Jump to content

మార్టిన్‌డేల్: ద కంప్లీట్ డ్రగ్ రెఫరన్స్

వికీపీడియా నుండి
మార్టిన్‌డేల్: ద కంప్లీట్ డ్రగ్ రెఫరన్స్
రచయిత(లు)సంపాదకుని పేరు రొబర్ట్ బకింగ్‌హం
మూల శీర్షికMartindale: The Complete Drug Reference
దేశంయునైటెడ్ కింగ్‌డమ్
భాషఆంగ్లం
విషయంఫార్మసీ, వైద్యశాస్త్రం
శైలిఔషధాల సమాచారం
ప్రచురణ కర్తఫార్మస్యూటికల్ ప్రెస్
ప్రచురించిన తేది
మే 2020 (40వ సంచిక)
మీడియా రకంHardback print, digital online
ISBN978-0-85711-367-2
OCLC1112886663
Websitehttps://www.pharmpress.com/product/9780857113672/martindale40

మార్టిన్‌డేల్: ద కంప్లీట్ డ్రగ్ రెఫరన్స్ (Martindale: The Complete Drug Reference, అర్థం: మార్టిన్‌డేల్: పూర్తిస్థాయి ఔషధ కోశం (గ్రంథం)) అనేది ఫార్మస్యూటికల్ ప్రెస్ (Pharmaceutical press) అనే ముద్రణా సంస్థచే ప్రచురించబడుతున్న ఒక సంప్రదింపు పుస్తకం. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న సుమారు 6000 డ్రగ్సూ [గమనిక 1], మందులనూ, 1,25,000 పైచిలుకు ప్రప్రైయటరీ ప్రిపరెయ్షన్స్‌తో (Proprietary preparation, అర్థం: సొంత తయారీ) సహా చేర్చబడ్డాయి. అలాగే సుమారు 700 వ్యాధి చికిత్సా సమీక్షలు కూడా ఉన్నాయి.

ఈ పుస్తకం మొదటిసారిగా 1883లో మార్టిన్‌డేల్: ద ఎక్స్‌ట్రా ఫార్మకపీయ (Martindale: The Extra Pharmacopoeia, అర్థం: మార్టిన్‌డేల్: అదనపు ఔషధ సంహితం) అనే పేరుతో ప్రచూరితమైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ చికిత్సలకు వాడే మందీలతో పాటు పరిమిత స్థాయిలో పరీక్షలకూ, పశువైద్య శాస్త్రంలోకీ వాడుకలోనున్న డ్రగ్స్ గురించిన సమాచారం దీనిలో ఉంటుంది. ఇవే కాక మూలికలూ, ప్రత్యామ్నాయ వైద్య విధాన ఔషధాలూ, ఫార్మస్యూటికల్ ఎక్స్‌సిపియన్ట్స్ [గమనిక 2], వైటమిన్లూ, పౌష్ఠిక కారకాలూ, టీకాలూ, రెయ్డియొఫార్మస్యూటికల్స్ (radiopharmaceuticals), కొన్ట్రాస్ట్ మీడియా (contrast media), డైయగ్నొస్టిక్ ఎయ్జన్ట్సూ (Diagnostic agents), వైద్య వాయువులూ, వ్యసన పదార్థాలూ, విషపూరిత పదార్థాలూ, క్రిమినాశనిలూ, పురుగుల మందులు గూర్చిన సమాచారం కూడా ఇందులో ఇవ్వబడింది‌.

అంతర్జాతీయ దృష్టి

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డ్రగ్స్, అలాగే చికిత్సల్లో ప్రధాన పాత్ర పోషించే ఇతర పదార్థాలన్నిటిని పొందుపరచడం ఈ పుస్తకపు లక్ష్యం. ఈ పుస్తకం వైద్య సిబ్బంది రోగి వాడే మందు ఏమిటనేది రూఢీ చేసుకోవడానికి పనికొస్తుంది; మచ్చుకు విదేశాల నుండి వచ్చిన రోగి, తను వాడే మందుది బ్రెన్డ్ నెయ్మ్ (Brand name) [గమనిక 3] చెబితే, అది ఏ మందో ఈ పుస్తకం చూసి తెలుసుకోవచ్చు. అలాగే ఏదైనా డ్రగ్ దొరకతకపోతే, దాని బదులు వాడదగ్గ డ్రగ్స్ ఏమేమి ఉన్నాయో కూడా తెలుస్తుంది. ప్రతీ డ్రగ్ పైనా ఒక ఏకవిషయక రచన ఉంటుంది. ఈ రచనలో ఆ డ్రగ్ యొక్క కెమికల్ అబ్‌స్ట్రెక్ట్ సర్విస్[గమనిక 4] సంఖ్యా, ఎనటొమికల్ థెరప్యూటిక్ కెమికల్ క్లెసిఫికెయ్షన్ సిస్టమ్ కోడ్, యు.ఎస్ ఆహార ఔషధ నియంత్రణ సంస్థ యూనీక్ ఇంగ్రీడ్యన్ట్ ఐడెన్టిఫైయర్ (UNII) కోడ్‌లు ఉంటాయి. ఇవి పాఠకులు ఇతర సమాచార వ్యవస్థలను సంప్రదించడానికి పనికొస్తాయి.

