మైఖేల్ మ్యాడ్‌సెన్
మైఖేల్ మాడ్సెన్ | |
---|---|
జననం | చికాగో, ఇల్లినాయిస్, యు.ఎస్. | 1958 సెప్టెంబరు 25
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1982–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 5, క్రిస్టియన్ మాడ్సెన్ తో సహా |
తల్లిదండ్రులు |
|
బంధువులు | వర్జీనియా మ్యాడ్‌సన్ (సోదరి) |
మైఖేల్ మ్యాడ్‌సన్ (ఆంగ్లం: Michael Madsen; జననం 1958 సెప్టెంబరు 25) అమెరికన్ నటుడు.[1] క్వెంటిన్ టరాన్టినో రూపొందిచిన రిజర్వాయర్ డాగ్స్ (1992), కిల్ బిల్: వాల్యూమ్ 2 (2004), ది హేట్‌ఫుల్ ఎయిట్ (2015), వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ (2019) వంటి చిత్రాలలో నటించిన ఆయన ప్రసిద్ధి చెందాడు.
ది నేచురల్ (1984), ది డోర్స్ (1991), థెల్మా & లూయిస్ (1991), ఫ్రీ విల్లీ (1993), స్పీసీస్ (1995), డోనీ బ్రాస్కో (1997), డై అనదర్ డే (2002), సిన్ సిటీ (2005), స్కేరీ మూవీ 4 (2006) వంటి ఇతర చిత్రాలలో కూడా ఆయన నటించాడు. అలాగే, ఆయన గ్రాండ్ తెఫ్ట్ ఆటో III (2001), డిషనోర్డ్ సిరీస్ (2012–2017), కాల్ ఆఫ్ డ్యూటీ: మాబ్ ఆఫ్ ది డెడ్ (2013) వంటి వీడియో గేమ్‌లలో కూడా నటించాడు.
2021లో విడుదలైన క్రైమ్ థిల్లర్ సినిమా నిశ్శబ్దంలో ఆయన రిచర్డ్ డాకిన్స్ పాత్రలో నటించాడు. ఈ సినిమా తెలుగు, తమిళంలో నిర్మించి మలయాళం, కన్నడ భాషల్లోనూ దుబ్బింగ్ చేసి విడుదల చేశారు.[2]
ప్రారంభ జీవితం
[మార్చు]మైఖేల్ మ్యాడ్‌సన్ 1958 సెప్టెంబరు 25న ఇల్లినాయిస్‌లోని చికాగోలో జన్మించాడు. అతని తల్లి, ఎలైన్ (నీ మెల్సన్), చిత్రనిర్మాత, రచయిత్రి. అతని తండ్రి, కాల్విన్ క్రిస్టియన్ మ్యాడ్‌సన్, రెండవ ప్రపంచ యుద్ధంలో నేవీ అనుభవజ్ఞుడు, చికాగో అగ్నిమాపక శాఖలో అగ్నిమాపక ఉద్యోగి.[3] అయితే, ఆయన తల్లిదండ్రులు 1960లలో విడాకులు తీసుకున్నారు.
అతని తోబుట్టువులలో చెరిల్ మ్యాడ్‌సన్ వ్యవస్థాపకుడు, వర్జీనియా మ్యాడ్‌సన్ అకాడమీ అవార్డు నామినీ.[4] ఆయన తండ్రి తరఫు తాతలు డానిష్ కాగా, అతని తల్లి తరఫు వారు ఇంగ్లీష్, జర్మన్, ఐరిష్, స్థానిక అమెరికన్, స్కాటిష్ వంశానికి చెందినవారు.[5]
అవార్డులు
[మార్చు]- 2006లో రెడ్ హెన్ ప్రెస్‌చే ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.
- 2008లో, 9వ వార్షిక మాలిబు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆర్ట్ ఆఫ్ యాక్టింగ్‌లో సాధించిన విజయాలకు సత్కారం.[6]
- ఆయన రచించిన బర్నింగ్ ఇన్ ప్యారడైజ్ కవితా పుస్తకానికి ఇండిపెండెంట్ ఫైర్‌క్రాకర్ అవార్డు.[7]
- 2007 బెస్ట్ యాక్టర్ బోస్టన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫర్ స్ట్రెంత్ అండ్ హానర్
- 2008 బెస్ట్ యాక్టర్ న్యూ యార్క్ ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ ఫిల్మ్ & వీడియో ఫెస్టివల్ ఫర్ స్ట్రెంత్ అండ్ హానర్.
- హాలీవుడ్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ది హేట్‌ఫుల్ ఎయిట్ కు గానూ, ఆయనకు ఎన్‌సెంబుల్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.
మూలాలు
[మార్చు]- ↑ "Celebrity birthdays for the week of Sept. 19-24". AP News. The Associated Press. 2021-09-13. Retrieved 2023-06-18.
Actor Michael Madsen is 63.
- ↑ Dundoo, Sangeetha Devi (24 September 2020). "The making of 'Nishabdham'". The Hindu. Archived from the original on 29 September 2020. Retrieved 1 October 2020.
- ↑ Bell, Mark (February 23, 2007). "Method Fest to Present the 2007 Maverick Award to Michael Madsen". FilmThreat.com. Archived from the original on August 9, 2009. Retrieved May 31, 2007.
- ↑ Kennedy, Lisa (February 21, 2007). "A strong role, an equal partner". The Denver Post. Archived from the original on April 3, 2007. Retrieved May 31, 2007.
- ↑ Bray, Tony (April 2004). "Virginia Madsen". TV Now. Archived from the original on June 3, 2004. Retrieved May 31, 2007.
- ↑ "Malibu International Film Festival honors Michael Madsen". Malibu Times. Archived from the original on August 16, 2019. Retrieved August 16, 2019.
- ↑ Waldo, Thea (July 16, 2006). Celebrities and Their Culinary Creations: Autographed Photos, Biographies, Trivia, & Recipes. iUniverse. ISBN 978-0-595-39753-2 – via Google Books.