మైనేని హరిప్రసాద్ రావు
మైనేని హరిప్రసాదరావు | |
---|---|
దస్త్రం:Myneni Hari Prasad Rao.jpg | |
జననం | 1927 జూలై 21 కృష్ణా జిల్లా ఎడ్లలంక గ్రామం |
మరణం | 2016 ఏప్రిల్ 5 |
Notable work(s) | మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ నిర్మాణం |
మతం | హిందువు |
పిల్లలు | ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
మైనేని హరిప్రసాదరావు, (21 జూలై 1927 - 5 ఏప్రిల్ 2016).[1] అణు శక్తి పరిశోధకులు. న్యూక్లియర్ పవర్ బోర్డుకు డైరెక్టరుగా, మద్రాసు అణు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో క్రీయాశీలక వ్యక్తి. పద్మశ్రీ పురస్కార గ్రహీత
జననం,విద్య
[మార్చు]మైనేని హరిప్రసాద రావు కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలోని ఎడ్లలంక గ్రామంలో 1927 జూలై 21న జన్మించాడు.హరిప్రసాదరావు ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసాడు. 1957లో జూనియర్ రీసెర్చ్ అధికారిగా ఉద్యోగంలో చేరి, అంచెలంచెలుగా పైకివచ్చాడు. అణు శక్తి రంగంలో అనేక వ్యాసాలు, పరిశోధనా పత్రాలను రచించాడు.
భారతదేశంలోని ముంబైలోని DAE కి చెందిన అణు విద్యుత్ బోర్డు (ప్రస్తుతం ఎన్‌పిసిఎల్ అని పిలుస్తారు) నిర్వాహాక డైరెక్టర్ గా మూడు సంవత్సరాలు పనిచేసాడు.
దక్షిణ, పశ్చిమ ఉత్తర భారత ప్రాంతీయ విద్యుత్ బోర్డులలో సభ్యుడిగా చాలా సంవత్సరాలు పనిచేశాడు.
మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ (MAPS) నిర్మాణాన్ని పర్యవేక్షించి దానిని సాకారం చేసిన వ్యక్తి[2]. ఈ కేంద్రానికి తొలి డైరెక్టర్ గా పనిచేసాడు.మద్రాసు అటామిక్ పవర్ స్టేషన్ కి వీరిని "ది ఫాదర్" లేదా "ఆర్కిటెక్ట్" అని ప్రశంసించారు.[3] [4]
అవార్డులు
[మార్చు]- 1984 లో సైన్స్ అండ్ టెక్నాలజీ లొ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు
- 1983 లో చేసిన కృషికి గుర్తింపుగా సంజయ్ గాంధీ అవార్డు.
సామాజిక సేవ
[మార్చు]హరిప్రసాద రావు ఎంకె ట్రస్ట్ ద్వారా, అవనిగడ్డ, ఎడ్లలంక, మైనేనివారిపాలెం, చల్లపల్లి, రిపాల్లే గుడివాడలలో ఉచిత హోమియోపతి క్లినిక్లను నిర్వహించారు. వరద సహాయక చర్యలు చేసారు.
మరణం
[మార్చు]మైనేని హరి ప్రసాద రావు 88 ఏళ్ళ వయస్సులో 2016 ఏప్రియల్ 5 న చెన్నైలో మరణించారు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ https://www.jagranjosh.com/current-affairs/myneni-hari-prasad-rao-architect-of-madras-atomic-power-station-died-1459912037-1
- ↑ https://web.archive.org/web/20080729095139/http://www.hindu.com/2008/07/24/stories/2008072457091200.htm
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-02. Retrieved 2021-05-08.
- ↑ "First Project Director of Madras Atomic Power Project Passes Away". The New Indian Express. Retrieved 2021-09-10.
- ↑ IANS (2016-04-05). "Madras Atomic Power Station 'architect' M.H.P.Rao dead". Business Standard India. Retrieved 2021-09-10.