10 October 2012.
- ↑ Leneman, Leah (June 1997). "The awakened instinct: vegetarianism and the women's suffrage movement in Britain". Women's History Review. 6 (2): 271–287. doi:10.1080/09612029700200144. ISSN 0961-2025. S2CID 144004487.
- ↑ Kum Jayawardena (1995). The White Woman's Other Burden: Western Women and South Asia During British Rule. Taylor & Francis. pp. 147–155. ISBN 978-0-415-91104-7. Retrieved 10 October 2012.
- ↑ "Irish Genealogy". civilrecords.irishgenealogy.ie. Archived from the original on 4 October 2021. Retrieved 2020-08-16.
- ↑ Jennifer S. Uglow, ed. (1999). The Northeastern Dictionary of Women's Biography. Maggy Hendry. UPNE. p. 140. ISBN 978-1-55553-421-9. Retrieved 10 October 2012.