మాలిగ్నెన్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాలిగ్నెన్సీ కణితి విస్తరిస్తున్న దృశ్యం

మాలిగ్నెన్సీ అనేది క్రమక్రమంగా అధ్వాన్నంగా మారే ఒక వైద్య పరిస్థితి యొక్క వైఖరి. మాలిగ్నెన్సీ అనే పదం మేల్, గ్నస్ అనే లాటిన్ పదాల కలయిక నుంచి వచ్చింది, లాటిన్ భాషలో మేల్ అనగా "చెడుగా", గ్నస్ అనగా "జననం". మాలిగ్నెన్సీ క్యాన్సర్ స్వభావమునకు చాలా దగ్గరది. మాలిగ్నెంట్ ట్యూమర్ కేన్సరేతర నిరపాయమైన కంతికి విరుద్ధమైనది, ఈ వ్రణాలు ప్రక్కనున్న కణజాలాలను ఆక్రమిస్తుంటాయి, ఈ వ్రణాలు శరీరంలోని దూర కణజాలాలకు వ్యాప్తి చెందె సమర్థతతో ఉంటాయి. నిరపాయమైన కంతి మాలిగ్నెంట్ ట్యూమర్ లక్షణాలను కలిగి ఉండవు.

మనిషి శరీరంలో కణ విభజన ప్రక్రియ అదుపు తప్పినప్పుడు అదే పనిగా కణ విభజన జరుగుతూ వ్రణాలు ఏర్పడుతుంటాయి, ఇలా వ్రణాలు ఇతర భాగాలకు పాకుతూ ఏర్పడుతాయి, ప్రక్క కణజాలాలకు పాకుతూ మనిషిని ప్రాణాపాయ స్థితిలోకి తీసుకువెళ్లే ఈ వ్రణాలను మాలిగ్నెంట్ ట్యూమర్లు అంటారు. ఊపిరితిత్తులు, రొమ్ము, జీర్ణాశయం వంటి శరీరావయవ కణజాలలో ఏర్పడే మాలిగ్నెంట్ గడ్డలను కార్సినోమా క్యాన్సర్ అంటారు.