మాళవిక మనోజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2012లో మాళవిక

మాళవిక మనోజ్, (జననం 1993 సెప్టెంబరు 16) భారతీయ ప్రముఖ స్వతంత్ర సంగీత[నోట్స్ 1] కళాకారిణి, గీత రచయిత్రి. ఈమె మాలీ పేరుతో సంగీత రంగంలో ప్రసిద్ధి చెందింది. ముంబైకు చెందిన ఈమె అండర్ గ్రౌండ్[నోట్స్ 2] సంగీతానికి చెందిన బ్యాండ్, బేస్-ఇన్-బ్రిడ్జ్ లో సభ్యురాలు. ఈ బ్యాండ్ 2011లో మూసివేయబడ్డ తరువాత సోలో కళాకారిణిగా కొనసాగుతోంది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మాళవిక 1993 సెప్టెంబరు 16న[1] చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఉత్తర మలబార్ ప్రాంతానికి చెందిన మలయాళీలు.[2] ఆమె చిన్నతనం నుండి విపరీతంగా సంగీతం వినడం అలవాటు. ఆమె తల్లిదండ్రులు సంగీత కళాకారులు కాకపోయినప్పటికీ, ఆమె బాగా చిన్న వయసులో ఉండగానే, వారు 1970లు, 80ల కాలంలోని సంగీతం వినిపించేవారు. మాళవిక తండ్రి, 1990ల కాలం నుంచీ కూడా, ఎలక్ట్రానిక్ వాయిద్యాలపై వాయించే సంగీతాన్ని బాగా వినేవాడు. అతనితో పాటు, మాళవికకు కూడా ఆ సంగీతం వినడం బాగా అలవాటు అయింది. ఆమె తల్లిదండ్రులు, మాళవిక ఐదవ ఏటనే ఈత నుంచి భరతనాట్యంవరకూ, పియానో నుంచి చిత్రలేఖనం వరకూ వివిధ క్లాసుల్లో చేర్పించారు. అయితే ఆమె నెమ్మదిగా పియానో తప్పించి మిగిలిన అన్ని క్లాసులనూ మానేసింది. తన 17వ ఏట వరకూ పియానో నేర్చుకుంది. దీనితో పాటు ఆమెకు గిటార్ పై ఉన్న అభిరుచి కారణంగా, ఆ వాయిద్యం కూడా నేర్చుకోవడం మొదలు పెట్టింది.[3] తాను ఎప్పుడూ సంగీత రంగంలో స్థిరపడాలని కోరుకుంటున్నానని తన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం రాలేదు అంటుంది మాళవిక. తన కాళ్ళపై తాను నిలబడి, తనకి ఇష్టమైన రంగంలో కెరీర్ కొనసాగించడమే తన తల్లిదండ్రులకు కావాలని చెబుతుంది.[4] ఆమె 12వ ఏట, ఒక పార్టీలో మొదటిసారి ప్రదర్శన ఇచ్చింది. ఆమె ఆ పార్టీలో, ఎల్లా ఫిట్జ్ గెరాల్డ్ పాడిన "ఫీవర్" పాటను, సందర్భానికి తగ్గట్టుగా కొద్దిగా సాహిత్యం మార్చి పాడింది.

మాళవిక చెన్నైలోని లయోలా కళాశాలలో బిబిఎ చదివింది. 2013లో, బిబిఎ డిగ్రీ పూర్తి చేసేందుకు ఫ్రాన్స్ వెళ్ళింది, కానీ ఒక సంవత్సరం తరువాత చెన్నై తిరిగి వచ్చేసింది. [5][6] అదే ఏడాది లయోలా కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, [5] సంగీతంలో కెరీర్ ప్రారంభించడానికి ముంబై వెళ్ళిపోయింది.[7]

మాళవిక తన మత విశ్వాసాల గురించి వివరిస్తూ, తాను నాస్తికురాలు కాదనీ, తన కుటుంబంతో పూజల్లో పాల్గొంటాననీ, అయితే తనకు ప్రత్యేకంగా పూజలపై నమ్మకం లేదు అని చెప్పింది. కానీ మత విశ్వాసాల గురించి, ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుంటానని వివరించింది. తనంత తాను పూజలు చేయకపోయినా, దేవుణ్ణి ప్రార్ధిస్తానని తెలిపింది.[8]

కెరీర్

[మార్చు]

బేస్-ఇన్-బ్రిడ్జ్

[మార్చు]

2010లో, మాళవిక చెట్టినాడ్ విద్యాశ్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో మైత్రి వద్ద ప్రదర్శన ఇచ్చింది. అక్కడ ఆమె ఉత్తమ గాయనిగా గుర్తింపు పొందింది. ఈ ప్రదర్శన వీక్షించిన ప్రముఖ రేడియో జాకీ అర్జున్ థామస్, చెన్నై లైవ్ రేడియో స్టేషన్ బ్యాండ్ నిర్వహించడం కోసం ప్రయత్నిస్తోందనీ, మాళవిక కూడా ఒక బ్యాండ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనీ సలహా ఇచ్చాడు.[9] అలా బేస్-ఇన్-బ్రిడ్జ్ అనే పేరుతో, సెప్టెంబరు 2010లో ఒక బ్యాండ్ ను ప్రారంభించింది మాళవిక.[10] అర్జున్ గిటారిస్టుగా, సాజిత్ సత్య బాసిస్ట్ గా, లియోన్ థామస్ కీబోర్డు ప్లేయర్ గా, మాళవిక గాయనిగా, శశాంక్ విజయ్ డ్రమ్మర్ గా ఈ బ్యాండ్ ప్రారంభమైంది.[11]

నోట్స్

[మార్చు]
  1. మూస:కమర్షియల్ పరంగా, సరిగా ప్రొడ్యూస్ చేయని సంగీతాన్ని independent music అంటారు.
  2. {{ప్రధాన సంస్కృతికి భిన్నంగా, చట్టపరంగా కమర్షియల్ చేయబడని సంగీతాన్ని అండర్ గ్రౌండ్ సంగీతం అంటారు.}}

మూలాలు

[మార్చు]
  1. "Mali (Maalavika) - About". Facebook. 16 September 1993. Retrieved 14 August 2015.
  2. "The joy of sharing". Deccan Chronicle. 16 June 2013. Archived from the original on 20 నవంబరు 2015. Retrieved 14 August 2015.
  3. "Musician with a message". The Hindu. 26 December 2012. Retrieved 14 August 2015.
  4. "They're the four who rock". Deccan Chronicle. Archived from the original on 20 నవంబరు 2015. Retrieved 11 September 2015.
  5. 5.0 5.1 Suraksha, P. "Band-baaja, Bunking & Bloopers". The New Indian Express. Archived from the original on 19 నవంబరు 2015. Retrieved 14 August 2015.
  6. Suraksha, P. "The Need for Recognition". The New Indian Express. Archived from the original on 15 ఆగస్టు 2015. Retrieved 14 August 2015.
  7. "Beyond Bass-in-Bridge - Indulge". Indulge (in అమెరికన్ ఇంగ్లీష్). 27 January 2017. Archived from the original on 2 ఫిబ్రవరి 2017. Retrieved 27 January 2017.
  8. Shenoy, Sonali (12 December 2012). "'I pray only when I really feel like'". The New Indian Express. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 14 August 2015.
  9. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Three's Company అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  10. "Introducing BASS — IN BRIDGE". Thamarai.co.uk. Retrieved 14 August 2015.
  11. "Bass-in Bridge Bio". ReverbNation. Retrieved 11 September 2015.