ముస్లిం తెగలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముస్లిముల్లో తెగలు[మార్చు]

  • దైవ ప్రవక్త ఇలా అన్నారు "యూదులు, క్రైస్తవులు డెబ్బైఒకటి లేదా డెబ్బై రెండు తెగలుగా చీలిపోయారు.నా అనుచరవర్గం డెబ్బై మూడు తెగలుగా చీలిపోతారు.అబూ దావూద్ :2181)
  • దైవ ప్రవక్త ఇలా అన్నారు "ఇశ్రాయేలు ప్రజలపై ఏఏ చెడులు వచ్చిపడ్డాయో అవన్నీ నాప్రజలకు కూడా దాపురిస్తాయి.అవి ఎలాంటి చెడులంటే వారిలో ఎవడైనా తన తల్లితో వ్యభిచరిస్తే నా అనుచరవర్గంలోని వాడుకూడా అలాగే చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు డెబ్బై రెండు తెగలుగా చీలిపోతే నా ప్రజలు డెబ్బై మూడు తెగలుగా చీలిపోతారు.ఒక్క తెగ తప్ప వాళ్ళంతా నరకాగ్నిలో ఉంటారు.అది ఏ తెగ అని సహచరులు దైవ ప్రవక్తను అడుగుతారు.అది నేనూ నా సహచరులకు చెందింది అంటారు ప్రవక్త. (తిర్మిజి:56)
  • మనలో కొందరు నీతిమంతులున్నారు, కొందరు అవినీతిపరులూ ఉన్నారు.మనలో వివిధ మార్గాలను అనుసరించే తెగలూ ఉన్నారు. (కురాన్ 72:11)


  • 1.జరూదియా : అబుల్ జరూద్ అనుచరులు. మహాప్రవక్త, అలీని అతని గుణగణాలనుబట్టే ఇమాంగా నియమించాడుగాని అతని పేరునుబట్టికాదు.
  • 2.సులేమానియా/జరీరియా : సులేమాన్ ఇబ్నె జరీరుల్ జైదీ అనుచరులు. ఇమాం పదవి ఇద్దరు ఉత్తమ ముస్లిములచేత సమావేశంలో నిర్ణయించబడుతుంది.
  • 3.బుత్రియా/హురారియా : ఉస్మాన్ ఖిలాఫత్ ను విభేదించరు. ఆయన్ని విమర్శించరూ, పొగడరు.
  • 4.యాకూబియా : అబూబక్ర్, ఉమర్ ల ఖిలాఫత్ ను అంగీకరిస్తారు. అయితే వీరి పాలనను తిరస్కరించేవారిని తిరస్కరించరు. ముస్లిములుగా ఉండి పెద్ద పాపాలు చేసేవారు నరకాగ్నిలో నిరంతరం ఉంటారు.
  • 5.హనఫియా : ముహమ్మద్ ఇబ్నె హనీఫా ఇమామత్ అనుచరులు. అల్లాహ్ కు ఒక ఆరంభం ఉండి ఉంటుంది.
  • 6.కరీబియా : ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె హనీఫా చనిపోలేదు. అదౄశ్యరూపంలో ఉన్నాడు. అతనే రాబోయే మెహది.
  • 7.కమిలియా : అబూకామిల్ అనుచరులు. సహచరులు వారసులై ఉండాలి. అలీని విమర్శిస్తారు. పునరుత్థాన దినానికి ముందే మృతులు లేచి వస్తారు. షైతాన్ మట్టికి బదులు అగ్నిని కోరుకోవటం మంచి పనే.
  • 8.ముహమ్మదియా/ముగారియా : ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లా ఇబ్నె హసన్ అనుచరులు. ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లా చనిపోలేదు. అదృశ్యంగా ఉన్నాడు. అతనే రాబోయే మెహది.
  • 9.బాకిరియా : ముహమ్మద్ ఇబ్నె అలీ బాఖర్ అదృశ్య ఇమామ్. రాబోయే మెహది.
  • 10.నదిసియా : పరులకంటే తమను గొప్పవారిగా ఎంచుకునే వారు కాఫిర్లు, అవిశ్వాసులు.
