మిథునం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మిథునం
మన అమ్మానాన్నల ప్రేమకథ
దర్శకత్వం తనికెళ్ళ భరణి
నిర్మాత ఆనంద్ మువిదా రావు
రచన శ్రీ రమణ
చిత్రానువాదం తనికెళ్ళ భరణి
జొన్నవిత్తుల
ఆనంద్ మువిదా రావు
తారాగణం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
లక్ష్మి (నటి)
సంగీతం స్వర వీణాపాణి
ఛాయాగ్రహణం రాజేంద్రప్రసాద్ తనికెళ్ళ
కూర్పు ఎస్. బి. ఉద్దవ్
పంపిణీదారు AMR ప్రొడక్షన్స్
J & J ఫిలింస్
విడుదలైన తేదీ డిసెంబరు 21, 2012 (2012-12-21)[1]
దేశం భారతదేశం
భాష తెలుగు

Read more at: http://telugu.oneindia.in/movies/news/2013/08/midhunam-recommended-oscar-entry-121688.html

మిథునం 2012 లో విడుదలైన తెలుగు చిత్రం. సుప్రసిద్ద తెలుగు రచయిత శ్రీ రమణ దాదాపు పాతిక సంవత్సరాల క్రితం రచించిన 25 పేజీల మిథునం కథకు తనికెళ్ళ భరణి అందించిన చిత్రరూపమే ఈ చిత్రం.

కథ[మార్చు]

అప్పదాసు (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) విశ్రాంత ఉపాధ్యాయుడు. అర్ధాంగి బుచ్చి (లక్ష్మి) తో కలిసి స్వగ్రామంలో నివసిస్తుంటాడు. పిల్లలందరూ విదేశాలలో స్థిరపడటం వలన దంపతులిద్దరూ మాత్రమే శేషజీవితాన్ని గడుపుతూ, జీవితాన్ని విచారంగా గాక ఎంత రమణీయంగా...రసమయంగా మలుచుకుని తమ శేషజీవితాన్ని ఓ మధురానుభూతిగా మిగిల్చారన్నదే స్థూలంగా కథ... ఈ క్రమంలో వీరిద్దరి మధ్యన జరిగే విశేషాల సమాహారమే ఈ చిత్రం.

కేవలం రెండు పాత్రలు తప్ప సినిమాలో ఏ పాత్ర కనిపించదు. పద్మభూషణ్‌ కెజె యేసుదాసు ఒక పాట, పాత తరం ప్రముఖ గాయని జమునారాణి ఒక జానపదం గీతం ఈ చిత్రంలో పాడారు. జొన్నవిత్తుల ‘కాఫీ దండకం’ రచించారు. ఈ చిత్రం ఆడియో సి.డి. అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో, డల్లాస్‌లో, న్యూజెర్సీలో ప్రవాసాంధ్రుల సమక్షంలో విడుదల చేశారు.

ఆస్కార్ అవార్డుకు నామినేట్[మార్చు]

సినిమా ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఇచ్చిన సూచనల మేరకు ఈ సినిమా ఆస్కార్ అవార్డు కు నామినేట్ అయ్యింది. ఈ చిత్ర నిర్మాతకు 'మిధునం' సినిమా ఉత్తమ విదేశీ భాషా సినిమా అవార్డు క్యాటగిరి' లో నామినేట్ అయినట్లు లెటర్ అందింది.

చిత్రమాలిక[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Midhunam in Cinemas on 21st December". Ragalahari. Retrieved 18 డిసెంబరు 2012.  Check date values in: |accessdate= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=మిథునం&oldid=1420440" నుండి వెలికితీశారు