Jump to content

బైబిలు మిషను

వికీపీడియా నుండి
(ముంగమూరి దేవదాసు నుండి దారిమార్పు చెందింది)


సుప్రసిద్ధ క్రైస్తవ మత ప్రబోధకులు ముంగమూరి దేవదాసు అయ్యగారు గుంటూరు జిల్లాలోని కాకాని అను గ్రామంలో స్థాపించిన ఒక తెలుగు క్రైస్తవ సంఘమే బైబిలు మిషను.

పరిచయం

[మార్చు]

బైబిలు మిషను ఆవిర్భావం గురించి కొన్ని మతాభిప్రాయములున్నవి. ముంగమూరి దేవదాసు అయ్యగారికి ది.వి 1938 జనవరి 31 సంవత్సరంలో ఏసు క్రీస్తు బైబిలు మిషనును బంగారపు అక్షరాలతో గాలిలో చూపించి, మునుపెన్నడూ లేని నూతన దైవ సన్నిధిని ప్రపంచానికి అందించమని ఆజ్ఞాపించారని, అందువలన దేవుడు తెలుగు ప్రజలకు దైవ సంబంధమైన నూతన సంస్కృతి, ఆధ్యాత్మిక అనుభవము, సహవాసాన్ని బైబిలు మిషను ద్వారా పరిచయం చేసారని క్రైస్తవమత ప్రబోధకులు చెబుతారు.

దేవదాసు అయ్యగారు దైవ జ్ఞానానికి, బైబిలు సారాంశం అంతటికి సరిపడు కీర్తనలు, పద్యాలు, భజనలు, అనేక మర్మములు గల దైవ సాహిత్యాన్ని తెలుగులో రచనలు చేసారు. ఆయన హిందూ దేశ ప్రతిభను, కళలను బ్రిటిష్, ఆమెరికన్ క్రిష్టియన్లకు, మిషనరీలకు, ప్రజలకు మన స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత చాటి చెప్పారు. అంతేగాక భూలోకమంతటికి నిజమైన దైవ సందేశం అందించడానికి హిందూదేశము ప్రదానము అని, ఎక్కడా లేని దైవ భక్తి, ఆధ్యాత్మిక ఛింతన ఈ దేశంలోనే అని ఆనాటి విదేశీయులకు తన రచనల ద్వారాను, ముఖాముఖి ఛర్చల ద్వారా తెలియజేసారు. బైబిలు మిషను, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంగీత విలువలతో కర్ణాటిక, హిందూస్తానీ, కాపి రాగ తాళాలతో, పద్యాలు అందరికి సులువుగా అర్ధమయ్యే చందస్సుతో రచించారు.

ముంగమూరి దేవదాసు అయ్యగారు 1840 లో తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలం జేగురుపాడు గ్రామంలో జన్మించారు. 120 సంవత్సరములు జీవించి, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆధ్యాత్మిక భావాలతో దైవ, మనుష్య మన్ననలను అందుకొన్నారు. ఈయన తన జీవితకాలములో సిరిని ముట్టలేదు, పరిశుద్ధ బ్రహ్మచారిగా, యోగిగా, ఋషిగానే యుండి దేవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షముగా చూడడమే కాక, తన అనుచరులకు రాజమండ్రికి చేరువలో గోకవరం మండలానికి చెందిన సూదికొండ మీద ఆ ప్రత్యక్షతను చూపించారు.

హిమాలయాలలోని కైలాస మహర్షి, సాధు సుందర్ సింగ్ లాంటి భక్తులతో ఆత్మీయంగా సంభాషించేవారు. ఈయన గుంటూరులోని, పెదకాకానిలో దైవ జ్ఞానము, సంపూర్ణ స్వస్థత, పరలోక అనుభవములతో తన పరిచర్యను కొనసాగించారు.

హిందూదేశ ప్రత్యక్షత

[మార్చు]

భూలోకమంతటికి సువార్త అందించడములో భారతదేశం ప్రధానమని దేవదాసు అయ్యగారు చెప్పారు. ఇతర దేశ సొమ్ము ఈ దేశ ఆధ్యాత్మికతకు అవసరం లేదు. సర్వేజన సుఖినోభవంతు, ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలుసుకొనండి అని బోధించిన బైబిలు మిషనును ప్రపంచానికి చూపినపుడు, అందరికి సంపూర్ణ జీవితం లభిస్తుంది.

