Jump to content

మిడ్‌నైట్ మర్డర్స్

వికీపీడియా నుండి
మిడ్ నైట్ మర్డర్స్
దర్శకత్వంమిథున్‌ మ్యానువల్‌ థామస్
నిర్మాతవి. రామకృష్ణ, ఆషిక్‌ ఉస్మాన్‌
తారాగణంకుంచకో బోబన్‌, శ్రీనాథ్‌ బసి, షరాఫ్‌ యుద్దీన్‌, ఉన్నిమయ ప్రసాద్‌, జీనూ జెసెఫ్‌
ఛాయాగ్రహణంసైజు ఖలీద్‌
కూర్పుసైజు శ్రీధరన్‌
సంగీతంసూషిన్ శ్యామ్
నిర్మాణ
సంస్థ
ఆషిక్‌ ఉస్మాన్‌ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
19 ఫిబ్రవరి 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

మిడ్‌నైట్‌ మర్డర్స్‌ 2021లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు సినిమా. 2020 జనవరిలో మలయాళంలో విడుదలైన ‘అంజామ్‌ పథిరా’ సినిమాను తెలుగు డబ్బింగ్ చేసి 2021 ఫిబ్రవరి 19న ఆహా ఓటీటీలో విడుదల చేశారు. కుంచకో బోబన్‌, శ్రీనాథ్‌ బసి, షరాఫ్‌ యుద్దీన్‌, ఉన్నిమయ ప్రసాద్‌, జీనూ జెసెఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

కేర‌ళ‌లోని ఓ న‌గ‌రంలో సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ల కిడ్నాప్ జ‌రుగుతుంటుంది. వ‌రుస‌గా పోలీస్ ఆఫీస‌ర్లు మాయం అవుతుంటారు. మ‌రుస‌టి రోజు శ‌వాలు దొరుకుతుంటాయి. వాళ్ల క‌ళ్ల‌నీ, గుండెల్నీ పీకేసి స‌జీవంగా ఉన్న‌ప్పుడే కిరాతంగా హ‌త్య చేస్తుంటారు. హ‌త్య‌కు సంబంధించిన ఒక్క క్లూ కూడా దొర‌క‌దు. కేవ‌లం కళ్లు తెర‌చుకుని చూస్తున్న‌ న్యాయ దేవ‌త ప్ర‌తిమ మాత్ర‌మే దొరుకుతుంటుంది. ఈ కేసు పోలీసుల‌కు పెద్ద స‌వాలుగా మారుతుంది. దాన్ని పోలీసులు ఎలా ఛేదించారు? ఈ కేసులో అన్వర్ హుస్సేన్ (కుంక‌చో బోన‌న్‌) సైకాల‌జిస్ట్ పాత్రేమిటి? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు అనేది మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • నిర్మాత: వి. రామకృష్ణ
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మిథున్‌ మ్యానువల్‌ థామస్
  • సినిమాటోగ్రఫీ: సైజు ఖలీద్‌
  • ఎడిటింగ్‌: సైజు శ్రీధరన్‌

మూలాలు

[మార్చు]
  1. Republic World (22 February 2021). "Midnight Murders Telugu movie Cast: Know all about the cast of this solid murder-mystery" (in ఇంగ్లీష్). Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
  2. Eenadu. "రివ్యూ: మిడ్‌నైట్‌ మర్డర్స్‌". Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
  3. NTV (7 March 2021). "రివ్యూ : ఆద్యంతం ఉత్కంఠభరితంగా "మిడ్ నైట్ మర్డర్స్"". Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.