మైఖేల్ రోసెన్
స్వరూపం
పెన్ పింటర్ బహుమతిని 2023 సంవత్సరానికి గాను బ్రిటిష్ దేశానికి చెందిన బాలల సాహిత్య రచయిత, కవి మైఖేల్ రోసెన్ కు ప్రకటించారు[1]. పెన్ పింటర్ బహుమతిని సమాజంలోనూ, వ్యక్తులలోనూ అసలైన వాస్తవాలను వెలికి తీసే విధంగా మేదస్సుతో కూడిన రచనలు చేసే సాహితీవేత్తలకు ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు[2]. ఈ ప్రతిష్టాత్మక బహుమతిని ఇంగ్లీష్ రచయిత హెరాల్డ్ పింటర్ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది[3]. ఈ బహుమతిని ప్రధానం చేయడం 2009వ సంవత్సరం నుండి ప్రారంభించారు. ఈ బహుమతిని గతంలో హనిష్ ఖురేషి ( 2010 ) , సల్మాన్ రష్దీ ( 2014 ) , లెమ్ సీసే ( 2019 ) తదితరులకు ప్రకటించారు. ఈ బహుమతిని వర్తమాన ప్రపంచం గుర్తించిన వాస్తవాలను రచనల్లో ప్రతిబింబించే యునైటెడ్ కింగ్డమ్ ( యూకే ) , ఐర్లాండ్, ఇతర కామన్వెల్త్ దేశాల రచయితలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
మూలాలు :
- ↑ "Michael Rosen wins this year's PEN Pinter Prize: A glimpse into the work of the children's writer". The Indian Express (in ఇంగ్లీష్). 2023-06-29. Retrieved 2023-09-14.
- ↑ Creamer, Ella (2023-06-28). "Author Michael Rosen wins 2023 PEN Pinter prize for 'fearless' body of work". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2023-09-14.
- ↑ "Children's author Michael Rosen wins PEN Pinter Prize 2023 for his "fearless" works". The Times of India. 2023-06-28. ISSN 0971-8257. Retrieved 2023-09-14.