మీర్ మొహతేషం అలీ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీర్ మొహతేషం అలీ ఖాన్
జననం
జాతీయతభారతదేశం భారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మిస్టర్ వరల్డ్ 2007

మీర్ మొహతేషం అలీ ఖాన్, హైదరాబాదుకు చెందిన ప్రొఫెషనల్ బాడీబిల్డర్. జాతీయ, అంతర్జాతీయ బిరుదులను సంపాదించాడు. హెవీవెయిట్ (90+కిలొగ్రామ్) విభాగంలో మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో అతను సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.

తొలి జీవితం[మార్చు]

అలీఖాన్ తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరంలో మీర్ అబుల్ మణి ఖాన్, అఫ్సారా బేగం దంపతులకు జన్మించాడు.[1] ఇండో-బ్రిటిష్ అకాడమీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసే ముందు మొహతేషమ్ అలియా హైస్కూల్, షాదన్ కాలేజీలో చదువుకున్నాడు. స్పోర్ట్స్ కోటా కింద దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ (ఐబిబిఎఫ్)చే అతి పిన్న వయసున్న కోచ్ గా నియమించబడ్డాడు. లాస్ వెగాస్ 2010 మస్క్లేమానియా పోటీలో వివిధ విభాగాలలో నాలుగు పతకాలు సాధించాడు.[2]

బాడీబిల్డింగ్ కెరీర్[మార్చు]

ఇతడు 1994లో 14 సంవత్సరాల వయసులో బాడీబిల్డింగ్ ప్రారంభించాడు. 2008లో జరిగిన మస్కిల్‌మేనియా వరల్డ్ టూర్ పోటీలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.[3][4] అమెరికాలోని మజిల్‌మేనియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. డోప్ పరీక్ష తరువాత అతనికి సిల్వర్ మెడల్ లభించింది.

  • మిస్టర్ వరల్డ్ (సిల్వర్ మెడలిస్ట్) 2008
  • ఇండియన్ బాడీ బిల్డింగ్ కెప్టెన్ (2008, 2009)
  • మిస్టర్ యూనివర్స్ VI వ స్థానం
  • మిస్టర్ ఇండియా (2 టైమ్స్)
  • మిస్టర్ సౌత్ ఇండియా (3 టైమ్స్)
  • మిస్టర్ సౌత్ సెంట్రల్ రైల్వే (8 టైమ్స్)
  • మిస్టర్ ఆంధ్రప్రదేశ్ (9 టైమ్స్)
  • మిస్టర్ హైదరాబాద్ (11 టైమ్స్)

మస్క్లేమానియా ఛాంపియన్‌షిప్ 2010లో పాల్గొన్న 14 మంది సభ్యుల భారత జట్టుకు కెప్టెన్ కూడా వ్యవహరించాడు.[5][6] కెప్టెన్‌గా ఎంపికైన తెలంగాణకు చెందిన మొట్టమొదటి బాడీ బిల్డర్ ఇతడు.[5]

శిక్షణ[మార్చు]

ఆహారం[మార్చు]

రోజువారీ ఆహారంలో 30 గుడ్ల తెల్లసొన, 1 కేజీ చికెన్ బ్రెస్ట్స్, 12 నారింజ, 200 గ్రాముల గ్రీన్ సలాడ్, 1 కప్పు స్వీట్ కార్న్, 150 గ్రాముల వోట్మీల్, 2 నుండి 4 చపాతీలు తీసుకుంటాడు.

రోజువారీ వ్యాయామం[మార్చు]

రోజువారీ దినచర్యను రెండు సెషన్లుగా విభజించుకున్నాడు. ఉదయం (5-10) సెషన్ కండరపుష్టి, ట్రైసెప్స్, మెడ, ఉదరం వంటి చిన్న కండరాల కోసం, సాయంత్రం (5 గం) సెషన్ ఛాతీ, భుజం, తొడ, వెనుక వైపు వ్యాయామం చేస్తాడు.

కీలక గణాంకాలు[మార్చు]

  • ఎత్తు 6' 2"
  • బరువు 98 కిలొగ్రామ్

మూలాలు[మార్చు]

  1. "Youth brings glory to city". The Hindu. 2008-11-24. Archived from the original on 2008-12-16. Retrieved 18 July 2021.
  2. "Indian Musclemania winner charms Jeddah". www.saudigazette.com.sa. 2011-05-09. Archived from the original on 15 September 2012. Retrieved 18 July 2021.
  3. "indian mir mohtesham ali khan won bronze musclemania world bodybuilding". Articles.etalkindia.com. 2008-11-30. Retrieved 18 July 2021.
  4. "Body builder from city dazzles at Musclemania". The Times of India. 2008-11-24. Archived from the original on 2012-09-05. Retrieved 18 July 2021.
  5. 5.0 5.1 "Hyderabad body builder to lead India at Mr World competition from today". twocircles.net. 2008-11-21. Retrieved 18 July 2021.
  6. "Hyderabad bodybuilder to lead India". www.rediff.com. 2008-11-21. Retrieved 18 July 2021.