పుస్తకపు అమరిక

[మార్చు]

ఈ పుస్తకం రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది. వీటితో పాటు మూడు సమగ్ర సూచికలు ఉంటాయి:

  • డ్రగ్స్ ఇంకా అనుషంగిక పదార్థాలపై ఏకవిషయ రచనలు. 49 ప్రకరణాల్లో 6400 ఏకవిషయ రచనలు కలవు. చికిత్సల్లో ఈ పదార్థాల వాడకం ఆధారంగా సంబంధిత వ్యాధి చికిత్సా సమీక్షలు కూడా ఉంటాయి. ఏకవిషయ రచనలో ఆ పదార్థం యొక్క నామకరణ విశేషాలూ, గుణాలూ, ప్రభావాలూ, ఉపయోగాలూ ఉంటాయి. ఆపైన అదనపు పదార్థాల గురించి ఉన్న ఒక ప్రకరణంలో కొత్త డ్రగ్సూ, వర్గీకరణకు అందని పదార్థాలూ, మూలికలూ, ప్రస్తుతం వాడకంలో లేనప్పటికీ చికిత్సా ప్రక్రియల్లో ఇంకా పాత్ర పొషిస్తున్న పదార్థాలపై ఏకవిషయ రచనలు ఉంటాయి. ఇవే కాక కొన్ని విషపూరిత పదార్థాలపై కూడా ఏకవిషయ రచనలు ఉన్నాయి.
  • ఔషధ మిశ్రమాలు- 43 దేశాల నుండి 1,25,000 మిశ్రమాలు ఇందులో చేర్చబడ్డాయి.
  • తయారీదారుల సూచిక. దీనిలో 25,000 తయారీదారుల జాబితా ఉంది.
  • వివిధ భాషల్లో ఔషధ నిర్మాణ శాస్త్ర పరిభాష. ఇందులో 5600 ఔషధ నిర్మాణ శాస్త్ర పదాలూ, రోగికి మందులు ఇచ్చు దారులూ ఐరోపా యొక్క 13 ప్రధాన భాషల్లో ఇవ్వబడ్డాయి. ఆంగ్లం మాతృభాష కానివారికి ఉత్పత్తి సమాచారం, పెకేజింగ్, ఇతర భాషల్లో వ్రాయబడ్డ మందుల చీటీలూ అర్థం చేసుకునేందుకు ఉపకరించే ఉద్దేశంతో ఇది చేర్చబడింది.
  • సూచిక: 1,75,000 పేర్లు గల సూచికలో ఆమోదించబడ్డ పేర్లూ, పర్యాయపదాలూ, రసాయనశాస్త్ర పేర్లూ; ఆ పైన సిరిలిక్ లిపిలో రష్యన్, ఉక్రెయిన్యన్ పేర్లను పొందుపరుస్తూ ఇంకో ప్రత్యేక సూచిక కూడా ఉంది.

డిజిటల్ ప్రతులలో ఇంకో 1,000 ఏకవిషయ రచనలూ, 1,00,000 మిశ్రమాల పేర్లూ, 5,000 తయారీదారుల పేర్లూ అదనంగా ఉన్నాయి.

సంచికలు

[మార్చు]

ఇప్పటివరకూ 40 సంచికలు విడుదలయ్యాయి. 40వ సంచిక మే 2020లో ప్రచూరితమైంది.

గమనికలు

[మార్చు]
  1. డ్రగ్ (Drug) అంటే దానిని తీసుకున్న జీవి యొక్క శారీరక లేదా మానసిక స్థితులలో మార్పులు కలుగజేయగలిగే పదార్థం. చికిత్సకై వాడే డ్రగ్‌ను మందు/ఔషధం అంటారు.
  2. ఫార్మస్యూటికల్ ఎక్స్‌సిపియన్ట్ (Pharmaceutical Excipient) అంటే సహాయక పదార్థం. ఒక పదార్థాన్ని రోగి తీసుకోవడానికీ, ఆ పదార్థం ఒంటబట్టి పనిచేయడానికీ తోడ్పడేందుకు గానూ ఔషధ మిశ్రమంలో చేర్చు ఇతర పదార్థాలను ఎక్స్‌సిపియన్ట్స్ అంటారు.
  3. ఏదైనా ఒక మందుకి ఆ మందును తయారు చేసిన సంస్థ ఇచ్చిన పేరు
  4. Chemical abstract service (CAS) అనేది అమెరికన్ కెమికల్ సొసైటి (American chemical society, అర్థం: అమెరికా రసాయన సంఘం) అనే ఒక శాస్త్రీయ సంఘపు భాగం. ఇది రసాయనాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

మూలాలు

[మార్చు]
  • Robert Buckingham, ed. (2020). Martindale: The Complete Drug Reference (40th ed.). London: Pharmaceutical Press. ISBN 978-0-85711-367-2.

వెలుపలి లంకెలు

[మార్చు]