Jump to content

వైద్య ఉష్ణమాపకం

వికీపీడియా నుండి
(మెడికల్ థర్మామీటర్ నుండి దారిమార్పు చెందింది)
38.7 °C ఉష్ణోగ్రత చూపిస్తున్న వైద్య ఉష్ణమాని

వైద్య ఉష్ణమాపకంను మానవ శరీర ఉష్ణోగ్రత కొలవడానికి ఉపయోగిస్తారు. వైద్య ఉష్ణమానిని ఆంగ్లంలో మెడికల్ థర్మామీటర్ లేదా క్లినికల్ థర్మామీటర్ అంటారు. ఈ థర్మామీటర్ కొనను నోటి లోపల నాలుక కింద సంచుల వంటి ఖాళీలలోని ఒక ఖాళీనందు లేదా చంక క్రింద లేదా పాయువు ద్వారా పురీషనాళంలో కొంత సేపు ఉంచడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు.

వైద్య ఉష్ణమాపకం ద్వారా మానవ ఉష్ణోగ్రతను కొలవటం వలన మానవుల జ్వర స్థాయిని కచ్చితంగా తెలుసుకోగలుగుతున్నారు. వైద్య ఉష్ణమాపకాన్ని వాడడం, శుభ్రపరచడం చాలా తేలిక అంతేకాక అందుబాటు ధరలలో లభిస్తున్నాయి. ఆరోగ్య జీవనానికి అవసరమైన వైద్య సాధనాలలో ప్రతి ఇంటిలో కచ్చితంగా ఉంచుకోవలసిన చౌకైన, ఉత్తమమైన వైద్య పరికరం ఇది. సాధారణంగా చేతిని పట్టుకోవడం ద్వారా, లేదా పొట్ట వద్ద, లేదా నుదుటి వద్ద చేత్తో తాకటం ద్వారా జ్వర స్థాయిని అంచనా వేస్తుంటారు, కానీ ఈ పద్ధతిలో జ్వరం స్థాయి కచ్చితంగా ఇంత ఉందని చెప్పటం కష్టం.

ఉపయోగించే విధానం

[మార్చు]

మానవుని ఉష్ణోగ్రతను తెలుసుకునేందుకు సాధారణంగా, ఎక్కువగా పాదరసంతో ఉన్న వైద్య ఉష్ణమాపకాలను ఉపయోగిస్తుంటారు. పాదరస ఉష్ణమాపకాన్ని ఉపయోగించే ముందు పాదరసం ఉన్న బల్బు కొనను కిందకు ఉంచి పై భాగాన్ని చేతితో పట్టుకొని నెమ్మదిగా కొన్నిసార్లు కిందికి విదిలించినట్లయితే పాదరసం బల్బులోనికి దిగుతుంది. అప్పుడు నోరును తెరవమని నాలుకను పైకెత్తమని నోటిలో నాలుక కింద పాదరసంతో ఉన్న బల్బు కొనను ఉంచాలి. మెడికల్ థర్మామీటర్ పై ఎక్కువ ఒత్తిడి కలగకుండా నోటిని నెమ్మదిగా మూయమని చెప్పాలి. ఎందుకంటే దంతాలకు నొక్కుకొని వైద్య ఉష్ణమాపకం ఎక్కువ ఒత్తిడికి గురై పగిలిపోవచ్చు, కావున కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. కచ్చితమైన ఫలితాల కోసం వైద్య ఉష్ణమాపకాన్ని పెదవులను మూసి నోటిలోపల కనీసం 3 నిమిషాలు ఉంచాలి. ఈ సమయంలో నోరు తెరవకూడదు, ఊపిరిని ముక్కుతో మాత్రమే తీసుకోవాలి. థర్మామీటరును నోటి నుంచి బయటికి తీసిన తరువాత ఉష్ణోగ్రత ఎంత ఉందో చూసుకొని చల్లని సబ్బునీటితో శుభ్రపరచుకోవాలి.

ఎలక్ట్రానిక్ వైద్య ఉష్ణమాపకం

[మార్చు]
ఎలక్ట్రానిక్ వైద్య ఉష్ణమాపకం

మొదటి ఎలక్ట్రానిక్ వైద్య ఉష్ణమాపకమును 1954లో కనుగొన్నారు[1].

మూలాలు

[మార్చు]
  1. "Takes Temperature in Seconds." Popular Mechanics, November 1954, p. 123.