Jump to content

మెలిస్సా రాజు థామస్

వికీపీడియా నుండి
మెలిస్సా రాజు థామస్
విద్యనేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్
వృత్తి
  • నటి
  • స్క్రీన్ రైటర్
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మూథోన్
ఎత్తు5 అ. 7 అం. (170 cమీ.)

మెలిస్సా రాజు థామస్ ఒక భారతీయ నటి, స్క్రీన్ రైటర్, మోడల్. ఆమె గీతూ మోహన్‌దాస్ ద్విభాషా చిత్రం మూథోన్ (2019)లో చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

13 సంవత్సరాల వయస్సులో, మెలిస్సా కేరళలో టాలెంట్ హంట్ రియాలిటీ పోటీ ద్వారా స్కౌట్ చేయబడింది. ఆ సమయంలో, ఆమె 8వ తరగతి మాత్రమే చదువుతోంది. ప్రముఖ మలయాళ టీవీ ఛానెల్ ఆసియానెట్‌లో వివిధ కార్యక్రమాలకు ఆమె వీజెగా చేసింది. ఆ తరువాత, ఆమె మలయాళం షో "వల్కన్నడి" ప్రసిద్ధ వీజె అయ్యింది. అయితే, ఆమె తన చదువుపై దృష్టి పెట్టడానికి అని టెలివిజన్ రంగం నుండి కొంత కాలం విరామం తీసుకుంది.

మెలిస్సా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఈ) X క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో 97.33% శాతం మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆమె మెరిడియన్ జూనియర్ కాలేజీలో జీసిఇ ఎ లెవెల్స్‌లో చదవడానికి సింగపూర్‌లోని విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ఎస్ఐఎ యూత్ స్కాలర్‌షిప్‌ను పొందింది. ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తన 16వ యేట సింగపూర్‌కు వెళ్లింది.[1][2]

2012లో, మెలిస్సా నేవీ క్వీన్ 2012 అందాల పోటీ విజేతగా నిలిచింది.[3] పోటీలో గెలిచిన తర్వాత, ఆమె సింగపూర్ నేషనల్ యూనివర్శిటీలో అండర్ గ్రాడ్యుయేట్ చదువును పూర్తి చేయడానికి తిరిగి సింగపూర్ వెళ్ళింది. నిష్ణాతులైన విద్వాంసురాలు, ఆమె 2011-12 అకడమిక్ ఇయర్‌లో అలాగే 2012-13 అకడమిక్ ఇయర్‌లో డీన్స్ హానర్ రోల్‌లో నిలిచింది.[4]

కెరీర్

[మార్చు]

2016 నుండి 2018 వరకు, మెలిస్సా "మెర్సిడెస్ బెంజ్", "కల్యాణ్ జ్యువెలర్స్", "మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్" వంటి ప్రముఖ బ్రాండ్‌ల కోసం టెలివిజన్ కమర్షియల్స్‌తో సహా పలు ప్రింట్, టెలివిజన్ ప్రకటనలలో నటించింది.

జనవరి 2019లో, మెలిస్సా మంచి ఆదరణ పొందిన షార్ట్ ఫిల్మ్ ఫేడెడ్‌ (Faded)కు కథ రాసి, అందులో నటించింది.[5]

2019లో, ఆమె గీతూ మోహన్‌దాస్ ద్విభాషా చిత్రం మూథోన్ (2019)లో తొలిసారిగా నటించింది[6], ఇది అంతర్జాతీయంగా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్[7], భారతదేశంలోని ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2019లో ప్రదర్శించబడింది.[8] లక్షద్వీప్‌కు చెందిన పల్లెటూరి అమ్మాయి అమీనా పాత్రలో ఆమె ఛాలెంజింగ్ పాత్రను పోషించింది, ఆమె ముంబైకి చేరుకుని పరివర్తన చెందుతుంది.[9]

ఇది గీతూ మోహన్‌దాస్ కి రెండవ చలన చిత్రం, కాగా మూథోన్ సన్డాన్స్ ఫిల్మ్ ల్యాబ్ ద్వారా మార్గనిర్దేశం చేయబడింది. అది మామి 2019 లో ప్రారంభ చిత్రంగా నిలిచింది.[10] అంతేకాకుండా ఈ చిత్రం..