  • 11.షాయియా : అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడని పఠించినవాడు ఏం చేసినా శిక్షించబడడు.
  • 12.అమ్మాలియా : విశ్వాసం అంటే ఆచరణే.
  • 13.ఇస్మాయీలియా : ఇస్మాయిల్ ఇబ్నె జాఫర్ వంశస్తులకే ఇమామత్ ఉండాలి.
  • 14.ముసాలియా/మమ్‌తురా : ముసా ఇబ్నె జాఫర్ అదృశ్య ఇమామ్ రాబోయే మెహది.
  • 15.ముబారికియా : ముహమ్మద్ ఇస్మాయిల్ ఇబ్నె జాఫర్ వంశస్తులకే ఇమామత్ ఉండాలి.
  • 16.కతియా/ఇత్న్ అషారియా (పన్నెండు వాదులు) : అలీ ఇబ్న్ అబీ తాలిబ్ వంశస్తుల్లో 12 వ ఇమామే మెహది.
  • 17.హషామియా/తరకిబియా : అల్లాహ్ కు దేహం ఉంది. ప్రవక్త అల్లాహ్ కు అవిధేయుడు అయ్యాడు.
  • 18.జరారియా : తనకంటూ జీవాన్నీ, కొన్ని గుణగణాలను ఏర్పాటు చేసుకునే దాకా అల్లా జీవించి లేడు. ఆయనకు ఏ గుణాలూ లేవు.
  • 19.యౌనాసియా : అల్లాహ్ తన సింహాసనాన్ని మోసే వాళ్ళకంటే బలాఢ్యుడే.
  • 20.షైతానియా/షిరీకియా : అల్లాహ్ సేవకుల చర్యలు పదార్థాలు. అల్లాహ్ సేవకుడు పదార్థాన్ని పుట్టించగలడు.
  • 21.అజ్రకియా : కలలు, దర్శనాలు వట్టివే. భవిష్యవాణిని ప్రకటించే అన్ని పద్థతులూ అంతరించాయి.
  • 22.నజాదత్ : సారాయి త్రాగిన వాడిని శిక్షించకూడదు. ఈ తెగవాళ్ళలోని పాపులు నరకాగ్నిలో శుద్థి చేయబడరు. వేరొక చోట శిక్ష పొందే స్వర్గంలో ప్రవేశిస్తారు
  • 23.సుఫ్రియా : వాస్తవానికి పాపులంటే బహు దేవతారాధకులే.
  • 24.అజారిదా : యుక్తవయసు వచ్చాకే పిల్లల్ని ఇస్లామ్ లోకి పిలవాలి. యజమాని చనిపోయిన తరువాత మాత్రమే యుద్ధంలో దోచుకోబడిన సంపద ధర్మబద్థం అవుతుంది.
  • 25.కాజిమియా : అల్లా అన్ని మతాలవారినీ ప్రేమిస్తాడు ఒకడు తన జీవితంలో అత్యధిక భాగం అవిశ్వాసిగా ఉన్నా సరే.
  • 26.షువైబియా/హుజ్జతియా : అల్లాహ్ అనుకున్నదే జరుగుతుంది. ఒక పని జరగలేదంటే అల్లాహ్ అనుకోలేదన్నమాట.
  • 27.కలాఫియా : ఇమామ్ నాయకత్వం లేకుండా యుద్ధం చేయకూడదు.
  • 28.మాలూమియా/మజ్ హూలియా : అల్లాహ్ పేర్లన్నిటితో ఆయన్ని గుర్తించని వారికి ఆయనగురించి ఏమీ తెలియదు. వారు అవిశ్వాసులు.
  • 29.సల్తియా : పెద్దల్ని మాత్రమే మార్చాలి. తండ్రి విశ్వాసి అయినా యుక్త వయసు వచ్చే వరకు అతని పిల్లలు అవిశ్వాసులే.
  • 30.హంజియా : బహుదేవతారాధకుల పిల్లలు నరకానికి వెళతారు
  • 31.తాలిబియా : పిల్లలు మేము సత్యాన్నుండి తొలగిపోతున్నాము అని చెప్పేవరకు, వారు ఏ వయస్సులో ఉన్నా, వారికి తల్లిదండ్రులే సంరక్షకులు.
