మైఖేల్ ఎస్. బ్రౌన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మైఖేల్ స్టువర్ట్ బ్రౌన్ (జననం  1941 ఏప్రిల్ 13) ఒక ప్రముఖ అమెరికన్ జన్యు శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత.ఈయన జోసఫ్ ఎల్. గోల్డ్ స్టెయిన్ అను మరియొక శాస్త్రవేత్తతో కలిసి క్రొవ్వు జీవక్రియను వివరించుట వలన జీవశాస్త్రంలో 1985 నోబెల్ బహుమతిని పొందారు.

 

ప్రారంభ, విద్య జీవితం

[మార్చు]

బ్రౌన్, బ్రూక్లిన్, న్యూయార్క్ లో జన్మించారు, ఈయన తల్లి ఎవిలిన్, ఒక గృహిని, తండ్రి హార్వే బ్రౌన్, ఒక వస్త్ర వ్యాపారి. బ్రౌన్ కెల్టెంహాం ఉన్నత పాఠశాలలో (వింకోట్, పిఎ) పట్టానూ, యూనివర్సిటీ ఆఫ్ పెంసిల్వెనియా నుండి పట్టాను 1962 లో, 1966 లో అదే యూనివర్సిటీ నుండి ఎం.డి పట్టాను వైద్య రంగంలో పొందారు.

వృత్తి, పరిశోధన

[మార్చు]

బ్రౌన్, ఆయన సహచరుడైన జోసఫ్ ఎల్. గోల్డ్ స్టెయిన్ డలాస్ లోని యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ హెల్త్ సైన్ సెంటర్ (ఇప్పుడు యూటీ సౌత్ వెస్ట్రెన్ మెడికల్ సెంటర్) కి వచ్చి క్రొవ్వుల జీవక్రియ పై పరిశోధన చేసి మానవ కణాల్లో, రక్తప్రవాహంలో నుండి క్రొవ్వు సారాలను తీసే  లో-డెంసిటీ లిపోప్రొటీన్ గ్రాహకాలు ఉన్నట్లు కనిపెట్టారు. ఈ గ్రాహకాల తగ్గుదలతో ఫ్యామీలియల్ హైపర్ కొలెస్ట్రోలీమియా వస్తుందని, దీని వలన క్రొవ్వు సంబంధిత వ్యాధులు కలుగుతాయనీ తెలిపి, ఈ రోగకారక మూలాలను, ప్రాథమిక కణ కారకమైన రిసెప్టార్-మీడియేటెడ్ యెండోసైటాసిస్ ను వివరించారు.

వీరు కనుగొనిన అంశాలతో స్టాటిన్ డ్రగ్స్ అభివృధికి తోడ్పడాయి.ఇవి 16 మిలియన్ల అమెరికంస్ క్రొవ్వును నియంత్రించే మందుగా వాడుకలో ఉన్నాయి., అమెరికా లోను ప్రపంచ వ్యాప్తంగా అనేకుల జీవన ప్రమాణాలను పెంచేందుకు కూడా దోహదం చేశాయి. ఈ మందును తీసుకోవటం బట్టి గుండెపోటు నియంత్రణ కూడా సాధ్యమౌతుంది. వీరి విజయాలతో, వీరి సహచర బృందంతో కూడా కలిసి ప్రోటీన్లుగా క్రొవ్వు మారే విధానాన్ని కాంసర్ వ్యాధిలోనిది వివరించారు. 1984లో లూయిసా గ్రోస్ హోర్విజ్ ప్రైజ్ ను  సమ్మేళనంలో సహచరుడు జోసఫ్ ఎల్.గోల్డ్ స్టెయిన్.

అవార్డులు , గౌరవాలు

[మార్చు]

బ్రౌన్ గారు అనేకమైన అవార్డులను, గౌరవాలను పొందారు అవి:

References

[మార్చు]