Jump to content

మీసం

వికీపీడియా నుండి
(మీసాలు నుండి దారిమార్పు చెందింది)

మూతి మీద మొలిచే వెంట్రుకలను మీసాలు (Moustache) అంటారు. పురుషులకు మీసాలు ప్రత్యేకమైన పురుషత్వాన్ని ఇస్తాయి. బొద్దింక, రొయ్య మూతి మీది రెండు పెద్ద వెంట్రుకలను కూడా మీసాలు అంటారు. కొన్ని దేశాల పోలీసు శాఖలలో మీసాలు పెంచడానికి ప్రోత్సాహ రుసుము కూడా ఇస్తారు. మీసాలు చాలా రకాలుగ ఉంచుతారు - సన్న మీసాలు, పెద్ద మీసాలు, పొట్టి మీసాలు (చార్లీ చాప్లిన్ మీసాలు), పొడుగు మీసాలు (చైనీస్ మీసాలు). పూర్వం మన దేశంలో మీసాలు బాగా వృద్ధి చెందేందుకు సంపెంగ నూనె పట్టించేవారు. దానికనె 'తినడానికి తిండి లేదు కాని మీసాలకు సంపెంగనూనె' అనె నానుడి ఉంది. మీసాల మీద నిమ్మకాయ లను నిలబెట్టే పోటీలో కూడా జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాలలో మీసాలను పౌరుషానికి ప్రతీకగా భావిస్తారు. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో ఇలా భావిస్తారు కానీ ఉత్తర భారతదేశంలో పురుషులు మీసాలను పెంచడానికి ఇష్టపడరు. హార్మోనుల లోపంవలన కొందరికి యుక్తవయస్సు వచ్చినా మీసాలు మొలవవు. అలాగే కొందరు స్త్రీలకు కూడా హార్మోనుల లోపము వలన మీసాలు వస్తాయి.

దృశ్యమాలిక

[మార్చు]

వివిధ రకాల మీసకట్టు

"https://te.wikipedia.org/w/index.php?title=మీసం&oldid=3948225" నుండి వెలికితీశారు