మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్
మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్ సాధారణంగా పెద్ద సంస్థలు ఉన్నత స్థాయి డేటా ప్రాసెసింగ్ చేయడానికి వాడే పెద్ద కంప్యూటర్లు. ఉదాహరణకు జనగణన, పారిశ్రామిక వినియోగదారుల గణాంకాలు, వాణిజ్య వనరుల ప్రణాళిక (Enterprise Resource Planning - ERP), పెద్ద ఎత్తున లావాదేవీల నిర్వహణలో మెయిన్‌ఫ్రేం కంప్యూటర్లను ఎక్కువగా వాడతారు. మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్ పెద్దదే కానీ సూపర్ కంప్యూటరంత పెద్దది కాదు. ఇది మిని కంప్యూటర్లు, సర్వర్లు, వర్క్‌స్టేషన్లు, వ్యక్తిగత కంప్యూటర్ల కంటే ఎక్కువ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉన్నత స్థాయి కంప్యూటర్ నిర్మాణాలు 1960వ దశకంలోనే వచ్చాయి. కాలం గడిచేకొద్దీ వాటిలోనూ మార్పులు వస్తూ ఉన్నాయి. మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్లను తరచుగా సర్వర్లుగా వాడుతుంటారు. మొదటి తరం కంప్యూటర్లలో మెయిన్ ఫ్రేం అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమరీని కలిగి ఉండే ఒక డబ్బా.[1][2][3] దాని పేరు మీదుగానే వీటికి మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్ అని పేరు వచ్చింది. తర్వాతి కాలంలో హై ఎండ్ వాణిజ్య కంప్యూటర్లను వాటి కంతే తక్కువ ఖరీదైన కంప్యూటర్ల నుండి వేరు చేయడానికి ఈ పేరును వాడుతూ ఉన్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Edwin D. Reilly (2004). Concise Encyclopedia of Computer Science (illustrated ed.). John Wiley & Sons. p. 482. ISBN 978-0-470-09095-4. Extract of page 482
- ↑ "mainframe, n". Oxford English Dictionary (on-line ed.). Archived from the original on August 7, 2021.
- ↑ Ebbers, Mike; Kettner, John; O’Brien, Wayne; Ogden, Bill (March 2011). Introduction to the New Mainframe: z/OS Basics (PDF) (Third ed.). IBM. p. 11. Retrieved March 30, 2023.
- ↑ Beach, Thomas E. (August 29, 2016). "Types of Computers". Computer Concepts and Terminology. Los Alamos: University of New Mexico. Archived from the original on August 3, 2020. Retrieved October 2, 2020.