మూఢనమ్మకాలు-దురాచారాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్ల పిల్లి

మన దేశంలో ఎన్నో మూఢనమ్మకాలు -దురాచారాలు న్నాయి. ఆడపిల్లలకు పది సంవత్సరాల వయసు దాటకుండానే బాల్య వివాహాలు చేసేవారు. పెళ్ళికాకముందే రజస్వల అయితే ఆ పిల్ల తల్లితండ్రులకు నరకంలో రజస్వల రక్తాన్ని త్రాగిస్తారట. మూఢనమ్మకంతోటే దురాచారం పుట్టుకొస్తుంది. హేతుబద్దమైన మంచినమ్మకాల వల్ల సదాచారాలూ పుడతాయి. సతీసహగమనం, బాణామతి, అంటరానితనం...ఇవన్నీ మూఢనమ్మకాల వల్ల పుట్టిన దురాచారాలే. అక్కడక్కడా ఈనాటికీ కనబడుతున్నకొన్ని మూఢనమ్మకాలు-దురాచారాలు :

  1. గొడ్రాలు, విధవరాలు, మాచకమ్మ ఎదురు కావడం అశుభం.
  2. రోలు, గడప మీద తుమ్మకూడదు, వాటిమీద కూర్చోకూడదు.
  3. తల్లి దండ్రులు చనిపోయిన సంవత్సరంలోపే యుక్తవయసుపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలి, లేదా మూడేళ్ళు అగాలి.
  4. భార్య చనిపోయిన వ్యక్తి సంవత్సరంలోపే పెళ్ళిచేసుకోవాలి. లేదా మూడేళ్ళు అగాలి.
  5. కుడికాలుపెట్టి ఇంట్లోకి రావాలి.
  6. విధవరాళ్ళు పూలు, బొట్టు, మెట్టెలు, నగలు పెట్టుకోకూడదు.
  7. నల్ల పిల్లి ఎదురుకాకూదదు.
  8. బయలుదేరిన వాళ్ళను ఎక్కడికెళుతున్నారని అడుగకూడదు, తుమ్మకూడదు.
  9. కాకి అరిచినా, దువ్వెన జారవిడిచినా చుట్టాలొస్తారు.
  10. కత్తిరించిన గోళ్ళను తొక్కినవాడు శత్రువవుతాడు.
  11. కలలో పెళ్ళైతే మిత్రులమరణం, కలలో చావొస్తే పెళ్ళి జరుగుతాయి.
  12. ధ్వజస్థంభం నీడ ఇళ్ళమీద పడకూడదు.
  13. పెళ్ళికాని వారు చనిపోతే ముందు జిల్లేడు చెట్టుతో పెళ్ళి చేశాకే అంత్యక్రియలు చేయాలి
  14. గర్బిణీ చనిపోతే చెట్టుకు వేళాడదీయాలి కానీ సమాధి చేయకూడదు
  15. అన్నం తినేటప్పుడు తుమ్మితే చేయి కడుక్కుని మళ్ళీ తినాలి.
  16. ఎవరైనా పని మీద బయటికి  వెళ్ళేటప్పుడు తుమ్మితే కాసేపు ఆగి మంచినీళ్లు తాగి వెళ్ళాలి.
  17. తలగడ మీద కూర్చోకూడదు.
  18. అరచేయి దురద పెడితే ధనలాభం.
  19. అరికాలు దురద పెడితే ప్రయాణం.
  20. బల్లి మీద పడితే అశుభం