బైబిలు మిషను రచనలు

[మార్చు]
  1. బైబిలు మిషను కీర్తనలు
  2. సైతాను నెదురించు సూత్రములు
  3. దైవ లక్షణముల స్తుతి
  4. రాకడ ప్రార్థనలు స్తుతులు
  5. సమర్పణ ప్రార్థన
  6. ప్రార్థన మెట్లు
  7. మిత్ర
  8. ఉపవాస ప్రార్థన దీక్ష
  9. ఉపవాస ప్రార్థన ప్రకరణము
  10. రక్షణ పద్యములు
  11. సన్నిది సంపద
  12. రాకడ ధ్వని
  13. దేవుడు ఎందుకు ఊరుకొనుచున్నడు!
  14. విమలాత్మ ప్రోక్షణము
  15. మహిమ వార్తావళి
  16. వాగ్దాన మంజరి
  17. సువిశేష ధోరణి
  18. రక్షణ సంకల్పన దండకము
  19. ఇమ్మానుయేలు
  20. (నీతి సూర్యుని కళలద్దు) దైవసాన్నిధ్యము
  21. దైవిక స్వస్థత
  22. మనస్సాక్షి
  23. ద్వితీయాగమనము
  24. సంఘారాధనలు
  25. నిరపాయ పత్రిక
  26. క్రిస్మస్ సందేశములు
  27. ప్రభువు సంస్కారపు విందు వర్తమానములు
  28. ప్రకటన గ్రంథ వివరము 22 అద్యాయములు
  29. పరమ గీతార్థము (వచన వివరణ)
  30. రాకడ రవళి
  31. అభయాని
  32. ద్వితీయాగమన సందేశములు
  33. రక్షణ వాణి
  34. రక్షణ వార్తావళి
  35. ప్రార్థన మంజరి
  36. క్రైస్తవ పండుగల సందేశమాల
  37. శ్రమకాలపు గుడారము
  38. ఆత్మీయ స్వస్థత
  39. ప్రార్థనావళి
  40. సిలువ విలువ - ధ్యాన కలువ
  41. మోషే సుఖోపవాస ధ్యానదీపిక
  42. విఖ్యాత వనితలు
  43. రక్షణ సునాదము
  44. సన్నిధి వన్నె
  45. సన్నిధి క్రమావళి
  46. పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాసము
  47. ప్రకటన గ్రంథ అధ్యాయములు
  48. ప్రకటన గ్రంథ ముఖ్యాంశములు
  49. సన్నిధి సంపధ
  50. జ్ఞాతవ్యము 1
  51. జ్ఞాతవ్యము 2
  52. జ్ఞాతవ్యము 3
  53. జ్ఞాతవ్యము 4
  54. దేవదాసు అయ్యగారి జీవిత చరిత్ర
  55. బైబిలు మిషను
  56. సన్నిధి వర్తమానములు
  57. యేసు గాలి తుఫానుననుచుట (బుర్రకథ)

బైబిలు మిషను ఆరాధనా క్రమం

[మార్చు]

బైబిలు మిషను ఆరాధనా క్రమం ఇతర క్రైస్తవ మిషనరీకు భిన్నంగా ఉంటుంది. స్తుతి పాటలు, విశ్వాస ప్రమాణములు, పాట, వాక్యం, పాట, దశమ భాగములు, ప్రతిష్ఠార్పణలు, కానుకలు, ముగింపు ప్రార్థన (ఇంకావుంది)

పండుగలు

[మార్చు]
  • జనవరి 31 - బైబిలు మిషను ఆవిర్భావ దినం,
  • ఫిబ్రవరి 9 - దేవదాసు అయ్యగారి సంస్మరణ దినము,
  • ఫిబ్రవరి 18 - భస్మ బుధవారము. ఇతర పండుగలు - మట్టలాదివారము, ఈస్టరు పండుగ, ఆరోహణ పండుగ, పెంతెకొస్తు పండుగ, మోషే సుఖోపవాస ప్రారంభదినము, తైలాభిషేక పండుగ, మతోద్దారణ పండుగ, సర్వపరిశుద్ధల పండుగ.

బైబిలు మిషను సంఘములు

[మార్చు]
  • బైబిలు మిషను నెల్లూరు - రెవ.డా.పమ్మి యెషయా డి.డి, సెల్: 9949413596  ``` వెబ్సైటు: www.adbuthkumarpammi.com
  • బైబిలు మిషను వద్దిపర్రు,
  • బైబిలు మిషను మహిమ స్వస్థి శాల
  • బైబిల్ మిషను, రావులపాలెం, కోనసీమ.....రెవ డా నోవ ఎన్నార్డి.....9866941489

ఇతర ఇంటెర్నెట్ వెబ్ సైట్స్

[మార్చు]