మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రజా పరిషత్
స్వరూపం
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రజా పరిషత్ 2016 అక్టోబరు 11న నూతన జిల్లాల పునర్య్వస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 42 ఎంపీటీసీ, నాలుగు ఎంపీపీ, నాలుగు జెడ్పీటీసీ స్థానాలతో 2019లో తొలిసారి జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు జరిగాయి.[1]
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీ) నాలుగు మండలాలకు మాత్రమే పరిమితమైంది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగతా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. దీంతో మేడ్చల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, 61 గ్రామ పంచాయతీలు, 42 ఎంపీటీసీ స్థానాలతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రజాపరిషత్ (జెడ్పీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేడ్చల్ జెడ్పీ చైర్మన్ స్థానాన్ని జనరల్ కేటగిరికి రిజర్ చేశారు.
ప్రజాప్రతినిధులు
[మార్చు]- మలిపెద్ది శరత్‌చంద్రా రెడ్డి - మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా పరిషత్ చైర్మన్
- సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి - జడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్
జెడ్పీటీసీ స్థానాలు
[మార్చు]- శామీర్‌పేట్ (ఎస్సీ మహిళ)
- కీసర (బీసీ జనరల్)
- ఘట్‌కేసర్ (అన్ రిజర్వుడ్)
- మేడ్చల్ (జనరల్ మహిళ)
ఎంపీపీ స్థానాలు
[మార్చు]- శామీర్‌పేట్ (ఎస్సీ జనరల్)
- కీసర (బీసీ జనరల్)
- ఘట్‌కేసర్ (ఆన్ రిజర్వుడ్)
- మేడ్చల్ (జనరల్ మహిళ)
ఎంపీటీసీ స్థానాలు
[మార్చు]- శామీర్‌పేట్ - 15 స్థానాలు
- కీసర - 8 స్థానాలు
- ఘట్‌కేసర్ - 9 స్థానాలు
- మేడ్చల్ - 10 స్థానాలు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (15 April 2019). "'స్థానిక' సమరానికి సన్నద్ధం". Archived from the original on 28 జనవరి 2022. Retrieved 28 January 2022.