మిస్టేక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిస్టేక్
దర్శకత్వం
  • భ‌ర‌త్ కొమ్మాల‌పాటి
రచన
  • భ‌ర‌త్ కొమ్మాల‌పాటి
నిర్మాత
  • అభినవ్ స‌ర్దార్‌
తారాగణం
  • అభినవ్ స‌ర్దార్‌
  • అజయ్ క‌తుర్‌వ‌ర్‌
  • క‌రిష్మా కుమార్‌
  • సుజిత్
  • తానియా క‌ల్రా
ఛాయాగ్రహణంహ‌రి జాస్తి
కూర్పు
  • విజ‌య్ ముక్తావ‌ర‌పు
సంగీతంమ‌ణి జెన్నా
నిర్మాణ
సంస్థ
ఎ.ఎస్‌.పి.మీడియా హౌస్‌
విడుదల తేదీ
2023 ఆగస్టు 4 (2023-08-04)
భాషతెలుగు

మిస్టేక్ 2023లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా. ఎ.ఎస్‌.పి.మీడియా హౌస్‌ బ్యానర్‌పై అభిన‌వ్ స‌ర్దార్ నిర్మించిన ఈ సినిమాకు భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించాడు. అభిన‌వ్ స‌ర్దార్, అజయ్ క‌తుర్‌వ‌ర్‌, సుజిత్ కుమార్, తేజ్ ఐనంపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జూన్ 25న ట్రైలర్‌ను విడుదల చేసి[1], సినిమాను ఆగష్టు 4న విడుదల చేశారు.[2][3]

నటీనటులు[మార్చు]

  • అభిన‌వ్ స‌ర్దార్‌
  • అజయ్ క‌తుర్‌వ‌ర్‌
  • సుజిత్
  • తేజ ఐనంపూడి
  • క‌రిష్మా కుమార్‌
  • తానియా క‌ల్రా
  • ప్రియా పాల్
  • రాజా రవీంద్ర
  • సమీర్

కథ[మార్చు]

అగస్త్య (అజయ్), కార్తీక్ (తేజ ఐనంపూడి), దేవ్ (సుజిత్ కుమార్) ఒకే రూమ్ లో ఉండే ముగ్గురు స్నేహితులకి వేరు వేరు సమస్యలు వచ్చి వాళ్ళని వారం రోజుల్లో చంపేస్తామని బెదిరింపులు వస్తాయి. దీంతో ఒక వారం రోజులు ఎక్కడికైనా కనపడకుండా వెళ్లిపోవాలని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ మిత్ర (ప్రియ), స్వీటీ (తానియ కల్ల్రా), పారు (నయన్ సారిక) తో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోనే ఫారెస్ట్‌కి వెళ్తుంటే మార్గ మధ్యలో అభినవ్ సర్దార్ వీళ్ళని వెంబడిస్తాడు. ఆ సమస్య నుంచి ఈ మూడు జంటలు తప్పించుకుని అడవిలోకి వెళ్ళారా? వెళ్ళాక అక్కడ వారికి ఎదురైన సమస్యలేంటి? వీరిని వెంబడిస్తున్న అభినవ్ సర్దార్ ఎవరు? ఆ వ్యక్తికి ఈ మూడు జంటలకు సంబంధం ఏంటి ? అనేదే మిగతా సినిమా కథ.[4]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఎ.ఎస్‌.పి.మీడియా హౌస్‌
  • నిర్మాత: అభినవ్ స‌ర్దార్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భ‌ర‌త్ కొమ్మాల‌పాటి
  • సంగీతం: మ‌ణి జెన్నా
  • సినిమాటోగ్రఫీ: హ‌రి జాస్తి
  • ఎడిట‌ర్‌: విజ‌య్ ముక్తావ‌ర‌పు
  • మాటలు: శిరీషా మంద‌
  • ఆర్ట్‌: ర‌వి కుమార్‌
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నిధి

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (26 June 2023). "'మిస్టేక్' మూవీ అఫీషియల్ ట్రైలర్". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  2. Eenadu (31 July 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  3. Andhra Jyothy (31 July 2023). "క‌థ‌పై న‌మ్మ‌కంతో 'మిస్టేక్' చేశారంటోన్న ప్రియదర్శి". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  4. Sakshi (4 August 2023). "'మిస్టేక్‌' మూవీ రివ్యూ". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మిస్టేక్&oldid=3954470" నుండి వెలికితీశారు