Jump to content

ముల్లు గర్ర

వికీపీడియా నుండి
ముల్లు గర్ర
ముల్లు గర్ర

ముల్లు గర్ర (లేదా ములుగర్ర) అనేది వ్యవసాయ పనులలో రైతులు ఎద్దులను అదిలించడానికి, నియంత్రించడానికి ఉపయోగించే ఒక సంప్రదాయ వ్యవసాయ పరికరం. ఇది సాధారణంగా సన్నని వెదురు కర్రతో తయారు చేయబడుతుంది. కర్ర చివర చిన్న ఇనుప ముల్లు లేదా సూది ఆకారపు భాగాన్ని అమర్చుతారు. దీనిని ప్రధానంగా ఎడ్లబండిని నడిపేటప్పుడు లేదా పొలాన్ని దున్నే సమయంలో ఎద్దులను నియంత్రించడానికి ఉపయోగిస్తారు.

నిర్మాణం

[మార్చు]

ముల్లు గర్ర సాధారణంగా వెదురు లేదా ఇతర తేలికైన కానీ బలమైన కర్రతో తయారు చేయబడుతుంది. కర్ర యొక్క ఒక చివరలో చిన్న ఇనుప ముల్లు లేదా సూది వంటి భాగాన్ని బిగిస్తారు. కొన్నిచోట్ల కర్రపై అలంకార ఆకృతులు లేదా గీతలు చెక్కడం కూడా కనిపిస్తుంది.

ఉపయోగం

[మార్చు]

ఎడ్లబండిని నడిపేటప్పుడు లేదా వ్యవసాయ పనుల్లో ఎద్దులను నడిపించేటప్పుడు రైతులు ముల్లు గర్రను ఉపయోగిస్తారు. ఎద్దులు నెమ్మదిగా నడిచినప్పుడు లేదా దిశ మార్చవలసిన అవసరం వచ్చినప్పుడు వాటిని స్వల్పంగా అదిలించి వేగం లేదా దిశను నియంత్రించడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది.

ప్రాముఖ్యత

[మార్చు]

ముల్లు గర్ర తెలుగు గ్రామీణ వ్యవసాయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పరికరంగా పరిగణించబడుతుంది. ట్రాక్టర్లు, యాంత్రిక పరికరాలు విస్తృతంగా వినియోగంలోకి రాకముందు, ఎద్దులతో సాగు చేసే రైతుల చేతిలో ఇది సాధారణంగా కనిపించే పరికరం. వ్యవసాయ సంప్రదాయాలకు, గ్రామీణ జీవన విధానానికి ఇది ఒక ప్రతీకగా నిలిచింది.

సాంస్కృతిక ప్రాముఖ్యత

[మార్చు]

రోజులు మారాయి (1955) సినిమాలోని ఒక పాటల్ ఈ పదాన్ని ఉపయోగించారు.[1]

నవ ధ్యానాలను గంపకెత్తుకొని
చద్ది అన్నము మూట గట్టుకొని
ముళ్లు గర్రను చేతబట్టుకొని
ఇల్లాలునీ వెంటబెట్టుకొని

చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Alla, Meghasri (2018-04-10). "ఏరువాక సాగారో – కొసరాజు రాఘవయ్య". Telugu Song Lyrics (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-06-04.