మార్టిన్ కూపర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్టిన్ కూపర్
Martin Cooper, Two Antennas, October 2010.jpg
2010లో కూపర్
జననం (1928-12-26) 1928 డిసెంబరు 26 (వయసు 94)
చికాగో, ఇల్లినాయిస్, యు.ఎస్.
జాతీయతఅమెరికన్
విద్యఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (B.S.E.E.; M.S.E.E.)
వృత్తిఆవిష్కర్త
పారిశ్రామికవేత్త
ఎగ్జిక్యూటివ్
ఉద్యోగంమోటరోలా
అర్రేకాం స్థాపకుడు & CEO
డైనా LLC యొక్క సహ వ్యవస్థాపకుడు & చైర్మన్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హ్యాండ్హెల్డ్ (చేతితో పట్టుకెళ్లగల) సెల్యులార్ మొబైల్ ఫోన్ కనిపెట్టడం. ప్రపంచంలో మొట్టమొదటి హ్యాండ్హెల్డ్ సెల్యులార్ మొబైల్ ఫోన్ కాల్ చేయడం.
జీవిత భాగస్వామిఅర్లేన్ హారిస్
పురస్కారాలుమార్కోనీ బహుమతి (2013)

మార్టిన్ కూపర్ (జననం: 1928 డిసెంబరు 26న, చికాగో, ఇల్లినాయిస్, యునైటెడ్ స్టేట్స్‌లో) వైర్లెస్ కమ్యూనికేషన్ పరిశ్రమలో ఒక అమెరికన్ మార్గదర్శకుడు, అసాధ్యుడు. రేడియో స్పెక్ట్రం నిర్వహణలో ఇతని నూతనత్వం గుర్తించబడింది, ఈ రంగంలో ఇతను పదకొండు పేటెంట్లు పొందాడు. కూపర్ 1970లో మోటరోలా కంపెనీలో ఉన్నప్పుడు మొదటిసారి హ్యాండ్హెల్డ్ మొబైల్ ఫోన్ (కార్ ఫోన్‌కు భిన్నంగా) ఆలోచన చేశాడు, తరువాత అతను అతని నేతృత్వంలోని బృందం దానిని అభివృద్ధి చేసి మార్కెట్ లోనికి తీసుకువచ్చారు. చరిత్రలో హ్యాండ్హెల్డ్ సెల్యులార్ ఫోన్ కాల్ చేయబడిన మొట్టమొదటి వ్యక్తిగా గుర్తించబడిన ఇతన్ని "సెల్‌ఫోన్ పితామహుడు"గా పరిగణిస్తారు.