మేడిచర్ల ఆంజనేయమూర్తి
స్వరూపం
మేడిచర్ల ఆంజనేయమూర్తి ప్రముఖ బాలకేసరి పత్రికా నిర్వాహకులు.
వీరు గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామంలో 1922 అక్టోబరు 10 తేదీన జన్మించారు నాగేశ్వరశాస్త్రి, వెంకట సుబ్బమ్మ వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలోను, తెనాలిలోను విద్యాభ్యాసం చేసి; మొదటినుండి బాలసాహిత్యం మీద ఆసక్తి చూపేవారు. వీరు 1939లో బాలకేసరి అనే మాస పత్రికను తెనాలి నుండి నిర్వహించారు. ఇది తెలుగులో మొదటి బాలల పత్రిక. వీరు బాలలకోసం సుమారు 400 కథలు, గేయాలు రచించారు. బాలలు ప్రదర్శించడానికి నాటికలు రాశారు.
వీరు చాలాకాలం సంస్కృత ఉపాధ్యాయులుగా పనిచేశారు. జాయప సేనాని సంస్కృతంలో రాసిన నృత్య రత్నావళి గ్రంథాన్ని తెనిగించారు. వాత్సాయన కామసూత్రాలను తెలుగు వచనంలో రాశారు. యస్కాచార్యుల భాష్యాన్ని తెలుగున రాశారు. తెలుగు - సంస్కృత నిఘంటువును రూపొందించారు.