మిథన్ జంషెడ్ లామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిథన్ జంషెడ్ లామ్
మిథన్‌లామ్‌
జననం(1898-03-02)1898 మార్చి 2
మహారాష్ట్ర, భారతదేశం
మరణం1981
వృత్తిన్యాయవాది
సామాజిక కార్యకర్త.
క్రియాశీల సంవత్సరాలు1919–1981
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మహిళల హక్కులు
జీవిత భాగస్వామిజంషెడ్ సోరభా లాం
పిల్లలుసోరాబ్ జంషెడ్ సోరభా లాం
తల్లిదండ్రులుఅర్దేశీర్ టాటా
హెరాబాయి టాటా
పురస్కారాలుపద్మ భూషణ్
కాబ్డెన్ క్లబ్ మెడల్

మిథన్ జంషెడ్ లామ్ (1898-1981) ఒక భారతీయ న్యాయవాది, సామాజిక కార్యకర్త. ఈమె ముంబై హైకోర్టులో మొదటి భారతీయ మహిళా న్యాయవాది.[1] ఈమె పద్మభూషణ్ పురస్కార గ్రహీత.[2]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈమె 1898లో అర్దేశీర్ టాటా, హెరాబాయి టాటాకు మహారాష్ట్రలో జన్మించింది. ఈమె ప్రాథమిక విద్యను పూణే జిల్లాలోని ఫుల్గావ్‌లో పూర్తిచేసింది. ఈమె ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీలో తన గ్రాడ్యుయేషన్ ను పూర్తిచేసింది. ఈమె ఎకనామిక్స్‌లో మొదటి స్థానంలో నిలిచినందుకు కాబ్డెన్ క్లబ్ పతకాన్ని గెలుచుకుని, గౌరవాలతో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీని పూర్తిచేసింది. భారతదేశంలో ఉమెన్ ఓటు హక్కు అనే అంశంపై హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులతో చర్చించే అవకాశం కూడా ఈమెకు లభించింది. ఈమె తన మాస్టర్స్ డిగ్రీని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పూర్తిచేసింది. ఈమె ఇంగ్లాండ్‌లో ఉండడం వల్ల భారతదేశంలో మహిళా ఓటు హక్కు కోసం వాదించడానికి దేశంలో ఉన్న సరోజిని నాయుడు, అనిబిసెంట్ వంటి భారతీయ మహిళా నాయకులతో కలిసే అవకాశం వచ్చింది.

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈమె ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ సభ్యురాలు, 1961-62లో దాని అధ్యక్షురాలిగా కూడా పనిచేసింది. సమాజానికి ఈమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1962లో మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది.[3]

మూలాలు[మార్చు]

  1. "ఓటు హక్కు ఆమె చలవే | general". web.archive.org. 2024-04-29. Archived from the original on 2024-04-29. Retrieved 2024-04-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Former Sheriff of Bombay". University of Southern California Digital Library. 2016. Archived from the original on 9 మార్చి 2016. Retrieved 14 December 2019.
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 14 డిసెంబరు 2019.