Jump to content

మూలా నారాయణస్వామి

వికీపీడియా నుండి
(మూలా నారాయణ స్వామి నుండి దారిమార్పు చెందింది)
మూలా నారాయణస్వామి
మూలా నారాయణస్వామి

మూలా నారాయణస్వామి ప్రముఖ సినిమా నిర్మాత. వీరు సినీ నిర్మాణ సంస్థ వాహినీ పిక్చర్స్లో ప్రధాన భాగస్వామి. ఆసియాలో కెల్లా అతి పెద్దదైన వాహినీ స్టుడియో సముదాయాన్ని 1940 దశాబ్దంలో నిర్మించారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామం. వీరి తండ్రి గారి కల్లు వ్యాపారాన్ని చిన్నతనంలోనే ధనవంతులై తర్వాత కాలంలో రాయలసీమ టెక్స్ టైల్స్, నూనె మిల్లులు, పాల సరఫరా కేంద్రాలు మొదలైనవి స్థాపించి వ్యాపారల్ని విస్తరించారు.

నారాయణస్వామి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి అన్నయ్య) తో కలిసి ఉమ్మడి వ్యాపారం చేసి రంగూన్ కి ఉల్లిపాయలు ఎగుమతి చేసేవారు. తర్వాత ఇద్దరూ హెచ్.ఎం.రెడ్డి గారి రోహిణీ పిక్చర్స్లో భాగస్వాములుగా చేసి గృహలక్ష్మి వంటి కొన్ని సినిమాలు నిర్మించారు. విభేదాల మూలంగా విడిపోయి స్నేహితులిద్దరూ వారి స్వంత నిర్మాణ సంస్థ 'వాహినీ పిక్చర్స్' స్థాపించారు. దీనిలో ముఖ్యమైన వాటా నారాయణస్వామిదే. ఈ సంస్థ ద్వారా వందేమాతరం, సుమంగళి, దేవత స్వర్గసీమ వంటి మంచి సినిమాలు నిర్మించారు. స్వర్గసీమ నిర్మాణం సమయంలో మద్రాసు న్యూటోన్ స్టుడియోలో వారు ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చి స్వంతంగా స్టుడియో నిర్మాణం చేపట్టారు.