మార్బర్గ్ వైరస్
Script error: No such module "Autovirusbox". మార్బర్గ్ వైరస్ (Eng:Marburg virus), ఎబోలా వైరస్ వంటి వైరస్ల కుటుంబానికి చెందినది. ఇది మార్బర్గ్ వైరస్ వ్యాధి (MVD) కారణం, మార్బర్గ్ వైరస్ మొదటిసారిగా 1967లో గుర్తించబడింది ఎబోలా వలె, మార్బర్గ్ తీవ్రమైన రక్తస్రావ జ్వరాన్ని కలిగిస్తుంది, ఇది బహుళ అవయవ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది, విపరీతమైన రక్తస్రావం కలిగి ఉంటుంది[1], మార్బర్గ్ వైరస్ వ్యాధి చాలా ప్రాణాంతకం[2], దీనిని గతంలో గతంలో మార్బర్గ్ హెమరేజిక్ జ్వరం అని పిలిచేవారు, ఇది మొదట గబ్బిలాల ద్వారా మనిషికి, ఆతరువాత వ్యాధి సోకినా సోకిన వ్యక్తుల రక్తం, స్రావాలు, అవయవాలు లేదా ఇతర శారీరక ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా (తెగిన చర్మం లేదా శ్లేష్మ పొరల ద్వారా), ఈ ద్రవాలతో కలుషితమైన ఉపరితలాలు, పదార్థాలతో (ఉదా. పరుపు, దుస్తులు) మార్బర్గ్ మానవుని నుండి మనిషికి వ్యాపిస్తుంది. ఇన్‌ఫెక్షన్ నుండి లక్షణాల ప్రారంభం వరకు విరామం 2 నుండి 21 రోజుల వరకు ఉంటుంది[3].ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి ఆమోదించబడిన టీకాలు లేదా యాంటీవైరల్ చికిత్సలు లేవు.