  • 2020- కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో 18వ వార్షిక ఇఫ్లాకు ఎంపికయ్యింది.[11]
  • లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, బర్మింగ్ హామ్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లలో ప్రదర్శితమైంది.
  • స్వీడన్ లో జరిగిన 43వ గోటెబోర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020లో ప్రదర్శితమైంది.[12]
  • 2020-24వ ఎడిషన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ - ఐఎఫ్ఎఫ్కే

ఇక మూథోన్ ను వరించిన పురస్కారాల విషయానికి వస్తే..

  • 2020- ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ బాలనటుడిగా ఎన్వైఐఎఫ్ఎఫ్లో మూడు అవార్డులు వరించాయి[13][14]
  • శశాంక్ అరోరాకు ఉత్తమ సహాయ నటుడిగా, సంజనా దీపుకు ఉత్తమ బాలనటిగా, గీతు మోహన్ దాస్ కు ఉత్తమ స్క్రీన్ ప్లేగా ఎన్ వైఐఎఫ్ ఎఫ్ లో ఎన్నియ్యారు.
  • ఆడియన్స్ ఛాయిస్ అవార్డ్, రోషన్ మాథ్యూకు ఉత్తమ సహాయ నటుడిగా ఇండో - జర్మన్ ఫిల్మ్ వీక్ 2020 అవార్డులు వచ్చాయి.[15]
  • ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ బాలనటుడు 2020 అవార్డులకు గాను 4 నామినేషన్లు సంపాందించింది.
  • 2020- పారిస్లో జరిగిన ప్రతిష్టాత్మక ఫెస్టివల్ డు ఫిల్మ్ డి'అసి డు సుడ్ - ఎఫ్ఎఫ్ఎఎస్టిలో ఉత్తమ చిత్రం, జ్యూరీ బహుమతిని గెలుచుకుంది[16]

2020లో, ఆమె బిజోయ్ నంబియార్ చిత్రం తైష్‌(Taish)లో ఆసక్తికరమైన ప్రత్యేక పాత్ర పోషించింది.[17]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2019 మూథోన్ అమీనా [18]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర ప్లాట్ ఫామ్ నోట్స్
2020 తైష్‌ సిమ్మి జీ5 [19]

మూలాలు

[మార్చు]
  1. "Home".
  2. Anand, Shilpa Nair (15 November 2019). "When Melissa became Amina in 'Moothon'". The Hindu.
  3. "Navy Ball at Kochi | Indian Navy".
  4. "NUS Dean's List".
  5. "Faded Review: A Poignant short film exploring modern love". 22 January 2019. Archived from the original on 25 జనవరి 2022. Retrieved 21 మార్చి 2024.
  6. "Melissa Raju Thomas to debut with Nivin Pauly in Moothon | Malayalam Movie News - Times of India". The Times of India. Archived from the original on 13 September 2019. Retrieved 11 September 2019.
  7. Nagarajan, Saraswathy (14 August 2019). "Geetu Mohandas' 'Moothon' will premiere at Toronto International Film Festival - The Hindu". The Hindu.
  8. "Geetu Mohandas' action thriller 'Moothon' to open MAMI Mumbai film festival 2019 - Times of India". The Times of India.
  9. Anand, Shilpa Nair (15 November 2019). "When Melissa became Amina in 'Moothon'". The Hindu.
  10. "'This Is The Bronze Age Of Malayalam Cinema. I Won't Call It The Golden Age. We Are Not There Yet': Geetu Mohandas". Silverscreen.in. 18 September 2019. Retrieved 18 September 2019.
  11. "18th Annual Indian Film Festival of Los Angeles". 21 February 2020.
  12. "Geetu Mohandas-directed 'Moothon' wins Best Film at film festival in Paris". 4 February 2020.
  13. "Moothon Wins Awards for Best Film, Best Actor and Best Child Artist in New York Indian Film Festival - Zee5 News". 5 August 2020.
  14. "Moothon wins three awards at Cincinnati Indian Film Festival 2020". The Times of India.
  15. "'Moothon' Wins Two Awards at Indo-German Film Week in Berlin". 3 October 2020.
  16. Mathews, Anna. "Moothon wins at FFAST, Paris". The Times of India.
  17. "Bejoy Nambiar's 'Taish' To Premiere On ZEE5 In October". News18. Archived from the original on 11 October 2020. Retrieved 28 September 2020.
  18. Anand, Shilpa Nair (15 November 2019). "Melissa Raju Thomas in her debut feature film-Moothoon". The Hindu.
  19. "Melissa Raju Thomas plays an important part in Bejoy nambiar's Taish". 7 November 2019.