Jump to content

మూల్యం నిర్ధారించని జాతులు

వికీపీడియా నుండి

మూల్యాంకనం చేయబడని (NE) జాతి అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం (IUCN) నిర్వహించే IUCN రెడ్ లిస్ట్‌లో ఇప్పటివరకు మూల్యాంకనం చేయబడని జాతిగా వర్గీకరించబడిన జీవజాతి.[1][2] IUCN డేటాబేస్‌లో నమోదు కాని, ఎటువంటి వర్గీకరణ పొందని జాతులను కూడా "మూల్యాంకనం చేయబడని" (NE) జాతులుగానే పరిగణిస్తారు.[3]

వివరణ

[మార్చు]

ఈ పరిరక్షణ వర్గం IUCN జాతుల అంతరించిపోవు ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే తొమ్మిది వర్గాలలో ఒకటి. ఈ వర్గాలు ఒక చివరలో అంతరించిపోయినవి (EX) నుండి మరొక చివరలో తక్కువ ఆందోళన (LC) వరకు విస్తరించాయి. అయితే సమాచారం తక్కువ (DD), మూల్యాంకనం చేయబడని (NE) వర్గాలు ఈ ప్రమాద స్థాయిల శ్రేణిలో భాగం కావు, ఎందుకంటే వాటికి సరిపడిన సమీక్ష జరగలేదు.[4]

"మూల్యాంకనం చేయబడని" వర్గం ఒక జాతి అంతరించిపోవు ప్రమాదంలో లేదని సూచించదు. ఆ జాతి గురించి తగిన అధ్యయనం జరగకపోవడం వల్ల దాని ప్రమాద స్థాయిని నిర్ధారించలేకపోయామని మాత్రమే అర్థం. IUCN ప్రకారం, "మూల్యాంకనం చేయబడని" జాతులను ప్రమాదం లేని జాతులుగా పరిగణించకూడదు. వాటి స్థితి నిర్ణయించబడే వరకు, ప్రమాదంలో ఉన్న జాతుల మాదిరిగానే వాటిపైనా శ్రద్ధ చూపడం సముచితం.[4]: 7 [5]: 76 

2015 నాటికి IUCN ప్రపంచవ్యాప్తంగా 76,000 కంటే ఎక్కువ జాతులను పరిశీలించి వాటికి పరిరక్షణ హోదాలు కేటాయించింది. వీటిలో సుమారు 24,000 జాతులు వివిధ స్థాయిలలో ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఉన్నవిగా గుర్తించబడ్డాయి. అయితే భూమిపై ఉన్న మొత్తం జీవజాతుల సంఖ్యపై అంచనాలు సుమారు 30 లక్షల నుండి 3 కోట్ల వరకు మారుతూ ఉండటంతో, IUCN యొక్క "మూల్యాంకనం చేయబడని" (NE) వర్గం తొమ్మిది వర్గాలలోనే అత్యంత పెద్ద వర్గంగా నిలుస్తుంది.[6]

ఇతర వినియోగాలు

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా IUCN నిర్వహించే మూల్యాంకన, వర్గీకరణ విధానం తరువాత దేశస్థాయి, కొన్ని సందర్భాల్లో ప్రాంతీయ స్థాయిలలో కూడా పరిరక్షణ ముప్పులను అంచనా వేయడానికి, అలాగే ఆయా ప్రాంతాలకు ప్రత్యేకమైన రెడ్ డేటా జాబితాలను రూపొందించడానికి ఆధారంగా ఉపయోగించబడింది.[7][8][9][10][11][12]

మూలాలు

[మార్చు]
  1. "About the IUCN Red List". Archived from the original on 2014-09-21. Retrieved 2016-02-19.
  2. Walker, Timothy (2013). Plant Conservation: Why It Matters and How It Works. Timber Press. p. 80. ISBN 9781604692600. Archived from the original on 9 February 2023. Retrieved 24 July 2018.
  3. "Frequently Asked Questions". IUCN Red List of Threatened Species (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2024. Retrieved 6 May 2024. If a species is not on the website, it is treated as Not Evaluated.
  4. 4.0 4.1 IUCN Red List Categories and Criteria: Version 3.1 (PDF) (2nd ed.). Gland, Switzerland and Cambridge, UK. 2012. ISBN 978-2-8317-1435-6. Archived (PDF) from the original on 2018-12-24. Retrieved 2018-07-24.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  5. "Guidelines for Using the IUCN Red List Categories and Criteria. Version 13" (PDF). IUCN Standards and Petitions Subcommittee. 2017. Archived from the original (PDF) on 23 April 2018. Retrieved 24 July 2018.
  6. "Wildlife Conservation Resource" (PDF). Marwell Zoo. Archived from the original (PDF) on 24 July 2018. Retrieved 23 July 2018.
  7. MILLER, REBECCA M.; RODRÍGUEZ, JON PAUL; ANISKOWICZ-FOWLER, THERESA; BAMBARADENIYA, CHANNA; BOLES, RUBEN; EATON, MARK A.; GÄRDENFORS, ULF; KELLER, VERENA; MOLUR, SANJAY (June 2007). "National Threatened Species Listing Based on IUCN Criteria and Regional Guidelines: Current Status and Future Perspectives". Conservation Biology. 21 (3): 684–696. Bibcode:2007ConBi..21..684M. doi:10.1111/j.1523-1739.2007.00656.x. ISSN 0888-8892. PMID 17531047. S2CID 27086108.
  8. "Threatened Species Programme | SANBI Red List of South African Plants". redlist.sanbi.org (in ఇంగ్లీష్). Archived from the original on 2017-08-02. Retrieved 2018-07-24.
  9. Government, Northern Territory (2017-07-24). "Classification of wildlife". nt.gov.au (in ఇంగ్లీష్). Archived from the original on 2018-07-24. Retrieved 2018-07-24.
  10. "The National Red List 2012 of Sri Lanka Conservation Status of the Fauna and Flora" (PDF). Ministry of Environment, Colombo, Sri Lanka. 2012. Archived (PDF) from the original on 13 July 2018. Retrieved 24 July 2018.
  11. Hilton-Taylor, C. (1997). "Red Data List of southern African plants. 2. Corrections and additions". Bothalia. 27 (2): 205. doi:10.4102/abc.v27i2.681. Archived from the original on 2018-07-24. Retrieved 2018-07-24.
  12. W., Duckworth, J.; G., Batters; L., Belant, J.; L., Bennett, E.; J., Brunner; J., Burton; S., Challender, D. W.; V., Cowling; N., Duplaix (2012-08-23). "Why South-east Asia should be the world's priority for averting imminent species extinctions, and a call to join a developing cross-institutional programme to tackle this urgent issue". S.A.P.I.EN.S. 5 (2). ISSN 1993-3800. Archived from the original on 2018-07-24. Retrieved 2018-07-24.{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)