  • 32.మాబాదియా : బానిసలకు దానాలివ్వటం, పుచ్చుకోవటం ఒప్పుకోరు.
  • 33.అక్నాసియా : ప్రత్యర్థి స్వయంగా తెలిస్తే తప్ప, అదీ ఆత్మ రక్షణ కోసం తప్ప యుద్ధం చేయకూడదు.
  • 34.షైబానియా/మష్బియా : అల్లాహ్ తన సృష్టితాలనే పోలి ఉంటాడు.
  • 35.రషీదియా : ఊటలు, కాలువలు, నదుల ద్వారా నీటి సరఫరా ఉన్న భూములకు జకాత్ లో సగం కట్టాలి. వర్షం ద్వారా మాత్రమే నీరు పొందే భూములకు పూర్తి జకాత్ చెల్లించాలి.
  • 36.ముకర్రమియా/తెహ్మియా : అజ్ఞానమే అవిశ్వాసం. అల్లాహ్ స్నేహంగాని, విరోధంగానీ మనిషి చనిపోయే క్షణంలో ఉన్న నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది.
  • 37.ఇబాదియా/అషాలియా : అల్లాహ్ ను సంతోషపరచాలనే తలంపు లేకుండానే మంచి పనులు చెయ్యాలి.
  • 38.హఫ్సియా : అల్లాహ్ ను తెలుసుకుంటేనే బహుదేవతారాధన నుండి మనిషి బయట పడతాడు.
  • 39.హరితియా : పనులకు ముందు సామర్ధ్యం ఉంటుంది.
  • 40.అషాబ్ తాహ్ : తానొక ప్రవక్తనని ఋజువుపరుచుకోటానికి ఎటువంటి గుర్తు లేకుండా కూడా అల్లాహ్ ఒక ప్రవక్తను పంపిస్తాడు.
  • 41.షబీబియా/సలీహియా : గజాలా అనే స్త్రీ ఇమామత్ ను నమ్ముతారు.
  • 42.వసీలియా : పెద్ద పాపాలు చేసిన వారు నరకాగ్నిలో మాడుతారు కానీ విశ్వాసులుగానే ఉంటారు.
  • 43.అమ్రియా : ఒంటెల యుద్ధంలో ఇరుపక్షాలసాక్ష్యాన్ని తిరస్కరించాలి.
  • 44.హుదాలియా/ఫనియా : అల్లాహ్ సర్వశక్తుడు కాని రోజున స్వర్గం, నరకం రెండూ అంతరిస్తాయి. విధివ్రాత కూడా ఆగిపోతుంది.
  • 45.నజ్జామియా : కురాన్ గ్రంథానికి అద్భుతాలు చేసే శక్తి లేదు. ముహమ్మద్ ప్రవక్త చంద్రుణ్ణి చీల్చడం లాంటి అధ్భుతాలను నమ్మకూడదు.
  • 46.మువమ్మియా : అల్లాహ్ జనన మరణాలను సృష్టించలేదు. అది జీవదేహంలో ప్రకృతి సిద్దమైన చర్య.
  • 47.బషీరియా : అల్లా ఒక మనిషి పాపాలను క్షమించి అతని మనసు మార్చవచ్చు. అతను మళ్ళీ అవిధేయుడైతే శిక్షించవచ్చు.
  • 48.హిషామియా : ముస్లిం సమాజం ఒక వ్యక్తిని ఇమామ్‌గా ఎన్నుకొంటే, కొంతమంది తిరగబడి ఆ ఇమామ్‌ను చంపేస్తే, అటువంటి తిరుగుబాటు కాలంలో ఎవర్నీ ఇమామ్ గా ఎంపిక చేయకూడదు.
  • 49.ముర్దారియా : సుల్తాన్‌కు అంటిపెట్టుకుని ఉండటం వల్ల అవిశ్వాసులౌతారు.
  • 50.జాఫ్రియా : ముడి ద్రాక్షారసం త్రాగటం శిక్షార్హం కాదు. నరక శిక్ష మానసికమైనది.
