మైసూరు పట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసం
భౌగోళిక గుర్తింపు (GI)
జాబితాలో భాగం

మైసూరు పట్టు
మైసూరు పట్టు
మైసూరు పట్టు
వివరణమైసూరు పట్టు అనేది భారతదేశంలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న పట్టు.
రకంవస్త్రాలు
ప్రాంతంమైసూరు కర్ణాటక
దేశంభారతదేశం

భౌగోళిక గుర్తింపు భౌగోళిక గుర్తింపు

మైసూరు పట్టు అనేది భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న 14000 మెట్రిక్ టన్నుల మల్బరీ పట్టులో కర్ణాటక రాష్ట్రం ఉత్తత్తి చెస్తున్న పట్టు 9000 మెట్రిక్ టన్నులు. అనగా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మల్బరీ పట్టులో సుమారు 70 శాతం కర్ణాటక రాష్ట్రం నుండి ఉత్పత్తి అవుతుంది. ఈ పట్టు ముఖ్యంగా మైసూరు జిల్లాలో ఉత్పత్తి అవుతుంది. కనుక ఈ ప్రాంత పట్టును మైసూరు పట్టు అంటారు.

చరిత్ర

[మార్చు]

మైసూరు రాజ్యంలో ఈ పరిశ్రమ మొదటిసారిగా టిప్పు సుల్తాన్ పరిపాలన నుండి కొనసాగుతుంది.[1] తరువాత ప్రపంచీకరణ నేపథ్యంలో కృత్రిక పట్టు రేయాన్ తయారగుచున్నందున ఈ పరిశ్రమ సంక్షోభం లోనికి పోయింది. 20వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఈ మైసూరు పట్టు భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది.[1]

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన మైసూరు సిల్కు చీరలకు జీఐ ట్యాగ్ కూడా ఉంది. ఒక్కో చీర ఖరీదు రూ. 12 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉంటుంది. వివిధ దేశాలకు ఇవి ఎప్పటినుంచో ఎగుమతి అవుతున్నాయి.[2]

ఎయిర్ హోస్టస్ లకు

[మార్చు]

ఎయిర్ ఇండియా లోని ఎయిర్ హోస్టెస్ లు, ఫ్లయిట్ అటెండెన్ట్ లు ఇకపై మైసూరు సిల్క్ చీరలనే ధరించాలని ఆ సంస్థ నిర్ణయించింది. అందుకోసం 10 వేల చీరలు కావాలని ఎయిర్ ఇండియా సంస్థ నుంచి కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు భారీ ఆర్డర్ వచ్చింది.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 R.k.datta (2007). Global Silk Industry: A Complete Source Book. APH Publishing. p. 17. ISBN 8131300870. Retrieved January 22, 2013.
  2. ఎయిర్ హోస్టస్ లకు ఇక మైసూరు సిల్కు చీరలు!!
  3. మైసూరు సిల్క్ చీరలతో మెరవనున్న ఎయిర్ హోస్టెస్ లు…![permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]