మైక్ స్టాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైక్ స్టాన్
జననం
అల్తాఫ్ షేక్

(1999-08-30) 1999 ఆగస్టు 30 (వయసు 24)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఅల్తాఫ్ తడవి
వృత్తి
  • రాపర్
  • గాయకుడు
  • సంగీత స్వరకర్త
క్రియాశీల సంవత్సరాలు2018 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హిందీ బిగ్ బాస్ - సీజన్ 16

మైక్ స్టాన్ (ఆంగ్లం: MC Stan; 1999 ఆగస్టు 30) భారతీయ రాపర్. అతని అసలు పేరు అల్తాఫ్ షేక్. అతను కలర్స్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ 16లో పాల్గొన్నందుకు బాగా ప్రసిద్ది చెందాడు. పైగా హోస్ట్ సల్మాన్ ఖాన్ 2023 ఫిబ్రవరి 12న మైక్ స్టాన్ ని విజేతగా ప్రకటించాడు.[1]

బాల్యం[మార్చు]

అల్తాఫ్ షేక్ మహారాష్ట్రలోని పూణేలో 1999 ఆగస్టు 30న ముస్లిం కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి పోలీసు, తల్లి గృహిణి.

హిందీ బిగ్ బాస్ 16[మార్చు]

ఇది హిందీ భాషలో భారతీయ రియాలిటీ టీవీ సిరీస్ బిగ్ బాస్ పదహారవ సీజన్. ఇది 2022 అక్టోబరు 1 నుండి కలర్స్ టీవీలో ప్రసారం చేయబడింది. బాలీవుడ్ సోషల్ మీడియా, టీవీ, యూట్యూబ్, సినిమా సెలబ్రిటీలు ఈ బిగ్‌బాస్ లో పాల్గొన్నారు. సల్మాన్ ఖాన్ పదమూడవ సారి ఈ షోను హోస్ట్ చేసారు. కాగా గ్రాండ్ ఫినాలే 2023 ఫిబ్రవరి 12న ప్రసారం చేయబడింది. ఇందులో రాపర్ మైక్ స్టాన్ గెలుపొందగా, శివ థాకరే మొదటి రన్నరప్ గా, ప్రియాంక చాహర్ రెండవ రన్నరప్ గా నిలిచింది.

విన్నర్ కి బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు 31 లక్షల 80 వేల రూపాయలు, కొత్త కారుని నిర్వాహకులు ప్రకటించారు.

మూలాలు[మార్చు]

  1. "MC Stan : హిందీ బిగ్ బాస్ 16 విన్నర్ ఇతనే.. భారీ ప్రైజ్ మనీతో పాటు ఇంకేం గెలుచుకున్నారో తెలుసా? - 10TV Telugu". web.archive.org. 2023-02-14. Archived from the original on 2023-02-14. Retrieved 2023-02-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)