  • 51.ఇస్కఫియా : అల్లాహ్ పిల్లల్ని, పిచ్చివాళ్ళనీ అదుపులో ఉంచగలడు గానీ, పరిపూర్ణజ్ఞానంగల వారిని కాదు.
  • 52.తమామియా : అల్లాహ్ తనను తాను తెలుపుకున్న వాడికే తెలుస్తాడు. మిగతా వాళ్ళంతా జంతువుల్లాగా బాధ్యులుకారు.
  • 53.జాహిజియా : అల్లా ఒక వస్తువును సృష్టించగలడుగానీ నశింపచేయలేడు.
  • 54.షాహమియా/ సిఫాతియా : అన్నీ ఇద్దరిచేత ముందుగానే నిర్ణయించబడ్డాయి. ఒకరు సృష్టికర్త, మరొకరు స్వీకర్త.
  • 55.కయాతియా/మక్లూకియా : ఉనికిలో లేనిదంతా అది కనబడక ముందున్న రూపమే. మనిషి పుట్టక ముందు ఉనికిలో లేని అదృశ్యదేహం అతనికి ఉన్నట్లే, ప్రతి లక్షణం దృశ్యరూపంలోకి వచ్చే పర్యంతం దానికి అదృశ్య ఉనికి ఉంటుంది.
  • 56.కాబియా : అల్లా తననుగానీ, ఇతరుల్ని గానీ చూడడు.
  • 57.జుబ్బాయా : తన భక్తుల కోరిక తీర్చేటప్పుడు అల్లా వారికి విధేయుడౌతాడు.
  • 58.బాషామియా : ఒక చెడ్డపని చెయ్యాలనుకన్నవాడు దాన్ని చెయ్యకపోయినా, ఆ తలంపును బట్టి శిక్షించబడతాడు.
  • 59.ఇబ్రియా : ముహమ్మదు ఒక జ్ఞాని. ప్రవక్త కాదు.
  • 60.ముహ్ కామియా : సృష్టితాల మీద దేవునికి అదుపు లేదు.
  • 61.కబరియ్యా : సమాధిలో శిక్షలుండవు.
  • 62.హుజ్జతియా : చేష్టల ఫలితంగా శిక్షరాదు. ఎందుకంటే అన్ని చేష్టలూ అల్లా నిర్ణయాలే గనుక వాటికెవరూ బాధ్యులు కారు.
  • 63.ఫిక్రియా : అల్లాను ధ్యానించటం ఆరాధించటంకంటే ఉత్తమం.
  • 64.అలివియా/అజారియా : హజ్రత్ అలీ, ముహమ్మదు గారితో కలిసి ప్రవక్త పదవి పంచుకున్నారు.
  • 65.తనాసికియా : ఆత్మ పునర్జన్మ ఎత్తుతుంది.
  • 66.రజీయా : హజ్రత్ అలీ ఇబ్నె అబీ తాలిబ్ మళ్ళీ ఈ లోకానికి వస్తారు.
  • 67.అహదియా :విశ్వాసంలో ఫరజ్ (తప్పనిసరి) పనులు చాలు. సున్నత్ (ఐచ్చ్చికం) అక్కరలేదు.
  • 68.రదీదియా : ఈ లోకం శాశ్వతంగా ఉంటుంది.
  • 69.సత్ బిరియా : పశ్చాత్తాపం అంగీకరించబడదు.
  • 70.లఫ్ జియా : ఖురాన్ దేవుని వాక్యం కాదు. దాని అర్ధం, సారాంశం మాత్రమే దేవుని వాక్యం. ఖురాన్ లోని మాటలు కేవలం వ్యాఖ్యాత మాటలే.
  • 71.అషారియా : ఊహించటం తప్పు. అది అవిశ్వాసానికి సూచన.
  • 72.బదాయియా : అమీర్ ఏం చెప్పినా చెయ్యాల్సిందే.

ఈతెగల విశ్వాసాలు ఖురాన్ ప్రవచనాలకు విరుద్ధం అంటారు ముస్లిం మేధావులు.