Jump to content

వితంతువు

వికీపీడియా నుండి
(ముండమోపి నుండి దారిమార్పు చెందింది)

హిందూ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీని వితంతువు (Widow) అంటారు. వీరిని వ్యవహారంలో ముండమోపి , విధవ అని కూడా వ్యవహరిస్తారు. గతంలో వీరు సమాజంలో అనేక అవమానాలను ఎదుర్కొనేవారు. ఇప్పటికీ అక్కడక్కడా వీరికి ఇలాంటి అనుభవాలు ఎదురు అవుతూనే ఉంటాయి. కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహనరాయ్ వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రస్తుతము వీరు గౌరవ ప్రథమైన జీవితమును గడుపుతున్నారు.

వితంతు కుమార్తె ,విడాకులు పొందిన కూతురూ కుటుంబ పింఛనుకు అర్హులే

[మార్చు]

పింఛను పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయనపై ఆధారపడిన వితంతు, విడాకులు పొందిన కుమార్తె కుటుంబ పింఛను పొందవచ్చు. ఈ విషయంలో ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.గతంలో ఉద్యోగి బతికి ఉండగానే కూతురు వితంతువై లేదా విడాకులు పొంది ఉంటేనే పింఛను అందేది. 25 ఏళ్ల వయోపరిమితి వరకే వర్తింపజేయాలనే నిబంధన ఉండేది. తాజా ఉత్తర్వుల ప్రకారం వితంతు, విడాకులు పొందిన కూతురు మళ్లీ వివాహం చేసుకున్నా, మరణించినా ,ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి లేదా స్వయంఉపాధి ద్వారా నెలకు రూ.2440 పొందుతున్నా పింఛను ఆగిపోతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=వితంతువు&oldid=4379211" నుండి వెలికితీశారు